తెలంగాణా హోం మంత్రి గారి మీసాల పవర్ కు సవాల్ విసిరిన నలుగురు రేపిస్ట్ హంతకులు!
ఒక రాజ్యంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలంటె ,సామాన్య ప్రజలకు చట్టాలు మీద గౌరవంతో పాటు వాటికి నిబద్దులై నడచుకునే తత్వం అలవడి ఉండాలి .అలాగే నేర ప్రవ్రుత్తి కలిగిన వారికి, చట్టాలను అమలు చేసే అధికారులు అంటె గుండెల్లొ రైళ్ళు పరుగెత్తాలి. అలా కాకుండా డబ్బుకు ఆశపడి తోకూపుకుంటు పనిచేసే లాలుచి యంత్రాంగం ఉన్న సమాజంలో మూడు రేప్ లు ఆరు మర్డర్ లు తప్పా ఇంకా ఏమి కానరావు. నిన్న రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటణ యావత్ తెలంగాణా ప్రజలు తల దించుకునే లా ఉంది . ఇది డిల్లి నిర్భయ కేసుకన్నా ఘోరాతి ఘోరమైన కేసు. కాని విచిత్రం ఏమిటంటే దీని మీద మహిళా సంఘాలు కాని, కనీసం బాదితుల సామాజిక వర్గానికి చెందిన వారినుండి కాని స్పందన లేదు. బహుసా ప్రస్తుతం బయట కాస్తున్న ఎర్రటి ఎండలకు ఆడోళ్ళ చైతన్యం మాడి పోయి ఉంటుంది . మనం నవ నాగరీకుల...