శాస్త్రీయ జ్ఞానం కోసం "సైన్స్ " చెప్పిస్తే , ఇంగిత జ్ఞానం కోల్పోయి "చాగంటి వారి బాష్యం" లో సైన్స్ ఎక్కడ అన్నాడట !!!

                                                                 
  సరసాలాడాల్సిన వేళ శరీర విజ్ఞాన శాస్త్రం బొదిస్తున్న శాస్త్రీయ విజ్ఞాని !!!
                            
                                 నేను ఈ రోజు ఫేస్ బుక్ లో ఒక "శాస్త్రీయ జ్ఞాని " ని అని చెప్పుకుంటున్న ఒకాయన గారి టపా చూశాను. అయన గారు ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృష్టితోనే చూడాలనే అదో రకమైన  "అజ్ఞాన వేదిక " కు చెందిన వ్యక్తీ కాబట్టి , అతనికి పంచ కట్టు కట్టి ప్రవచనాలు ఇచ్చే శాస్త్రులు అన్నా , సాంప్రాదాయ వాదులు అన్నా , ముక్యంగా హిందూ మతానికి చెందిన వారంటే తగని ఒళ్ళు మంట. కాబట్టి హిందూ మతానికి చెందిన వారు చేసే పనులలో నిత్యం లోపాలు వెతుకుతూ గొప్ప "రంద్రాన్వేషకుడు " గా పేరు గాంచాడు.

   అటువంటి రంద్రాన్వేషకులు గారికి ఈ  మద్య  చూపు ధార్మిక ప్రవచకులు అయిన శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి మీద పడింది. అయన గారు తానూ పరీసీలించిన లేక అబ్యసించిన ధర్మ గ్రందాలలోని ధర్మ సూక్ష్మాలను , ప్రస్తుత పరిస్తులకు అన్వయిస్తూ , తమ వద్దకు వచ్చిన వారికి ఇంట్రస్ట్ కలిగించే విదంగా ప్రసంగం చేయడం అయన ప్రత్యేకత. పెండ్లి పెటాకులు లేకుండా , అసలు జీవితంలో ముక్యమైన గృహస్త ధర్మాన్నే విడనాడి డైరెక్టుగా సన్యాసులు గా మారి బొదలు చేసే మోడ్రన్  గురువులు కంటే , స్వయంగా జీవితం లోని గృహస్త జీవితం అనుభవించి , ఆ అనుభవం ని గ్రందాలలోని విషయాలతో కలిపి ఇనసొఓంపుగా ప్రజలకు కు ప్రవచనాలు రూపంలో అందిస్తున్న చాగంటి,  గరికపాటి లాంటి వారికి అభిమాన గణం ఉండటం లో ఆశ్చర్యం లేదు. అదిగో అదే  మన రంద్రానేవేషకులకు కడుపు మంట తెప్పిస్తుంది. తనకూ పబ్లిసిటి రావాలంటే ఇలాంటి వారిని కెలికితేనే అంతో ఇంతో పలితం కాబట్టి , ఇప్పుడు చాగంటి వారి ప్రవచనాల మీదకు  తన శాస్త్రీయ బాణాలు విసరడం మొదలెట్టాడు. రంద్రాన్వేషకులు తమ దాడికి చాగంటి వారి "సూర్యుడు - చెప్పుల కధ " ని టార్గెట్ చేసి అందులో శాస్త్రీయత ఎక్కడ అని సవాల్  చేస్తున్నాడు. చాగంటి వారు చెప్పుల  ఆవిర్బావం గురించి చెప్పిన కద గురించి విమర్శిస్తూ

        "  జమదగ్ని అనే మహర్షి గర్భిణీగా ఉన్న అతని భార్య రేవతిగారితో భాణాలాట ఆడుకుంటుండగా సూర్యుడి ఎండ తగిలి రేవతిగారికి చెమటపట్టి చీకాకుపడుతుండగా.. జమదగ్ని అది చూసి మా ఆవిడనే చిరాకు పెడతావా అని తనదగ్గరున్న చెంబులోంచి జలాన్ని తీసి సూర్యుడిని శపించబోయాడు.. అది చూసి భయపడ్డ సూర్యుడు పరిగెత్తుకువచ్చి ఋతువులనుబట్టి ఎండకాస్తు చేయడం నా ధర్మం.. మీరు నన్ను శపించెస్తే యెలా అని బదులు చెప్పుకుని.. చెమట పట్టకుండా.. కాళ్లు కాలకుండా ఉండడానికి సూర్యుడు లోకంలో లేని రెండు పధార్ధాలను తయారుచేసి జమదగ్నిగారికి "చెప్పులు.., గొడుగూ.." ఇచ్చారు.. ఆవిధంగా ఈ భూమ్మీదకి చెప్పులూ.., గొడుగూ వచ్చాయి... ఇదీ చెప్పులు గొడుగులూ యెలా వచ్చాయి అనేదానికి మన చాగంటి కోటేశ్వరరావుగారు ఇచ్చిన భాష్యం.. ఆయనకెలాగూ మంచి ఫాలోయింగుందిగాబట్టి ఓ వెయ్యి మంది ఆసభలో విన్నవాళ్లు ఆ ప్రవచనం విని 
"ఆహా... జమధగ్ని మహర్షివారు ఎంత గొప్పవారు.. ఆయన సూర్యుడినే శపించగల సమర్ధులు.. గొప్పవారు అని ఆయన్ని తలచుకుని.., ఈలోకంలోకి గొడుగులూ చెప్పులూ యెలా వచ్చాయో తెలుసుకుని.. చాగంటి వారి వాక్చాతుర్యానికి.., ఆయన చెప్పినదానికి ముగ్ధులై ఆయన్ని కూడా గురువుగారు భలే చెప్పారు.. ఆహా.. ఓహో అని అనుకుని తరవాత ఆయన చెప్పే రామాయణాలకి భారతాలకి భజన చేస్కుంటూ ఇంటికిపోతారు... రేప్పొద్దున్న ఈ భజనకెళ్లిన బేచ్చులోవారింట్లో యే పిల్లలైనా పొరపాటున "అమ్మా../నాన్నా.. అసలు చెప్పులెలా వచ్చాయంటారూ..??" అనడిగితే పైన చాగంటిగారు చెప్పిన కధనే చెబుతారు.. వాళ్లు తరవాతి తరంలో భజన బృందాలుగానే తయారవుతారు" ... అని ఫేస్ బుక్ లో తెగ బాధపడి పోయారు. 
  
                                               అసలు నాకు తెలిసినంత వరకు ప్రవచనాలు కోసం వెల్లే వారిలో అధిక శాతం వయసుపైబడిన వారు, స్త్రీలు, మానసిక ప్రశాంతత కోరుకునే వారు వెళతారు తప్పా , సూర్యుడు ఎలా ఉద్బవించాడొ , చెప్పులు ఎలా పుట్టాయో తెలుసుకోవడానికి వెళ్ళరు. వెనుకటి మన పూర్వికులు రాసిన గ్రందాల్లో ఉన్న విదానాన్ని చాగంటి వారు చెపుతున్నారు తప్పా , సూర్యుడు చెప్పులు ఇచ్చాడని చాగంటి వారు కూడా నమ్మరు అనేది సత్యం.  కద లో సందర్బాన్ని చెపుతారు కాని అదే నిజమని ఎవరు నమ్ముతారు. నమ్మి వచ్చి , ఈ  కాలపు తమ పిల్లలకి చెపుతారా? అలా చెప్పి బావి బారత పౌరులని ఈ  వయస్సు మళ్ళిన సాంప్రదాయ వాదులు చెడగొడుతున్నారా? అందుకు శాస్త్రీయ జ్ఞానులు అందోళన చెందుతున్నారా? ఎందుకు ఈ  అజ్ఞానపు అపోహలు? చెప్పులు ఎవరి వలన భూమి మీదకు వచ్చాయి అంటె "జమదగ్ని " మహర్షి అని ఒక్క వాక్యంతో సైన్స్ తెలియని వాళ్ళుకు సమాదానం దొరుకుతుంటె , సైన్స్ ప్రకారం తెలుసుకోవడానికి కనీసం కొన్నేళ్ళ విద్యా ఆర్జన చేయాల్సి ఉంటుంది. అది చిన్న పిల్లలకు అవకాశం మరియు అవసరం కాబట్టి వారు సైన్స్ ద్వారానే సమాదానం కనుగుని సంతృప్తి చెందుతుంటే, వయసు మళ్ళిన వారు ఒక్క కదతో సంతృప్తి చెందుతున్నారు. లేకపోతే వారు చెప్పుల పుట్టుక గురించి మల్లీ చదువు కోవాల్సి వస్తుంది. అవసరమా వారికి? వారు తెలుసుకోలేనిది వారి తర్వాతి తరాలు తెలుసుకుంటున్నాయి . అది చాలదా? చాగంటి వారి వారి ప్రవచనాల వల న ప్రశాంతత పొందే వారిని , సైన్స్ పాటాలు చెప్పి చెడగొత్తాలి అనడం తప్పకుండా ఇంగిత జ్ఞానం లేక పోవడమే . 

  మనిషికి శాస్త్రీయ జ్ఞానం ఎంత అవసరమో అలౌకిక ఆనందం కూడా అవసరమే. అది తక్కువ పాలులో అయినా ప్రతి మనిషికి కావాల్సిందే. కోటి ఊహలతో , పాలగ్లాసుతో శోభనం గదిలోకి వచ్చిన పెండ్లి కూతురుకి , శరీర విజ్ఞాన శాస్త్రం చెపితే సంసారం మీద విరక్తి చెంది సన్యాసిని కావడం ఖ్హాయం. అలాంటి సమయంలో ఆమెకు అబద్దాలు అయినా తీయటి మాటలే చెప్పాలి కాని , సొల్లు నిజాలు కావు. అలగే మానసిక ప్రశాంతత కోరి వచ్చే వారికి కూడా చాగంటి వారి ప్రవచనాలే తప్పా , సైన్స్ పాటాలు కావు అని ఈ ఇంగిత జ్ఞానం కోల్పోయిన ఆ అదోరకమైన  "అజ్ఞాన వేదిక " వారికి ఎప్పుడు అర్దం అవుతుంది. ?

    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!