అతను ప్రేమించినది ఎవర్ని? భార్యనా? లేక ఆమెనా?
ఇది ఒక బార్యా,భర్తల ప్రేమ కథ లాంటి నిజం.వారివురు భార్యా భర్తలు.అతను ప్రభుత్వ ఉడ్యొగి, ఆమె గ్రుహిణి . వారివురు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు అని చెప్పవచ్చు. అమే లేనిదే జీవితమే లేదు అన్నట్టు ప్రవర్తించేవాడు అతను ఆమే అంతె. ఎక్కడికి వెళ్ళినా జంటగానే వేళ్లేవారు. వారి కి ఇద్దరు ఆడపిల్లల్లు. సంసారం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫిగా హాపీగా సాగిపోతుండెది.ఇద్దరు ఆడపిల్లల్లు యుక్తవయస్కులు అయ్యారు. అటువంటి తరుణంలో ఆ దేవుడికి వారి ప్రేమను చూసి కన్ను కుట్టిందేమో, పాపం ఆమెకు కాన్సర్ జబ్బు చేసి సంవత్సరం లోపులోనే చనిపోయింది. మేమంతా చాలా బాద పడ్డాం. అతను ఎలా జీవిస్తాడు అన...