"కాలామని" + కాంతామణి = కాల్ మనీ
ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20 వేల కోట్ల రూపాయల స్కాం గా అభివర్ణిస్తున్న "కాల్ మని " వ్యవహారంలో సామాన్య ప్రజలకు అంతుపట్టని అనేక విషయాలు ఉన్నాయి. చూడబోతే కాల్ మనీ గుట్టును కావాలనే పధక రచయితలు బయటపెట్టడం వలననే వెలుగులోకి వచ్చినట్లు కనపడుతుంది. దానిలో బాగంగానే పోలిస్ వారి దాడులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఈ కాల్ మని దందాలో చోటామోటా రాజకీయ నాయకులు, క్రింది స్తాయి పోలిసులు అప్పులు ఇచ్చిన వారైతే , వాటిని తీసుకుని తిరిగి కట్టలేని వారు ఎక్కువమంది స్త్రీలే కావడం విశేషం . సదరు స్త్రీ లు ఫోన్ చేయగానే ఇంటికి వెళ్లి కేవలం ప్రామిసారి నోట్లు మీద సంతకాలు లాంటివి తీసుకుని లక్షలు , లక్షలు ఇచ్చెయ్యడం , తిరిగి వారు వడ్డీ కాదు కదా అసలు కూడా చెల్లించలేని పక్షం లో, వారితో వ్యభిచారం చేయించి అయినా తమ డబ్బులు రాబట్టుకోవాలని చూసే నీచ సంస్క్రుతి , రెగ్యులర్ గా డబ్బులను వడ్డిలకు తిప్పే వారిలో ఉంటుందా? ఇలా చేస్తే వారి వడ్డి వ్యాపారాలు మూతపడి పోతాయని తెలియదా వారికి? కాబట్టి సాంప్రదాయ వ