పెళ్లికి అనుమతి అఖ్ఖర్లేదు కాని, పెటాకులు అయితే మాత్రం వాటా ఇవ్వాల్సిందేనట!

తనదేమి పోదు కాబట్టి కాశీ దాక దేకమన్నాడట, వెనుకటికెవ్వడో!. అలాగే ఉంది మొన్న కేంద్ర మంత్రి మండలి వారు తీసుకున్న నిర్ణయం. హీందూ వివాహ చట్టం అని పేరే కాని దాని లోని అంశాల మీద చట్ట సవరణలు చెయ్యాల్సి వచ్చినప్పుడు మాత్రం, హిందూ పరంగా కాకుండా రాజకీయ నిర్ణయానిదే పై చేయి అవుతుంది. ఇంత వరకు ఉన్న చట్టాలను అనుసరించి, బార్యా బర్తలు విడి పోవాల్సీ వస్తే భర్త స్వార్జితంలో భార్యకు కూడా వాట ఇవ్వాలి. ఇది సమంజసమయినదే. ఎందుకంటే భర్త పేరున ఆస్తి కూడపెట్టినప్పటికి, అందులో బార్య సహాకారం కూడ ఉంటుంది కాబట్టి. కాని భర్త యొక్క పిత్రార్జిత ఆస్తిలో కూడ విడాకులు తీసుకునే భార్యకు కూడా వాటా ఇవ్వాలంటే కొంచం ఆలోచన చెయ...