40 ఎకరాలు తీసుకున్న కొడుకులు నడి బజార్లో వదిలేస్తే , నీరు పోయని చెట్టు నీడనిచ్చింది !.
మన సమాజంలో తల్లి తండ్రుల పట్ల కొంత మంది పిల్లలు చూపుతున్న నిర్లక్ష్యం, అనాదరణకు ప్రతీక పైన చిత్రం లో కనిపిస్తున్న మల్లారెడ్డి గారు. పండు ముదుసలి అయిన ఆయన నల్గొండ జిల్లాలోని శాలి గౌరారం మండలంలోని వల్లాల గ్రామ వాసి . ఒకప్పుడు బాగా బతికిన ఆసామీ . 40 ఎకరాల కామందు . అయితే ఏం ? ముసలి తనంలో ఒక చెట్టు నీడన బ్రకాల్సిన దౌర్బాగ్యపు పరిస్తితి. ఉన్న 40 ఎకరాలు 4 కొడుకులు తీసుకుని తండ్రి సంరక్షణను గాలికొదిలేశారు . భూములు తీసుకున్న కొడుకులకే పట్టనిది తమకేంటని కాబోలు , కడుపున పుట్టిన 3 కూతుళ్ళు ముఖం చాటేసి ఉంటారు . చివరకు తను ఏ నాడు నీరు పోయాక పోయినా , ఒక చెట్టు తన నీడలో ఆయనకు రక్షణఇచ్చింది . మల్లా రెడ్డి గారు . బిక్షాటన చేసి తన పొట్ట పోసుకునే శక్తి లేని పరిస్తితుల్లో చివరకు అధికారులను ఆశ్రయిస్తే విషయం వెలుగులోకి వచ్చింది .
నిజానికీ తల్లితండ్ర్లు, సీనియర్ సిటిజన్ల మెయింట్నెణ్స్ మరియు రక్షణ కోసం మన కేంద్ర ప్రభుత్వం వారుMaintenance and Welfare of Senior Citizens Act, 2007 అనే చట్టాన్ని తీసుకు వచ్చారు. నిజానికీ ఈ చట్టం వయసు మళ్ళిన తల్లి తండ్రులకు ,ఆస్తులు పొందిన బందువుల చేత నిరాదరణకు గురి అయిన వృద్దులకు ఒక వరం లాంటిది . బాదితులు ఎవరైనా సరే తమను నిర్లక్ష్యం చేసిన సంతానం లేక బందువుల మీద ఒక పెటిషన్ గనుక సంబందిత ట్రిబ్యునల్ లో వేస్తే వారు 90 రోజులలో అది పరిష్కరించి బాడిత వృద్దులకు న్యాయం చెయ్యాల్సి ఉంటుంది . ఆ 90 రోజులలో కూడా మద్యంతర ఉత్తర్వులు ద్వారా బృతిని పొందే అవకాశం బాదితులకు ఉంటుంది . సంతానం కలిగిన తల్లితండ్రులు కానీ , ఆస్తులు ను బందువులకు ఇచిన వృద్దులు కానీ తమ శేష జీవితం గురించి బీతిల్ల వలసిన అవసరం లేదు . వారికీ పైన చెప్పిన చట్టం కల్ప తరువు లాంటిది .
పై చట్టాన్ని అనుసరించి ఆంద్ర ప్రదేస్ ప్రబుత్వం వారు “The Andhra PradeshMaintenance and Welfare of Parents and Senior Citizens Rules, 2011” ను రూపొందించారు . దీని ప్రకారం R.D.O స్తాయిలో ఒక ట్రిబ్యునల్ పనిచేస్తుంది . ట్రిబ్యునల్ తీర్పులు మీద ఎవైన అబ్యంతర్తాలు ఉన్న వారు కలెక్టర్ చైర్మన్ గా ఉన్న అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకోవచ్చు . ఏది ఏమైనా తల్లితండ్రులను ఆదరించడం మన ధర్మం . వారు ఆస్తులు ఇచ్చినా , ఇవ్వక పోయినా వారిని వ్రుదాప్యం లో చూడాల్సిన గురుతర బాద్యత పిల్లల మీద ఉంది . ఎందుకంటె వారు జన్మను ఇచ్చారు కాబట్టి . మల్లా రెడ్డి గారి లాంటి ఉదాహరణలు చూసి తల్లి తండ్రులు బయపడవలసిన పని లేదు. మీ పిల్లల్ని చక్కగా పెంచి ప్రయోజకుల్ని చేసి , వారి కాళ్ళ మీద వారు నిలబడేట్లు చేస్తే , ఏదైనా సందర్బంలో మీరు నిర్లక్ష్యానికి గురి అయితే పై చట్టమే ఆయుదమై మిమ్మల్ని ఆదుకుంతుంది.
అలాగే పిల్లలకు తమ ఆస్తులను వాటాలు గా పంచేటప్పుడు . తమకు కోడా ఒక వాటాను ఉంచుకోవాలి తప్పా పూర్తిగా పంచివేయడమ్ మంచిది కాదు . తమకు చేత గాని స్తితిలో మాత్రమే ఆ వాటాను తమను సంరంక్షించే కండిషన్ మీద పిల్లలకు బలిలీ చేయాలి . ఎందుకంటే అటువంటి కండిషన్ తో ఆస్తిని పొందిన వారు , ఆ తర్వాత వ్రుద్దులను నిర్లక్ష్యం చేస్తే పైన చెప్పిన చట్టం సదరు ఆస్తి బదలాయింపు చెల్లుబాటు కానిదిగా ప్రకటించి తిరిగి తల్లి తండ్రులకు అప్ప చెప్పా బడుతుంది. ఇలాంటి ఎన్నో ప్రబావమంతమైన నిబందనలు ఉన్నప్పటికీ దాని గురించి సరి అయిన ప్రచారం, అమలు చేసే ప్రత్యేక యంత్రాంగం లేక పోవడం వలన ఆచరణలో నీరుకారి పోతుంది. చట్టం ఏర్పడిన 4 సంవత్సరాలకు కానీ రూల్స్ ఏర్పడలేదు అంటే దీనిలో సర్కార్ వారి శ్రద్ద ఏమిటో అర్దమవుతుంది .
ఈ చట్టం పకడ్బందిగా అమలు కావాలంటే ప్రతి మండలానికి ఒక వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలి. దాని నిర్వహణ దారులుకు చట్టం పట్ల అవగాహన ఉండి తమ ఆశ్రమం లో చేరిన వృద్దుల హక్కుల అమలకు ట్రిబ్యునల్ లో పెటిషన్ లు వేయించి సాద్యమైనంత వరకు పిల్లలకు వారి మద్య సృహుద్బావ వాతావరణం ఏర్పడేలా చేయాలి. అది సాద్యం మ్కాని పక్షంలో తమ ఆశ్రమంలోనే వ్రుద్దులను ఉంచి వారి కయ్యే ఖర్చులను పిల్లల నుంది రాబట్టే విదంగా ట్రిబ్యునల్ ఉత్తర్వులను పొందాలి . అప్పుడు వృద్దుల ఆలనా పాలనకు డోకా ఉండదు. పిల్లలు లేని ఆనాడ తల్లితండ్రులకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలి . అలా పకడ్బందిగా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే మన సమాజం లో వృద్దాప్యం కడగండ్ల మయం కాదు .
తల్లి తండ్రులకు ముద్ద పెట్టని వారు సమర్పించే నైవేద్యం ఆ భగవంతుడు కూడా స్వీకరించడు. ఇది సత్యం. అలాగే దాతలు కూడా విరివిగా వ్రుద్దాశ్రమాల స్తాపనాకు , వాటి పోషణకు దానాలు చేస్తే వారికీ ఎంతో పుణ్యం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తల్లి తండ్రులను మించిన దైవం ఇల యందు లేరు గాక లేరు. వారిని ఆదరించడం కి మించిన దైవ సేవ కూడా లేదు. ఇది సత్యం.
10/7/2014 Post Republished)
Comments
Post a Comment