40 ఎకరాలు తీసుకున్న కొడుకులు నడి బజార్లో వదిలేస్తే , నీరు పోయని చెట్టు నీడనిచ్చింది !.
మన సమాజంలో తల్లి తండ్రుల పట్ల కొంత మంది పిల్లలు చూపుతున్న నిర్లక్ష్యం, అనాదరణకు ప్రతీక పైన చిత్రం లో కనిపిస్తున్న మల్లారెడ్డి గారు. పండు ముదుసలి అయిన ఆయన నల్గొండ జిల్లాలోని శాలి గౌరారం మండలంలోని వల్లాల గ్రామ వాసి . ఒకప్పుడు బాగా బతికిన ఆసామీ . 40 ఎకరాల కామందు . అయితే ఏం ? ముసలి తనంలో ఒక చెట్టు నీడన బ్రకాల్సిన దౌర్బాగ్యపు పరిస్తితి. ఉన్న 40 ఎకరాలు 4 కొడుకులు తీసుకుని తండ్రి సంరక్షణను గాలికొదిలేశారు . భూములు తీసుకున్న కొడుకులకే పట్టనిది తమకేంటని కాబోలు , కడుపున పుట్టిన 3 కూతుళ్ళు ముఖం చాటేసి ఉంటారు . చివరకు తను ఏ నాడు నీరు పోయాక పోయినా , ఒక చెట్టు తన నీడలో ఆయనకు రక్షణఇచ్చింది . మల...