Posts

Showing posts from May, 2013

పిల్లల్ని మరబొమ్మలు గా మారుస్తున్న ఈ చదువులు అవసరమా?

                                                                      అసలు పిల్లలకి స్వేచ్చ లేకుండా పోయింది. చదువుల పేరుతో వారి జీవితాలను అటు తల్లి తండ్రులు, ఇటు విద్యా సంస్తలు రాచి రంపాన పెడుతున్నాయి. సంపాదనా ఉన్మాదుల చేతులలోకి విద్యా సంస్తలు వెళ్ళిపోయాయి. వారికెప్పుడు డబ్బు మీద యావ. దాని కోసమ్ విద్యార్థులను ఆకర్షిమ్చే క్రమం లో,ఎప్పుడో పదేళ్ల తర్వాత చదివే కోర్సులను కూడా ప్రాధమిక స్తాయి నుంచే బోధించడం జరుగుతుందని చెప్పి, తల్లి తండ్రుల దగ్గర్నుంచి లక్షల, లక్షల పీజులు వసూలు చేస్తున్నారు. ఇక తల్లి తండ్ర్లు అయితే కొన్ని స్కూళ్ళలో తమ పిల్లల్ను చేర్చగానే, తమ పిల్లలు పెద్ద కలెక్టర్లో, డాక్టర్లో, ఇంజనీర్లో అయినట్లు ఇతరులతో చెప్పుకుని అదేదో స్టేటస్ సింబల్ గా ఫీలవుతుంటారు.   ఇక అక్కడ పిల్లల పరిస్తితి ఎంత దారుణంగా ఉంటుందో ఎపుడయినా ఆలోచిస్తారా? లేదు ఎంత వరకు మార్కులు ఎన్ని వస్తున్నాయి? క్లాసులొ వారి రాంకెంత ఇదే ఆలోచన. ఏ వయసు తగ్గట్లు ఆ పనులు చేయటమే మనిషి ఆచరించవలసింది.ఏదో వేల మంది పిల్లలో పదుల సంఖ్యలో రాంకులు వచ్చినంత మాత్రానా ఆ విద్యా సంస్త ఏమన్నా గొప్పదా? ఎవరెజ్ పిల్లల్ని పట్టించుకోని

దండలు వేసుకుంటే, పెండ్లి చేసుకున్నట్లయితే,బండలు వేసుకుంటే విడాకులు తీసుకున్నట్లా?

Image
                                                                                                             అప్పుడప్పుడు  మన  కె.సి.ఆర్. అన్న కొత్త కొత్త నిర్వచనాలు ఇస్తుంటారు. అలాంటిదే నిన్న పెండ్లి సందర్బంగా  అయన ఇచ్చిన నిర్వచనం. నిన్న ఆయన గారు ఏదో పెండ్లికి  అహ్వానిస్తే వెళ్ళి నట్లుంది.అక్కడ తెలంగాణా గురించి కాని, రాజకీయాలు గురించి కాని మాట్లాడడానికి సందర్బం కాదనుకున్నట్లుంది. మరి ఏమి సందేశం ఇవ్వాలా అని ఆలోచించి నట్లుంది. నలుగురికి నచ్చినది తనకు ఎలాగు నచ్చదు, కాబట్టి అసలు ఈ తాళి కడితే నే పెండ్లి అయినట్లు బావించమనే సిద్దాంతం ఎకాడినుంచి వచ్చిందా అని కించిత్ ఆలోచించ గా ఆయనకు చటుకున్న చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర గుర్తుకు వచ్చింది. అంతే వెంటనే విషయం విడమరచి చెప్పే సరికి అక్కడున్న వరు తెల్లబోయారట!   ఇంతకి" తాళి కడితేనే ఆలి " అనే సాంప్రదాయం మనకు లేదట! పూర్వం జస్ట్ పూల దండలు మార్చుకుంటే,పెండ్లి అయినట్లు అంట! కాని రాను  రాను ముస్లింల డండయాత్రల వల్ల , వారు కన్నెలను మాత్రమె  చెరపట్టే గుణముంది కాబట్టి, కేవళం వారికి పెండ్లి అయిన స్త్రీ అని కనపడడం కోసమే తాలిబొట్ల  సాంప్రదాయం

చార్జ్ షీట్ లో పేరు ఉన్నంత మాత్రానా "ఐ.యె.యస్" కి అనర్హుడు ఎలా అవుతాడు?

                                                                                                                                          వీరి రాజ్యమ్ ఏదో నీతివంతమయిన రాజ్యమని పాలకులు బావిస్తున్నట్లుంది. ఈ దేశంళొ  అనేక మంది తప్పుడు కేసులలొ ఇరుక్కుని, యేండ్లకు యేండ్లు కోర్టులు చుట్టూ తిరుగుతూ, చివరకు గత్యంతరం లేక బ్లాక్ మెయిల్ గాళ్ళతో  రాజీకి వచ్చి నిర్వేదంగా మారి పోతున్నారు. రాజకీయంగ బలమున్న వాళ్ళు, డబ్బున్నవాల్ళు, కోర్టు కేసులను ఒక అయుదంగ చేసి అమాయకులను వేదిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టే వారికి సరైన శిక్షలు విదించే పకడ్బంది చట్టాలేవి లేక పోవడం బ్లాక్ మెయిలర్ల పాలిట వరమయింది.   మరి ఇటువంటి పరిస్తితులు ఉన్నా బారత దేశం లో చార్జ్ షీట్లో పేరుందన్న కారణంగా అభ్యర్థి నియామకం నిలిపివేయడం ఎంత వరకు సబబు? ఒక ఉదాహరణ చెపుతాను. నాకు తెలిసిన కుర్రాడు  "ఐ.యె.యస్" కి ప్రిపేర్ అవుతున్నాడు. అతనికి రాంక్ వస్తుందని అతనికి గట్టి నమ్మక్కం. వారి ఇంటి ప్రక్కన ఉండే ఒక వ్యక్తి ఆ అబ్బాయి ఖాళి స్తలాన్ని ఆక్రమించుకుని, బెదిరిస్తే పోలిస్ స్టేషన్లో ఆ అబ్బాయి కుటుంబ సబ్యులు కేసు పెట్టారు. దానికి

గోవుల్ని కాపాడమంటే,అసలు ఆవుల్నే మాయం చేస్తున్న అధికార్లు!

                                                                           అసలు మనకు  భక్తి  లేదు! ఉంటే ఇలా మన దేవాలయ వ్యవస్త బ్రష్టు పట్టి పోదు. హిందువులంటే మంచివారు. ఉదారులు,నీతిని అవినీతిని ఒకే రీతిగా చూడగల సమ వాదులు. అందుకే ఎండోమెంట్ అధికార్లుకి హిందూ బక్తులు అంటే బొత్తిగా బెరుకు లేకుండా పోయింది కాబోలు. లేకుంటే నిన్న కాక మొన్న సింహా చలం అప్పన్న స్వామీ సన్నిదిలో "గోశాలలోని" గోవులు సుమారు వంద దాకా ఒక్క సారిగా మరణిచాయని,భక్తులు అందోళన చెందితే వాటి నివారణకు చర్యలు తీసుకుంటామని సాక్షాతు ఎండోమెంట్ మినిస్టర్,అత్యున్నత సమీక్షా సమావేశమనంతరం ప్రకటించి , నలబై ఎనిమిది గంటలు గడవక ముందే,ఆలయ అధికారి ఇంత ఘోరానికి తలపెడతాడా?    మొన్న రాత్రి సింహాచలం దేవస్తానానికి భక్తులు సమర్పించిన పన్నెండు గోవులను, ఆలయ సూపరింటెండేంట్ ప్రోత్సాహాంతో, ఏడుగురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుంటే స్తానికులు పట్టుకుని పోలిసులకు అప్పగిస్తే, ఆ సూపరింటెండేంట్ ని సస్పెండ్ చేసి విచారణకూ అదేశించారట ఆలయ కార్యనిర్వహణాది కారి. ఈ ఉదంతం  భక్తుల మనోబావాలను ఎంతగా గాయపరుస్తుందో వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఎండోమెంట్ అధి

ఇంట్లో బాలుడైనా ఇంతికి మగాడే!

                                                                        ఈ రోజు ఒక వార్త చూశారా!అమ్మాయికి పదమూడేళ్లు, అబ్బాయికి పదిహేనేళ్ళు. ఇద్దరూ లవ్ లో పడ్డట్లుంది. పెద్దవాళ్ళేమో పాపం చిన్న పిల్లలులే, వాళ్ళ మద్య ఏముంటుంది? స్నేహం తప్పా, అని అనుకుని స్వేచ్చగా వదిలేసి ఉంటారు. తల్లితండ్రులు తమ బాద్యత మరచిపోయినా, సమాజం తన ధర్మం మరచిపోయినా, ప్రక్రుతీ ఎన్నడూ తన ధర్మం మరచిపోదు కదా! అందుకే,వారివురి బాల్య ప్రేమ కు ప్రతిపలంగా ఆ బాలిక గర్భవతైంది అట!ఇప్పుడు ఆ పిల్లలు ఏమి చెయ్యాలి? వాళ్ళని కన్న పెద్దలు ఏమి చెయ్యాలి? పెళ్ళి చేద్దామంటే బాల్య వివాహ నిషేద చట్టం ప్రకారం చెల్లదు, పైగా నేరం కూడా.ఆరోగ్యరీత్యా కూడా బాల గర్బాలు మంచివి కావు.   తల్లితండ్రులు అనే వారు,వయస్సు వచ్చిన యువతీ యువకుల పట్లే కాదు, బాల్య దశ లో ఉన్న పిల్లలపట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని ఈ ఉదంతం తెలియ చేస్తుంది.అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు చూస్తున్న సినిమాలు, టి.వీ.లు, ఫ్రెండ్స్ కల్చర్ ఇవ్వన్నీ వాళ్ళని అపమార్గం పట్టించేవిగా ఉన్నాయి తప్పా, వారి మద్య సోదర, సోదరి బావాలు పెంపొందిచేవిల లేవు. వారు ఈ విదంగా చెడిపోవటాన

గోవుల్ని కాపాడలేని వారు, గోవిందుని ఆస్తులు కాపాడగలరా?

                                                                                                                               ఈ రోజు మన దేవాదాయ శాఖా మంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే చాల ఆశ్చర్యం వేసింది. సింహా చలం అప్పన్న సాక్షిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యానికి, చేతకాని తనానికి గుర్తుగా దేవస్తాన గోశాల లోని  గోవులు మరణిస్తే, ఇక రాష్ట్రంలో  దేవాలయల గోశాలలో ఉన్న గోవుల్ని కాపాడడం తమ డిపార్ట్మెంట్ వల్ల కాదని తేలుస్తూ,సదరు గోవుల్ని కాపాడడానికి స్వచ్చంద సంస్తలు ముందుకు రావల్సిందిగా విజ్ణప్తి చేసారు మన రాష్ట్ర దేవాదాయ దర్మాదాయ శాఖామాత్యులు! ఈ విషయంలో నిజాన్ని నిజయీతిగా ఒప్పుకున్నందుకు మంత్రి గారికి రాష్ట్రంలోని హిందువులంతా దన్యవాదాలు తెలపాలి.    ఏదైనా సరే ఆదాయం వచ్చేవాటికి ఎండొమేంట్ డిపార్ట్మెంట్ వారు పెద్దకొడుకుల్లాగా ముందుకొస్తారు. భక్తుల ఆద్వర్యంలో సమర్దవంతంగా నిర్వహించబడుతున్న మత సంస్తలైనా సరే, చాటు మాటు రాజకీయాలను ప్రేరెపించి సంస్తలను ఎండోమెంట్ పరిదిలోకి తీసుకు వచ్చే దాక నిద్రపోరు ఘనమైన అదికార్లు. కాని అదే డిపార్ట్మెంట్ వారు ఆదాయం లేని గుళ్ళను కనీసం కన్నెత్తి చూడరు స

కొత్త కోడళ్ల పట్ల చూపాల్సింది ప్రేమా? గౌరవమా?

                                                                          ఎవరైనా ఒక అమ్మాయి కొత్తగా పెండ్లయి, అత్తవారింట్లో అడుగు పెడుతున్నప్పుడు, భయమూ, బెరుకు ఉండడం  సహజం. అత్తవారింట్లో ఎలా మెలగాలో,ముఖ్యంగా అత్త మామల పట్ల, ఆడబిడ్డలు పట్ల ఎలా మసలుకోవాలో తల్లి తండ్రులు చెప్పి పంపుతారు. అయినా కొత్త చోట భర్తతో సహా అందరూ కొత్తవారే కాబట్టి బెరుకుతనం ఉండడం సహజం.మరి అటువంటి కొత్త కోడలు పట్ల మెట్టినీంటి వారు చూపాల్సింది ఏమిటి?    సహజంగా తమ కుటుంబం కంటే గొప్ప కుటుంబం (అంతస్తులో) నుండి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్న వారు, ఎక్కువ కట్నం తెచ్చిందని కావచ్చు, లేక తమకంటే ఆమే తల్లి తండ్రులు దనవంతులు అని కావచ్చు ఆమెను చాలా గౌరవంగా చూస్తారు. అదే ఇంటిలో తక్కువ కట్నంతో వచ్చిన కోడల్ని కొంచం చిన్న చేసి చూస్తారు. దీని వలన సహజంగానే ఆ కోడళ్ల మద్య బేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కాని దన ప్రాప్తి అనేది కేవలం శక్తి సామార్ద్యాల మీదే కాక అద్రుష్తానుసారం కూడ కలుగుతుంది అని తెలిసిన వారెవ్వరూ, పిల్లల్ని వారి వారి హోదాలానుసారం ప్రేమించడం లేక గౌరవించడం చెయ్యరు. ఇది కుటుంబ విదానానికే గొడ్డలి పెట్టు.    కోడళ్లని తమ కుట

లక్ష మంది విద్యార్దులు మరియు వారి తల్లి తండ్రులు Vs ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వము

                                                                                                                                     జులై రెండవ తారీకు దాక ఏ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేది లేదన్న బారత సర్వోన్నత న్యాయస్తానం హఠాత్తుగా నిన్న "నీట్’ పై వెలువరించిన మద్యంతర ఉత్తర్వులతో, ఆంద్రప్రదేశ్ లోని లక్షమంది వైద్య విద్య ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల ను పెద్ద "నీట్" గండం నుంది బయట పడేసారు. లేకుంటే గత నాలుగు నెలలుగా ఏమి చదవాలో, ఏమి రాయాలో తెలియని ఆయోమయ పరిస్తితిలో విద్యార్థులు, వారు పడుతున్న టెన్షన్ చూసి, బాదతో తల్లడిల్లిన తల్లితండ్రులు మరియు మనసున్న లెక్చరర్లు అందరూ మరొక రెండు నెలలు టెన్షన్ కు గురి కావల్సి వచ్చేది. అసలు ఇలా జరగడానికి కారకులు ఎవరు?.    వైద్య విద్యా విదానంలో జాతీయ స్తాయిలో ఒక సమగ్ర విదానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా బారత వైద్యమండలి, జాతీయ స్తాయిలో" నీట్" పరీక్షను తప్పని సరి చేస్తూ, ఈ సంవత్సరం నుండే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో,ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్దులకు గుండెల్లో రాయి పడింది. కారణం

నిజంగా కష్టకాలం ఎవ్వరికి? జగన్ కా! షర్మిలకా?

Image
                                                                        మనం కొన్న విషయాలను సాదారణ ద్రుష్టో చూస్తే ఒక తీరుగా అనిపించవచ్చు. కాని దానినే ఇంకొక కోణంలొ ఆలోచిస్తే ఇంకొక తీరుగా అనిపించ వచ్చు. మొత్తానికి ఏ విషయం మీదైనా సమగ్ర ద్రుష్టి కావాలంటే, అన్ని కోణాలోనుంచి విషయ పరిశీలన చెయ్యడం అవసరం.    ఈ రోజు పాపం జగన్ గారి అభిమానులు ఎంతో ఆశగా చూశారు. జగన్ గార్కి బెయిల్ వస్తుందేమోనని!. కాని వారికి నిరాశనే మిగులుస్తూ, సుప్రీం కోర్టు వారు మరో         రోజులు వేచి చూడ మన్నారు. ఏది ఏమైనా జగన్ గారు చట్టానికి సహకరిస్తున్న "నిందితుడు" మాత్రమే, "నేరస్తుడు" కాదు. కాబట్టి త్వరగా దర్యాప్తు ముగించలేకపోవడం "సి.బి.ఐ. వారు చిన్నపుచ్చుకోవలసిన అంశమే తప్పా, జగన్ గారు కాని, వారి అబిమానులు కాని బాద పడాల్సింది ఏమి లేకపోవచ్చు."డబ్బున్న వాడు జైల్ లో ఉన్నా, బెయిల్ పై ఉన్నా ఇండియాలో తేడా ఉండదు" అని అంటుంటారు  అనుభవజ్ణులు . అసలు నన్నడిగితే జగన్ గారు చాలా అద్రుష్ట వంతులు. ఎలాగంటారా?   అసలే ఈ యేడాది ఎండలు మెండుగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న మనకే (ఎ.సి. లేని వారికి), ఠారెత్తి పోతు

"సుంకాలమ్మ తల్లి" గుడి పడగొట్టిన, "గాలి పార్టి" గాలిలో కలిసింది!.

                                                                    మనిషి ఎంత గొప్పవడైనా కావచ్చు. ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు.తాను ఎల్ల జగతికి మకుటం లేని మహారాజు కావచ్చు. కాని భక్తులు కొలిచే ఒక అమ్మవ్వరి గుడిని తన అక్రమ సంపాదన కోసం కూల్చివేసి, చెప్పలేని మహా అపరాదం చేస్తే ఏమీ కాదనుకోవడం అది భ్రమే అవుతుంది అని నిరూపించాయి నేటి కర్ణాటక ఎన్నికల పలితాలు.   గాలి జనార్ధన్ రెడ్డి, ’ది గ్రేట్ మైనింగ్ కింగ్’. ఆయన అనుమతి లేనిదే కన్నడ ప్రబుత్వం కాలు కదపలేదు. నోరు మెదపలేదు. దేశంలోని ప్రతిపక్ష పార్టీని ఒక పదకం ప్రకారం కన్నడ దేశంలో అదికార పార్టీగా మార్చి, తాను అదిపతి అయి,ఇటూ ఆంద్రా లోని అధికార పార్టికి చెందిన  తన సామాజిక వర్గం వారి అండదండలతో, అనతి కాలంలోనే, తిరుగులేని మైనింగ మాఫియా కింగ్ అయి, రెండూ రాష్ట్రాల సరిహద్దులను అక్రమంగా చెరిపివేసి, ఇనుపఖనిజాన్ని కొల్లగొట్టి, కోట్లకు అదిపతిగా మరాడు. ఆ అక్రమ,సంపాదన గర్వంతో తాను ఏమిచేస్తే అదే చెల్లుబాటు అని, మైనింగ్ పనులకు అడ్డంగా ఉందన్న నెపంతో అడవిలోని "సుంకాలమ్మ తల్లి" గుడి ని కూల్చి వేశారు ది గ్రేట్ గాలి బ్రదర్స్. అప్పుడే మొదలైంది వారి పత

భగవత్ ప్రసాదాన్ని "అంగడి సరుకు"గా మార్చిన అధికార్లుకి ఏ పాపం చుట్టుకోదా?

Image
                                                                  అసలు వీరికి భగవంతుడు అంటే నమ్మక్కం ఉందా?. ఉంటే ఇలా చేస్తారా? చివరకు భక్తులకు పంచే ప్రసాదం కూడా అమ్ముతార?. కొనుకు తిన్నది అసలు భగవంతుని ప్రసాదం ఎలా అవుతుంది? ఖచ్చితంగా అది అంగడి సరుకే అవుతుంది! ఈ చిన్న విషయం తెలియక ఇన్నాళ్ళు మనం ఎంత తప్పు చేస్తున్నాం!ఒక్కసారి ఆలోచించండి ఓ భక్తులార, భగవత్సేవకులార,మనం భగవంతుని సన్నిదిలో, ఆయన దర్శనం అనంతరం తీర్థ, ప్రసదాలు స్వీకరించడం సాంప్రదాయం.అటువంటి తీర్థప్రసదలు, నాకు తెలిసి అన్ని దేవాలయాలలో ఉచితంగానే పెడతరు. భక్తులు వాటిని ఎంతో భక్తిప్రపత్తులతో స్వీకరించి, జన్మ ధన్యమైనట్లు బావిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది.   కాని, అదే దేవాలయాలలో, ఆ దేవుని ప్రసాదమని చెప్పి, లడ్డూ, పులిహోర, ఇతర పదార్థాలు విక్రయం చేస్తుంటారు. వీటిని ఒక్కొక్కసారి,లాభ నష్టాల బేరిజులు వేసుకుని, పదార్థ పరిమాణాలు  తగ్గిస్తూ ఉంటారు. అసలు దేవుని పేరు మీద ప్రసాదం అమ్మడం హిందూ మత సాంప్రదాయమా? అలా అయితే ఏ ధర్మసాశ్త్రం ప్రకారం వీటిని అమ్ముతున్నారో ఘనత వహించిన దేవాదయ శాఖా అధికార్లు, చెప్పాలి. భక్తులుకిచ్చే ప్రసాదం కూడా అమ్ముకుని

అడవి బిడ్డలుకు, ఉన్న పాటి బుద్ది లేని నాగరీకులు!

                                                                                                                                     2011  జనాభా లెక్కలు ఒక విషయాన్ని తేట తెల్లం చేసాయి. మనుష్యులలో స్త్రీ పురుష బేదమనేది, చదువు సంద్య నేర్చిన నాగరీకులలోనే ఎక్కువ. అది మనుషులంతా అడవితల్లి ఇచ్చిన బిడ్డలే అని నమ్ముతున్న గిరిజనులలో లేదట!అందుకు ప్రబల ఉదాహరణ గిరిజన మండలాలో  వెల్లడైన స్త్రీ పురుష సంతాన నిష్పత్తి.   నగరాలలో, అలాగే గిరిజనులేతరులు ఉండే మండలాల్లో సైతం   పురుషుల కంటె స్త్రీల సంతాన నిష్పత్తి దారుణంగా తగ్గిపోతుంటే,గిరిజన మండలాల్లో మగబిడ్డలు కంటే ఆడబిడ్డలే అధికంగ ఉండంటం గమనార్హం.   ఉదాహరణకు ఖమ్మం జిల్లా కూనవరం మండలంలో ప్రతి వేయి మంది పురుషులకు పదకొండు వందల యాబై మంది స్త్రీలు ఉన్నారట!. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఈ నిష్పత్తి కనపడుతుంది. దీనంతటికి కారణం వారిలో పిల్లల పట్ల పక్షపాతి దోరణి లేకపోవడం ఒకటైతే, వారికి దైవబీతి ఉండటం కూడ ఒక కారణం కావచ్చు.   దీని వలన మనం అర్థం చేసుకోవలసింది ఒకటే, ఆదిమ సమాజాలలో కాని, వేదకాలంలో కాని మనుష్యులలో తరతమ బేదాలు లేవు. కాని జ్ణానం

సరబజిత్ ని వారి క్రూర సాంప్రాదాయం ప్రకారం శిక్షించారా?

                                                                   ఈ రోజు  పాకిస్తాన్ హాస్పిటల్ లో చనిపోయిన  బారతీయ ఖైది సరబజిత్ మ్రుతి వెనుక ఒక కుట్ర ఉందనిపిస్తుంది. అతని మీద్ నేరారోపణ చేసి, ఉరిశిక్ష వేసి ఇరవై సంవత్సరాలు పైన అయింది. అయిదు సార్లు ఆయన పెట్టుకున్న క్షమా బిక్ష అబ్యర్ధనను పాకీస్తాన్ న్యాయస్తానాలు కొట్టివేయడం జరిగింది.ఈ ఇరవై యేండ్లుగా ఆయన మీద జరగని హత్యాప్రయత్నం సడెన్ గా ఇప్పుడే ఎందుకు జరిగింది?    కొన్ని ముస్లిం దేశాలలో, కన్నుకు, కన్ను, కాలుకు కాలు,లాంటి శిక్షలు, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలు విదించే ఆచారం ఉంది. పాకిస్తాన్ న్యాయసూత్రాలు అందుకు విరుద్దమైనా, మత చాందస వాదులు దన్నుతో, అక్కడ ఉగ్రవాద ముటాలు యొక్క ప్రాబల్యం తక్కువేమి కాదు. వారికి సరబ్ జిత్ సింగ్ ని పాకిస్తానీ న్యాయ సూత్రాల ప్రకారం శిక్షించడం ఇష్టం ఉండకపోవచ్చు.  అందుకే బారతీయ సిక్కు మతానికి చెందిన సరబ్ జిత్ గారిని, తమ మత విశ్వాసాల కనుగుణంగా కొట్టి చంపడమే కరెక్ట్ అని బావించి ఆ దురాగతానికి ఒడిగట్టి ఉంటారు. ఇది ఘోరమైనా, నీచాతి నీచమైన చర్య.   మన దేశంలో మారణహోమం స్రుష్టించిన "కసబ్" ని పౌర న్య