కంచర పాలెం అమ్మాయి స్కూల్ కు వెళ్ళక పొతే, లెక్కల మాస్టర్ ఒళ్ళు పగలాల్సిందేనా ?

ఈ మద్య తెలుగు ప్రజలు బాగా చైతన్య వంతులై పోయారు . ఎంత చైతన్యo అంటే ఆడపిల్లలు ఒక మాట తమ పంతుళ్ళు గురించి చెపితే చాలు ఇక వారె అన్ని అధికారాలను తమ చేతులలోకి తీసుకుని నిందితులను విచారణ చేయకుండానే శిక్షించే స్తాయికి ఎదిగి పోయారు . చివరకు పోలీసులు కూడా అలా ప్రజలు చట్టాలను తమ చేతుల్లోకి తిసుకోవడాన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు తప్పా వారినేమి అనలేక పోతున్నారు . చివరకు ఈ అరాచక దండన విదానం ఎక్క డికి దారి తీస్తుందో అర్ధం కావడం లెదు. నక్సైలైట్లు నిర్వహించే "ప్రజా కోర్టులు " కాన...