షేక్ జాస్మిన్ ఆత్మహత్య , శ్రీ సాయి చావు కొచ్చ్చిందంట !!
పుణ్యానికి పొతే పాపం ఎదురైందంటారు చూసారా !. అదిగో అచ్చం అలాగే జరిగింది వేముల శ్రీ సాయి మరియు అతని స్నేహితుని విషయం లో . గుంటూరు జిల్లా , నిజాంపట్నం మండలం , మహమ్మదీయపాలెంలో జరిగిన ఈ యదార్థ సంఘటన , అపోహ మనుషుల్ని ఎంత విచక్షణ హీనులుగా చేస్తుందో కళ్ళకు కట్టినట్లు చేస్తోంది. ఇక వివరాలలోకి వెళితే , మహమ్మదీయ పేటకు చెందిన షేక్ జాస్మిన్ కి 19 ఏండ్లు . కాలేజీలో చదువుకుంటుంది కాబోలు ఆమెకు ఎదో కలుగరాని కష్టం కలిగి , బ్రతికే దారి కానరాక ఉరేసుకుని చనిపోదామని నిర్ణయించుకుంది. అదే విషయం తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసి కూడా చేప్పిందంట . ఆ తర్వాత ఉరివేసుకుంటుంటే దానిని గమనించిన 2 యువకులు వేముల శ్రీ సాయి మరియు అతని స్నేహితుడు...