'మోరల్ పోలిసింగ్ ' చేసిందని ముసలమ్మను చంపిన 'పక్కింటి నాగరాజు'.!!
ఆమెపేరు గుదిగొండ చుక్కమ్మ. ఆమెకు 75 సంవత్సరాలు . వెనుకటి తరం మనిషి కాబట్టి, కొంచం సాంప్రదాయపు కట్టు బాట్లు కలిగిన వృద్దురాలు . అందుకే తన ఎదుటనే ,వివాహిత అయిన తన మనవరాలితో ,పక్కింటి పోరంబోకు వాడు వచ్చి చనువుగా మసులుతుంటే సహించలేక పోయింది. "మీకిదేమి పొయే కాలం "అని ఇద్దరినీ కేకలేసింది . అంతే కాదు ,"మీ ఆవిడని అదుపులో పెట్టుకో ,లేకపోతె నీ కాపురం కూలిపోతుంది "అని మనవరాలి మొగుడికి హితబోద చేసింది . దాని పర్యవసానం,మనవడు మనవరాలికి మద్య తగాదాలు జరిగి ,మనవరాలు పుట్టింటికి వెలితే ,మనవడు ఖమ్మం వెళ్లి పోయి అక్కడే ఉండటం ప్రారంబించాడు . పక్కింటి వాడి వలనే తన మనవరాలి కాపురం లో సమస్యలు వచ్చాయని అందరితో చెప్పి వాపోయింది చుక్కమ్మ. చుక్కమ్మ వలననే పక్కింటాయన పెళ్ళాం తో తన కున్న చనువు బందం తెగిపోయిందని తెగ బాద పడిపోయిన ,పక్కింటి నాగరాజు ,తన స్నేహితుని సంప్రదించి ,ఒక రోజు ముసల్లమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి జొరబడి ఆమె గొంతు నులిమి చంపి ,అ నేరం దొంగతనానికి వచ్చి...