గోవుల్ని కాపాడమంటే,అసలు ఆవుల్నే మాయం చేస్తున్న అధికార్లు!


                                                                   
   


   అసలు మనకు  భక్తి  లేదు! ఉంటే ఇలా మన దేవాలయ వ్యవస్త బ్రష్టు పట్టి పోదు. హిందువులంటే మంచివారు. ఉదారులు,నీతిని అవినీతిని ఒకే రీతిగా చూడగల సమ వాదులు. అందుకే ఎండోమెంట్ అధికార్లుకి హిందూ బక్తులు అంటే బొత్తిగా బెరుకు లేకుండా పోయింది కాబోలు. లేకుంటే నిన్న కాక మొన్న సింహా చలం అప్పన్న స్వామీ సన్నిదిలో "గోశాలలోని" గోవులు సుమారు వంద దాకా ఒక్క సారిగా మరణిచాయని,భక్తులు అందోళన చెందితే వాటి నివారణకు చర్యలు తీసుకుంటామని సాక్షాతు ఎండోమెంట్ మినిస్టర్,అత్యున్నత సమీక్షా సమావేశమనంతరం ప్రకటించి , నలబై ఎనిమిది గంటలు గడవక ముందే,ఆలయ అధికారి ఇంత ఘోరానికి తలపెడతాడా?

   మొన్న రాత్రి సింహాచలం దేవస్తానానికి భక్తులు సమర్పించిన పన్నెండు గోవులను, ఆలయ సూపరింటెండేంట్ ప్రోత్సాహాంతో, ఏడుగురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుంటే స్తానికులు పట్టుకుని పోలిసులకు అప్పగిస్తే, ఆ సూపరింటెండేంట్ ని సస్పెండ్ చేసి విచారణకూ అదేశించారట ఆలయ కార్యనిర్వహణాది కారి. ఈ ఉదంతం  భక్తుల మనోబావాలను ఎంతగా గాయపరుస్తుందో వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఎండోమెంట్ అధికారులుకి మతమన్నా, భక్తులన్నా, వారి మనోబావాలన్నా, గడ్డిపోచతో సమానమని ఈ ఉదంతం తెలియ చేస్తుంది.

  వారికున్నది ఒకటే దీమా! ఎవడేమి చేస్తాడు? క్రిందిస్తాయి అధికారికి కూడా పై స్తాయిలో ఎవరో ఒకరి రాజకీయ నాయకుడు అండ ఉంటుంది కాబట్టి, సస్పెన్షన్ల వేడి చల్లారే దాక గప్ చుప్ గా ఉండి మల్లీ పైరవీలతో ఎంతటి కేసుల నైనా మాఫీ చేయించుకోవచ్చు. దానికయ్యేది కొంత ఖర్చే కాబట్టి, తాము సంపాదించిన అక్రమార్జితంలోనుండే ఖర్చుచేసి తమ కొలువులను కాపాడుకుంటారు.మల్లీ యదావిదిగా అవినీతి ఆర్జనకు పాల్పడవచ్చు. దీని వల్ల అంతిమంగా నష్టపోయేది దేవాలయాలే తప్పా అధికారులు కాదనేది జగమెరిగిన సత్యం. ఈ ఆలయాల అవినీతి పరుల పట్ల మనం ఇంత ఉదాసీనతతో ఉండ బట్టె, వారి ఆటలు అలా సాగుతున్నాయి.

  భక్తి అంటే కేవలం భగవంతునికి ముడుపులు కట్టి సమర్పించడమే కాదు, వాటిని అన్యాక్రాంతం చేస్తున్న వారి బరతం పట్టడం కూడ బగవత్సేవలో బాగమేనని భక్తులు బావించాలి. బగవంతుడు ప్రత్యేకంగా ఎక్కడో ఉండడు, భక్తుల గుండేలో నే కొలువుంటాడు అనేది నిజమని రుజువు కావాలంటే, అవినీతి పరుల ఆటలు కట్టించాల్సిన బాద్యత ప్రతి భక్తుడిపై ఉంది.నిజంగా పై ఉదంతంలో  స్తానిక భక్తులలో సాక్షాత్తు సింహచల నరసింహుడు ఉన్నాడు కాబట్టే గోవులను కాపాడ గలిగాడు. ఈ చేతకాని, అవినీతిపరులైన అధికార్ల పర్యవేక్షన మన సంస్తలకు అక్కర్లేదు. వాటిని ఎలా కాపాడుకోవాలో భక్తులకు బాగా తెలుసు. భగవంతుని ఆస్తులు కాపాడేది సెంటిమెంట్ ఉన్న భక్తులే తప్పా, అదిలేని అధికారులు కాదు అని ప్రబుత్వం ఇప్పట్టికైనా గ్రహించి మతసంస్తలను భక్తులకు అప్పచెప్పే విదంగా విది విదానలు రూపొందింస్తే మంచిది. ఉత్తర బారతదేశంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేని చోట్ల ఆలయవ్యవస్త ఎంత పటిష్టంగా ఉందో అద్యయనం చేయాలి. అలగే ప్రైవేట్గా భక్తుల యాజామాన్యాలో అబిరుద్ది జరిగినంతగా డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉన్న దేవాలాయలలో ఎందుకు జరగడం లేదో ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.     

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )