"మేనక " లు ముందు "యోగా " పని చేస్తుందా , మురళి మనోహర్ జోషి గారూ !!!?
నిన్న BJP పార్టీ వృద్ద నేత ,మాజీ మంత్రి వర్యులు అయిన శ్రీ మురళీ మనోహర్ జోషి గారు ,దేశంలో లో పెరిగిపోతున్న అత్యాచారాల నివారణకు ఒక కొత్త చిట్కా చెప్పారు . పురుషులు గనుక రోజూ యోగా చెస్తే ,వారిలో ని మృగత్వం నశించి మానవత్వం పరిడవిల్లు తుందని ,దాని వలన దేశంలో అత్యాచారాలు పూర్తిగా అగకపోయినా ,వాటి రేటు గణనీయంగా పడి పోతుందని సెలవు ఇచ్చారు .చాలా బాగుందే చిట్కా అనుకున్నాను . కాని అంతలోనే ఒక డౌట్ వచ్చింది . మరి అదే నిజమయితే యోగా గురువులు ఉన్న ఆశ్రమాలలో అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? దానికి కారణం ఒకటే . కొంత మంది స్త్రీలు ప్రవర్తించే తీరును కొంత మంది పురుషులు తప్పుగా అర్ధం చేసుకోవడం ఒక కారణమయితే , మితి మీరిన స్వేచ్చా బావనలు ,మితి మీరిన స్త్రీ పురుషుల సన్నిహితత్వం వారిని ఒక బలహీన పరిస్తితుల్లోకి నెట్టడ...