నీతి బాదితుల ఓదార్పు యాత్ర కథ!
నిన్న నా దగ్గరకు ఒక వీరాభిమాని వచ్చాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు కి వీరాభిమాని.వాళ్ళ నాయకుడు చనిపొతే, పాపం ఈయన సంవత్సరం పాటు తెగ ఏడ్చాడు.ఎందుకంటే,ఆయన తర్వాత ఈ రాష్ట్రానికి దిక్కేవరూ లేరు అని.అలా ఆయన లాగా బాదపదే వాళ్ళు లక్షల్లో ఉన్నారట!అందుకని వారందరిని ఓదార్చడానికి ఆ చనిపోయిన నాయకుడి కుమారుడు "ఓదార్పు యాత్ర" పేరుతో రాష్ట్రమంతా పర్యటించి తన తండ్రి మరణ బాదితులను ఒదార్చడం ప్రారంబించాడాట.అందరిలాగా కేవలం ఒదార్పు మాటలు కాకుండ కాస్త ఘనంగా ఓదార్చితే, మంచిదనుకున్నాడో ఏమో,ఒక్కొక్క కుటుంభానికి లక్ష రూపాయలు ఇచ్చి మరీ ఓదార్చాడట!.ఆ దెబ్బతో అబ్బా, ఓదార్పు యాత్ర ...