ఒక్క రోజులో 6000 పైగా పేస్బుక్ క్లిక్ లు , 1600 పైగా బ్లాగ్ వీక్షకుల లుక్ లు సాదించిన "మనవు" బ్లాగ్ పోస్ట్ !
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు! మనిషి కుక్కను కరిస్తే వార్త! అనేది పత్రికా ప్రపంచంలో తలలు పండిన వారి ఉవాచ ! నిజమే మరి! పనికొచ్చే వార్తలు , వాటి మీద విశ్లేషణల పేరుతో రోజూ ఏదో ఒకటి బ్లాగుల్లో ప్రచురిస్తున్నా వీక్షకులు మాత్రం కొంచం వెరైటి గా ఉన్న దానిని ఎక్కువుగా ఇష్టపడుతుంటారని నాకు బ్లాగర్ గా అనుభవమే . బ్లాగులు ఎంత వీక్షకాదరణ పొందినప్పటికి రొటీన్ మాటర్ ని పెద్దగా పట్టించుకోరు అనేది కూడా వాస్తవం!ఒక్కొక్క సారి మనం ఎంతో మంచి విషయం పది మందికి పనికొచ్చే దానిని ప్రచురిస్తున్నాం అని హుషార్ గా పోస్ట్ దానికి వచ్చే స్పందన చూసినప్పుడు బోల్డంత నీరసం వస్తుంది . ఎందుకంటే "రోటీన్ మాటర్ " అనే ద్రుష్టి తో అది పది మందిని ఆకర్షించ లేక పోవడమే . అలా అని ఆకర్షించే మాటర్ పేరుతో ఏది పడితే అది పోస్ట్ చెయ్యాల్సిన అవసరం చాలా మంది బ్లాగర్ లకు లేదు. బ్లాగ్ లను ఏ ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్నామో , దానికి కట్టుబడి ఉన్న దానినే కొంత ఆకర్షనీయంగా మార్చి , పోస్ట్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాను. అన్నింటికి వేల వీక్షణాలు రావలసిన అవస