కేవలం గోడకు బొక్క ఖర్చుతొ కోట్ల రూపాయల పబ్లిసిటీ ఇచ్చిన "తనిష్క్ జ్యుయలరి" దొంగలు !
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే దాని వెనుకాల ఒక పరమార్దం లేకపోయినా , ఖచ్చితంగా స్వార్ధం ఉంటుంది .ఇటివల సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ లోని "తనిష్క్ జ్యుయలరి " షాప్ లోని నగల దొంగతనం కేసు విషయంలో ,తమకు తాము దొంగలు గా ప్రకటించుకుని స్వచ్చందంగా మీడియా ముందుకు వచ్చిన కిరణ్ , అతని బందువైన ఆనంద్ చెపుతున్న అంశాలు నమ్మ దగిన విదంగా లేవు . సుమారు ఆరున్నర కోట్ల విలువైన బంగారం సునాయాసంగా అంటే కేవలం ఒక సుత్తి, స్క్రూ డ్రైవర్ తో గోడకు బొక్క పెట్టి , నదురు బెదురూ లేకుండా , అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న కిరణ్ బయట ఉంటే , నడవడానికే ఇబ్బంది పడుతున్న వికలాంగుడైన ఆనంద్ షాపులోకి ప్రవేసించి అంత బంగారం , సుమారు గంటన్నర సేపు దొంగిలించి , ఆ బంగారం మొత్తాన్ని నింపాదిగా క్యారి బ్యాగులలొనె తమ రూముకు చేర్చారు అనే కహాని నమ్మట్టానికి మనకు కూడా దైర్య సాహాసా లు కావాల్సిందే . (పూర్తీ వివరాలకు క్రింది విడియోలు చూడగలరు ). ఇక పొతే తనను ఎవరూ గుర్తు పట్టకుండా అసలు దొంగ ఆనంద్ దొంగ తనం చేసే సమయంలో టోపీ పెట్టు కున్నాడట. పోలియో వలన కలిగి