'మనుస్మృతి ఇరాని ' అంటూ తనను హేళన చేస్తున్న వారి నోళ్ళు మూయించిన "స్మ్రుతి ఇరాని " గారు!!!
కాళికా దేవి ని పచ్చి వ్యభిచారిణిగా , మహిషాసురుడిని గొప్ప వీరుడిగా చిత్రీకరించడమే కాక "మహిషాసుర అమరదినం" గా విజయదశమిని జరుపుకోవాలన్న రాక్షస సిద్ద్దాంత కర్తల ముఖం మీద చెప్పు తీసుకు కొట్టినట్లు, "మనువులూ నోరు ముయ్యండి " అనే తెగిడిచిన రాతలతో తమ "హాస్య పత్రికలలో " ఆర్టికిల్ రాస్తూ , తనను 'మను స్మ్రుతి ఇరాని ' అని అవహేళన చేయడమే కాక ,దేశ ద్రోహ కార్యకలాపాలు చేసే వారిని హీరో లు అని కీర్తించిన , కుహానా ఎర్ర మేదావులను నోరెత్తకుండా చేసినట్లు ఉంది , నిన్న పార్లమెంట్ లో మహిళా మంత్రి "స్మ్రుతి ఇరాని " గారు జవాబు తీరు. నిజంగా కలకత్తా కాళికయే ఆమెను పూనిందా అన్నంత ఆవేశంగా , ఎంతో ఉత్తేజిత పూరితంగా ఉంది ఆమె సమాదాన ప్రసంగం. ఆమె మాట్...