Posts

Showing posts from July, 2016

షూలో రహస్య కెమెరాను అమర్చుకొని మహిళల అసభ్యకర దృశ్యాలను తీసున్న న్యాయవాది ఆశిష్ శర్మ !!

Image
                                                    మానసిక రోగాలు రక రకాలు. ఒక గొప్పింటి కోడలు గారికి బట్టల కొట్లో బ్రాసరీలు కాజేసే మానసిక సమస్య ఉందిట. నిజానికి ఆమె గారు కోరుకుంటే లక్షలు పోసి అయినా కావలసిన బట్టలు కొనుకో గలదు . కానీ అలా లక్షలు విలువ చేసే బట్టలు కొనేటప్పుడు కలిగే అనందం కంటే  దొంగతనం చేసి చిన్న బ్రాసరీ ని పొందడం లోనే ఆమెకు అమితానందం కలిగిస్తుంది అట. ఇలా ఒక రోజు షాపింగ్ చేస్తూ తన కున్న దొంగబుద్ధిని బయటపెట్టుకుని పదిమందిలో పరువు పోగొట్టుకుంది ఆ మంత్రి గారి కోడలు. అలాగే కొంతమంది మగవాళ్ళకి స్త్రీలు దుస్తులు మార్చుకుంటుంటే తలుపు సందులు  లోనుండి  చూస్తూ ఆనందించే జబ్బు ఉంటుంది. ట్రయల్ రూములలో బట్టలు మార్చుకునే  స్త్రీల ను రహస్య కెమెరాల ద్వారా ఫొటోలు తీసి వాటిని చూస్తూ ఆనందించే అలవాటున్న  ఒక లాయర్  తను చేసే పాడు పని పదిమందికి తెలియకుండా ఉండడం కోసం ఎలాంటి ఏర్పాటు చేసుకున్నాడో చుస్తే ఆశ్చర్యం తో పాటు అసహ్యం కూడా వేస్తోంది. ఇటీవల,  షూలో రహస్య కెమెరాను అమర్చుకొని మహిళల అసభ్యకర దృశ్యాలను తీసున్న న్యాయవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంత్రాలకు చింత కాయలు రాలుతాయో లేదో కానీ , ఆ మహిళల బ్రతుకులు మాత్రం రాలిపోతున్నాయి !!

Image
                                                                                                             మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? ఇది మన పెద్దలు తరచూ వాడే మాట .   వెనుకటి కాలం లో కొంతమంది హేతు దృక్పధం గలవారు , మంత్రాలు తంత్రాలు మీద నమ్మకం లేని వారి నోటినుండి పుట్టిన మాట కావచ్చు ఇది . చెట్టుమీద ఉన్న చింతకాయలు కావాలంటే చెట్టెక్కి కోసుకోవడమో , పెద్ద గడ పెట్టి కోయడమో చేయాలి కానీ , చెట్టు క్రిందకు వెళ్లి చింతకాయలు ను చూస్తూ మంత్రం పఠిస్తే అవి రాలవు కదా? అని దీనిలోని భావం.                     చింతకాయలు రాల్చె   విషయం లో మంత్రాలు ఫెయిల్  కావచ్చేమో కానీ   అన్య  మతం ను పాటి స్తున్న  మహిళల విషయం లో మాత్రం మంత్రం చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది . కొన్ని శతాబ్దాలుగా ఆ మంత్రం పఠిస్తున్న ఆ మతం లోని పురుషులకు మంత్రం పారకపోవడం అన్న ప్రశ్నయే ఉత్పన్నం కాలేదు. 30 , 40 ఏండ్లు తనతో కలసి సంసారం చేసిన స్త్రీని అయినా సరే, లేకుంటే పెండ్లి అయి 2 గంటలు గడవని కన్యనైనా సరే , వారి  భర్తలు  ఆ మంత్రం పఠించి తమ మధ్య ఉన్న సంబంధాలను , అనుబంధాలను , అన్నింటిని పుట్టుకున్న త్రెంచి  వేసి    విజయగర్వం తో అట్ట

పరమేశ్వరి తో అక్రమ సంబందం కొనసాగించడానికి ,ఆరేళ్ళ ఆమె కూతురి ని మర్డర్ చేసిన కసాయి ఇలియాజ్ !

Image
                                                                                                                               సమాజంలో స్త్రీ పురుషుల మద్య ఉండే సెక్స్ సంబందాలు పూర్తిగా వ్యక్తీ గత మైనవి అని , వాటి విషయంలో సమాజం కాని , సమాజం తరపున ఎవరూ గాని ప్రశ్నించడo వ్యక్తీ స్వేచ్చకు బంగం అంటుటారు స్వేచ్చా ప్రియులు . వారి వాదన కరక్టే కాని , స్వేచ్చా అనేది సమాజంలోని కొన్ని కట్టుబాట్లును పాటించే వారికే లభించాలి తప్పా , స్వెచ్చ  అంటే తమ ఇష్టం వచ్చినట్లు ఏది బడితే అది చేయవచ్చు అనుకునే వారికి అది ఇస్తే , అది విస్రుంకలత్వానికి దారి తీసి , చివరకు సమాజంలో దుష్పరిణామాలు జరుగుతాయి అనడానికి , కదిరి పట్టణం లో జరిగిన ఈ  ఉదంతం తెలియ చేస్తుంది .   కదిరి పట్టణంలో నివసించే పరమేస్వరికి ఇద్దరు పిల్లలు అందులో చిన్న పాప పేరు నిఖిత .దురదృష్ట వశాత్తు ఆమె భర్త ను కోల్పోయి ఒంటరిగా జీవిస్తుంది . తన చిన్న కూతురు అయిన 6 ఏండ్ల నిఖితకు స్విమ్మింగ్ నేర్పించాలని స్విమ్మింగ్ పూల్ సెంటర్ లో చేర్పిo చిoదట . అ స్విమ్మింగ్ పూల్ కోచ్ పేరు ఇలియాజ్ . అతడు పిల్లకు స్విమ్మింగ్ ఎంతవరకు నేర్పాడో తెలియదు కాని , తల్లిన

"నారీ నారీ నడుమ మురారి" లా 15 రోజులు ఇల్ల్లా లుతో, 15 రోజులు ప్రియురాలితో గడపమని మొగుణ్ణి ఆదేశించిన లోక్ అదాలత్!

Image
                         అబ్బ! సహజీవనం నేరమూ కాదు,పాపమూ కాదు అని ఈ  దేశ అత్యున్నత న్యాయస్తానం ఇచ్చిన తీర్పు ఆదారంగా ఒక మొగుడు గృహ హింస చట్టం నుండి విముక్తుడై, ఎంచక్కా, 15 రోజులు బార్యతోను, 15 రోజులు గర్ల్ ప్రెండ్ తోను సంసార జీవితం గడపడానికి కోర్టు అనుమతి పొందాడు. వివరాల లోకి వెళితే   మద్య ప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ పట్టణం లో బసంత్ అనే అతను  ఎలక్టర్సిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. అతనికి బార్యా పిల్లలు ఉన్నారు. 10 యేండ్ల క్రితం బార్య ఒంట్లో బాగో లేదని ఒక ఆవిడను తెచ్చి పనికి కుదిర్చాడు. ఎలాగో భార్యకు ఒంట్లో బాగో లేదు కాబట్టి, ఆవిడగారి బాగోగులుతో పాటూ, ఈయనగారి బాగోగులను చూడడం మొదలు పెట్టి , ఇంట్లో ఇల్లాలు పని , పడకటింట్లో ప్రియురాలు పనికి అంకితం అయింది. ఆ తర్వాత బార్యకు ఆరోగ్యం కుదుట పడినా ఈవిడను పనిలోనుంచి తీయలేదు సరికదా , ప్రియురాలు ఉద్యోగం పర్మనెంట్ అయింది. పాపం ఆ పిచ్చి ఇల్లాలు రెండేళ్ళ క్రితం కోర్టులో భర్త మీద కేసు పెట్టింది. ఆ కేసు సారాంశం ఏమిటంటే తన భర్త తనతో గడపకుండా తన ప్రియురాలితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు అని, కాబట్టి తనతో కూడా  గడిపేలా ఆదేశాలు ఇప్పించమని కోరింది. దాని

అవ్వ ! అవ్వ ! పెండ్లికి ముందు .స్నేహితులతో సెక్స్ తప్పు కాదని , విద్యార్దినులకు "కండోమ్" లు అమ్ముతున్న చెన్నై స్కూళ్ళు !

Image
                                                                                               ఆహా  !   ఎంత చక్కని విద్యా బోదన!  ఆ స్కూళ్ళు జనరల్ ఎడుకేషన్ లో ఏం  బోదిస్తున్నాయో   తెలియదు  కానీ సెక్స్ ఎడుకేషన్ ని మాత్రం ప్రాక్టికల్స్ తో సహా వివరించి చెపుతున్నాయి అట! చెన్నై లోని కొన్ని స్కూళ్ళు కు సినిమా నటి "కుష్బూ" ఆదర్శం లాగుంది. అందుకే ఆమె ప్రవచించిన "పెండ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడం తప్పు కాదు" అనే సిద్దాంతాన్ని బాగా అద్యయనం చేసి మరి అమలు పరుస్తున్నారు    ఈ  మద్య   దిమ్మ తిరిగే నిజం ఒకటి తెలియ వచ్చింది. చెన్నై స్కూళ్ళ యాజమాన్యాల వారు కొంత మంది తమ విద్యార్దినుల తల్లి తంద్రులను "మీ కూతుళ్ళు బాయి ప్రెండ్స్ తో సెక్స్ సంబందాలు కలిగి ఉండటం తప్పు కాదు" అని నచ్చ చెప్పి , ఆడపిల్లలను ప్రోత్సాహించే   విదంగా స్కూళ్ళలోనే "కండోం మేచిన్" లు పెట్టి కండోం లు అమ్ముకుంటున్నారట. ఇంత కంటే నీచమైన పని వేరొకటి ఉందా? .ఆ యా స్కూళ్ళలో చదివే విద్యార్దినుల శ్రేయో దృష్ట్యా ఆ స్కూళ్ళ పేరును వెల్లడించలేదు సాంప్రదాయక వాదులు. భారత దేశం లో   గత అరవై ఏండ్లుగా  స్

మనశ్శాంతి కోసం "మతం", సమాజ క్రాంతి కోసం సైన్స్ , రెండూ అవసరమేనని నమ్మిన గొప్ప సైంటిస్ట్ "A P J అబ్దుల్ కలాం " గారు !!

Image
                                                                                                                                                                      ఒక వాహనం నడవాలంటే ఇందనం ఎంత అవసరమో , ఆ వాహనం లో చలనం వలన పుట్టే ఘర్షణ నుంచి రక్షింపబడాలంటే "కందెన " కూడా అంతే అవసరం . వాహనం లో ఇంజిన్ ఆయిల్ లేకుండా నడిపితే , కోట్ల విలువ చేసే దైనా మండి పోవడం ఖ్హాయం. అలాగే మనిషికి కూడా , తన నిత్య జీవన గమనానికి సైంటిఫిక్ ఆలోచనా విదానం ఎంత అవసరమో , తన ప్రశాంతత కోసం మత విదానాలు అంతే అవసరం. రోజూగంట సేపు చేసే  ద్యానం , యోగ , దేవుని పూజ, నమాజ్, ప్రేయర్  ఇలాంటి వన్నీ మనసును చల్లపరచి , రోజంతా ఆ మనిషిని బ్యాలెన్స్ మైండ్ తో నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగే లా చేస్తుంది . వాహనానికి కూడా అంతే కదా! కొంచం కందెన తో చాలా ఇందనం తో బండి ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. కందెన ఎక్కువైతే బండి స్టార్ట్ కాదు. అసలు కందెనే లేకుంటే వాహనమే మిగలదు. మత విశ్వాసాలు  కూడా  అంతే  ఎక్కువైతే మూడ విశ్వాసాలు గా మారి మనిషి గమనానికి  అవసరమైన జ్ఞానం లోపిస్తుంది. అసలు లేక పోతే  బుర్ర వేడెక్కి తీవ్ర వాదిగా మారుతాడు.

బాయ్ ప్రెండ్ రమ్మనాడని రూం కెళితే,'బ్రతుకు బ్లూ పిలిం అయిందట ' !!!

Image
                                                                       "రెండేళ్ళుగా ప్రేమ వంచన " అనే టైటిల్ పేపర్లో చూసి ,ఏమిటీ విషయం అని పేపర్ లోని విషయం ఆసాంతం చదవటం జరిగింది .కధ మామూలే .'బాయ్ ప్రెండ్,గర్ల్ ప్రెండ్ ' సంస్కృతికి బలి అయిన ఒక అబాగిని వాస్తవ జీవితం అది . ఈ డర్టీ బాయ్ ప్రెండ్ సంస్కృతి వద్దమ్మా ,అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోని "నవీన" ఆడపిల్లలకు ఈ ఉదంతం ఒక కను విప్పు కావాలి . బాయ్ ప్రెండ్ లు పిలిచారని ఎక్కడికి పడితే అక్కడికి ఎగేసుకు పోయె ఆడపిల్లల గురించి ,సదరు బాయ్ ప్రెండ్ కు ,ఆ ప్రెండ్ ప్రెండ్ లకు ఎటువంటి అభిప్రాయం ఉంటుందో ,ఈ ఉదంతం చక్కగా తెలియ చెస్తుంది . విదేశాల సంగతి ఏమో కాని ,ఈ దేశం లో మాత్రం ,బాయ్ ప్రెండ్ ఉన్న అమ్మాయిలు "ఆ బాపతే "అని చాలా మంది బాయ్ ప్రెండ్ లకు వీర నమ్మక్కం .ఒక్క సారి బాయిప్రెండ్ కాని ,అతని స్నేహితుల రూం కి కాని  వెళితే ,ఇక ఆ పిల్ల బ్రతుకు "వేటగాళ్ళకు చిక్కిన లేడి'" వంటిదే .                                                                    అమ్మా నాన్నలకు దూరంగా ఉండి విద్య న

ప్రియుడిని చంపించిన చోటే మొగుడితో డ్యూయట్ పాడటానికి వెళ్లిన నెరజాణ !!

Image
                                   క్రూర మనస్తత్వం ప్రదర్శించడం లోకొంతమంది  స్త్రీలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరని నిరూపించింది యునైటెడ్ కింగ్డమ్ లోని మిడ్వే నగరానికి చెందిన ముంధీల్ మహిల్ అనే 23 ఏండ్ల మహిళామణి . ఈమె కు కనీసం మైనార్టీ కూడా తీరని వయసులోనే , ఒక ప్రేమ కహాని , ప్రియుడిని తన బాయిప్రెండ్స్ తో చంపించిన చరిత్ర, దానికి గాను 5 ఏండ్లు జైలు శిక్షపొంది , 3ఏండ్లకే బయటకు వచ్చిన అనుభవము ఉన్నాయి. అన్నింటికి మించి ఆమె అందం చాటున దాగిఉన్న ఆమె క్రూర మనస్తత్వం ఆమెకు హైలెట్ . అదేమిటో చూదాం.                                                                                                          ముంధీల్ మహిల్ తాను మెడిసిన్ చదువుకునే రోజుల్లో 21 సంవత్సరాల గగన్ దీప్ సింగ్ అనే కుర్ర టీవీ ఎక్జికూటివ్ తో ప్రేమలో పడింది. సహజంగా అందగత్తె కావడం అమ్మాయి గారికి వెంటపడే బాయిప్రెండ్స్ ఎక్కువే కాబోలు . దానితో గగన్ తో ఏవో మనస్పర్థలు ఏర్పడి అతడిని అడ్డుతొలగించుకోవాలని ప్లాం చేసింది. ఇందుకు తన ఇతర బాయిప్రెండ్స్ అయిన హర్విందర్ షోకేర్ , డారెన్ పీటర్స్ తో కుట్రపన్ని దానిని అమలు చేసింది.            

షేక్ జాస్మిన్ ఆత్మహత్య , శ్రీ సాయి చావు కొచ్చ్చిందంట !!

Image
                                                                                                        పుణ్యానికి పొతే పాపం ఎదురైందంటారు చూసారా !. అదిగో అచ్చం అలాగే జరిగింది వేముల శ్రీ సాయి మరియు అతని స్నేహితుని విషయం లో . గుంటూరు జిల్లా , నిజాంపట్నం మండలం , మహమ్మదీయపాలెంలో జరిగిన ఈ యదార్థ  సంఘటన , అపోహ మనుషుల్ని ఎంత విచక్షణ హీనులుగా చేస్తుందో కళ్ళకు కట్టినట్లు చేస్తోంది. ఇక వివరాలలోకి వెళితే ,  మహమ్మదీయ పేటకు చెందిన షేక్ జాస్మిన్ కి 19 ఏండ్లు . కాలేజీలో చదువుకుంటుంది కాబోలు ఆమెకు ఎదో కలుగరాని కష్టం కలిగి , బ్రతికే దారి కానరాక ఉరేసుకుని చనిపోదామని నిర్ణయించుకుంది. అదే విషయం తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసి కూడా చేప్పిందంట . ఆ తర్వాత ఉరివేసుకుంటుంటే దానిని గమనించిన 2 యువకులు వేముల శ్రీ సాయి మరియు అతని స్నేహితుడు జొన్నా పవన్ కుమార్ లు పెద్దగా కేకలు వేసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చ్హారు.     ఇక దానితో అక్కడకు చేరుకున్న మహమ్మదీయ పేటవాళ్ళు , అమ్మాయి ఉరి వేసుకుని ఉండడం, ఆ సమయం లో అక్కడే ఇద్దరు కుర్రాళ్ళు ఉండడం తో ఒక నిర్ణయానికి వచ్చేసారు . వారే అఘాయిత్యమో అమ్మాయి మీద చేస్తే , దాన

డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"?

Image
                                                                              ఇది ప్రసిద్ద డన్ లప్ టైర్ల కంపెనీ వారి ఏడ్.నాదొకటే సూటి ప్రశ్న? "డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి  సంబందం ఏమిటి"?                                   చూశారా! ఇదివరకు నేను చెఫ్పినట్లు,"న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అని మనువు మనుస్మ్రితిలో రాశాడని, ఈనాటివరకు స్త్రీవాదులు, అబ్యుదయవాదులు,నానారకాలుగ విమర్సిస్తున్నారు. ఈ మద్య ఒకయాన ఐతే ఏకంగా పచ్చిగ్గా బూతులు తిడుతూ తన బ్లాగ్లో టపా పెట్టాడు.ఏది ఎమైనా మనుస్మ్రుతి అనేది ఇతర మత గ్రందాల లాగ మార్చడానికి వీలు లేని పవిత్ర గ్రంథం కాదు. ఈ విషయాన్ని మన పూర్వీకులే చేప్పారు.ఎప్పుడు మనుస్మ్రుతి సమాజాంలోని మర్పులకు అనుగుణంగా ఉండదో అప్పుడు మనుస్మ్రుతిని సవరణ చేయవచ్చు.అంటే మన రాజ్యాంగ సవరణలు లాగ. కాకపోతే ఇలా  సవరణలు చేసే అధికారం మాత్రం తిరిగి మనవు కే ఉంటుంది. అందుకే మన పురాణాలలో 14 మంది మనవులు ఉంటారని చెప్పారు.ఈ మనువులు మన్వంతరంనకు ఒకరు జన్మిస్తూ,మనుస్మ్రుతిని సవరణలు చేసి సమాజానికి అందిస్తుంటారు. ఏ వాదమైనా ఎల్లకాలం అనుసరనీయం కాదు. కాబట్టి మార్పులు అ

హిందూ దేవుళ్లని రోడ్ల మీద పరిగెత్తిస్తున్న, ఈ జంబ లకిడి పంబలు హిందువులా?

Image
                                                                నిన్న ఒక నటుడి ఇంటి ముందు కోంత మంది బ్రాహ్మణులు,ఆందోళన చెయ్యడానికి వెళిటే సదరు నటుడి కొడుకు, యువ హేరో ఆ భ్రాహ్మణులను తమ కిరాయి గుండాల చేత బాగ చితకొట్టించి, ఇంకొక సారి ఇంటి దగ్గర కొస్తే హైదరాబాదులో తిరగలేరు ఖబాడ్దార్ అని వార్ణిఇంగులు ఇచ్చినట్టు టి.వి.లు ప్రత్యక్ష ప్రాసారాల ద్వారా చూపించాయి.ఈ ఘటన కి మూల కారణం ఇటివల సదరు యువ నటుడు సినిమాలో బ్రాహ్మాణులను కించ పరుస్తు, కొన్ని అబ్యంతరకర సీన్లున్నాయని వాటిని తొలగించాలని బ్రాహ్మణుల ఆందోళన చేస్టే,సదరు యువ నటుడు తంద్రి పెద్ద నటుడు వారిని కిరాయి వారుగా అభ్హివర్ణించడమే కాక, తనను ప్రాదేయ పడితే  డబ్బులు దానం చేస్తా అన్నాడట. అదేమని అడగానికి వెళ్ళిన్న వారిని డబ్బులు బదులు దెబ్బలు దానం చేసి పంపారు . పై పెచ్చు సదరు హెరో గారు" మా ఇంట్లో పూజలు చేయువాడు బ్రాహ్మణుడు,మా సినిమాకు ముహుర్తం పెట్టువాడు బ్రాహ్మణుడుమొదటి క్లాపు కొట్టు వాడు బ్రాహ్మణుడు,రీలీజ్ కి సమయ నిర్ణయం చేయువాడు బ్రాహ్మణుడు" అని అయన గారి తండ్రి "సర్దార్ పాపా రాయుడు" సినిమాలో చెప్పిన డైలాగులు చెప్పాడు. కాకపొ

సిగ్గులేని పెండ్లి కూతురు చిందేస్తూ వచ్చ్చిందట !!

Image
  బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే కళ్యాణ శోభ కనగానే కనులార తనివితీరేనే ఓ.. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే..ఓ.. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు చెరిగేనే ఓ.. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే మనసైన వాడు వరుడు నీ మదినేలు వాడె ఘనుడు వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే ఊ –ళ ళ ళ –హాయి....... బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే   సాంప్రదాయపు  వివాహ  పద్దతిలో పెండ్లికూతురు కళ్యాణ మండపం కి తరలివచ్చే విధానం ని పై పాటలో రచయిత శ్రీ అనిసెట్టి సుబ్బారావు గారు చక్కగా చెప్పారు. ఇప్పటికి తెలుగునాట జరిగే సాంప్రదాయ పెండ్లిళ్లలో అమ్మాయి కళ్యాణ మండపం కి బంధువులు ,స్నేహితురాళ్ళు  వెంటరాగా , కొంత సిగ్గును ఒలకబోస్తూ , వస్తూ ఉండే ద

అమెరికా వెళ్ళినా,ఆడవాళ్ళను తడమటం మానలేదట!

Image
                                                                                   అతనిది ఒక మానసిక రోగమట!ఇండియాలో ఉన్నంత కాలం ఆ రోగంతోనే మానసికానందం జుర్రుకున్నే వాడు కాబోలు. రైళ్ళలో, బస్సుల్లో ప్రయాణిస్తున్నపుడు తోటి ప్రయాణికురాళ్ళు ఒంటిని తడుముతూ ఆనందించటం అతని అలవాటు అంటా!మరి ఇండియాలో ఆడవాళ్ళకి చిన్న దానికి, పెద్ద దానికి కేసులు పెట్టడం అంటే సంకోచం కాబట్టి, ఇక్కడ తిట్లతో సరిపెట్టి ఉంటారు. మరి అమెకాలో ఊరుకుంటారా? ఊరుకోను గాక ఊరుకోరు కాబట్టి కేసు పెట్టి, కోర్టు కీడ్చి మరీ తొమ్మిది నెలలలు జైలు శిక్ష వేయించండమే కాక మూడు లక్షలు పై చిలుకు ఫైన్ కట్టేలా చేయించించింది   ఆ అమెరికా ఇల్లాలు.    ఆయన ఒక ఇండియన్. వయస్సు46 సంవత్సరాలు. అమెరికాలో సాప్ట్వేర్ కన్సల్టెంట్. జూన్ 11,2011    సంవత్సరంలో ఆయన విమానం లో  షికాగో వెళ్తునాడు. ప్రక్కనే ఒక వ్రుద్ద జంట తమ 36 వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని లాస్ వేగాస్ వెళుతున్నారట.ఆ జంటలోని బార్య వయస్సు అరవైమూడు సంవత్సర్రాలు. ఆమె ఈ సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ ప్రక్క సిట్లో కూర్చుంది. పాపం ఈ మానసిక రోగికి ప్రక్కన ఎవరైన స్తిలు ఉంటే మనసాగదు కాబోలు. వ

తమ కొడుకు 'షార్ట్ ఫిలిమ్స్ హాట్ హీరోయిన్ ' వలలో చిక్కుకున్నాడని విలవిలలాడుతున్న పోలీస్ ప్యామిలీ !!.

Image
                                                                                                     ఆ అబ్బాయి పేరు ప్రసన్న కుమార్ . ఇంజనీరింగ్ స్టూడెంట్ . ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని సామర్ల కోట . ప్రసన్నకుమార్ తండ్రి గారు మంచి స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి . తమ కుమారుడు మంచి ఇంజనిర్ అయి కుటుంబాన్ని ఉద్దరిస్తాడు అని కాలేజీకి పంపితే , ఇంజనీరింగ్ చదువు ఏమైపోయిందో కానీ , మంచిగా యూ ట్యూబ్ లో వచ్చే రొమాంటిక్ సీన్లు చూస్తూ కాలేజీ లైఫ్ ఎంజాయి చేసినట్లు ఉంది . అలా ఎంజాయి చేయడమే కాదు , అలా యూట్యూబ్  షార్ట్ ఫిలిం లో నటిస్తూ  హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న "సిరిప్రియ " అనే నటి తో ఫేస్ బుక్ పరిచయం కూడా పెంచుకున్నాడు ఆట .    సాధారణంగా ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే 16 లేక 17 ఏండ్లకి  ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ఫస్టియర్ లో జాబు అవుతారు . వారికి చట్టప్రకారం పెండ్లి ఈడూ వచ్చే సరికి అంటే 21 సంవత్సరానికి కానీ ఇంజనీరింగ్ పూర్తి కాదు . మరి పై ఉదంతం లో తెలుపబడిన ప్రసన్న కుమార్ , సిరిప్రియ ల మధ్య ప్రేమ వ్యవహారం గత 6 ఏండ్లుగా నడుస్తోందని చెపుతున్నారు. ఇదే నిజమైతే ప్రసన్నకుమార్ కి పెండ్

భర్త ప్రవర్తన తప్పు అన్నందుకు , భార్యకు పెద్దమనిషికి అక్రమ సంబందం అంటగట్టిన "అనుమానపు పిశాచి "

Image
                                                                                  నేను ఇంతకు ముందు ఇదే బ్లాగులో కొన్ని టపాలు లో అనుమానపు మొగుళ్ళు గురించి ప్రస్తావించడం జరిగింది . మొన్నీ మద్యనే   "శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !  అనే టపా పెట్టడం జరిగింది . అందులో అనుమానం జబ్బుతో  ఒక భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడో అర్దమవుతుంది . తన భార్యా పిల్లలను పరమ కిరాతకంగా చంపి , పైపెచ్చు తన పాప విముక్తి కోసం కాశికి వెళ్ళాడు. ఇలా భర్త క్రిమినల్ గా మారడానికి అతనిలో ఉన్న "అనుమానం" అనే జబ్బు. ఈ జబ్బు ఎంతకు తెగిడిస్తుందో ఒక వాస్తవ ఉదంతం ద్వారా తెలియ చేస్తాను.   నాకు తెలిసిన భార్యా భర్తలు ఉన్నారు. వారిది నిజంగా అపురూపమైన జంట . అది ఒకప్పటి మాట! కాని అదే జంట, ముప్పై ఏండ్ల పాటు కలసి కాపురం చేసి ఇద్దరు బిడ్డల్ని కని , వారిని ప్రయోజకులు చేసిన జంట , ఇప్పుడు విడి విడి గా ఉంటున్నారు . ఒకప్పుడు భార్యా లేనిదే క్షణం గడవని భర్త , ఇప్పుడు ఆమె కనిపిస్తే చంపేస్తాను అని వీరంగం వేస్తున్నాడు. తన భార్య కులట అని ప్రచారం

మానవ వాదమంటే మహా భారత "యాదవులను" కించపరచడమేనా?

Image
                                                                                                                               మహా భారతం అనేది ప్రపంచంలో ఉన్న హిందువులందరికి పరమ పవిత్రమైన  ఇతీహాసం.ఇందులోని ఒక ఘట్టమైన గీతా సారాంశం పవిత్ర గ్రందం. అసలు ప్రపంచంలో ఏ మత గ్రందమైన కొన్ని అబూత కల్పనలతో కూడి ఉంటాయి. వీటిని విమర్శనాత్మక ద్రుష్టితో చూస్తే, మిగిలేది బూడిదే. ఇవి మానవుని అద్యాత్మిక ఆనందం కోసం ఉద్దేశీంప బడినవి. ప్రతిదీ ప్రశ్నించే వ్యక్తి సుఖ శాంతులతో జీవించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. మనిషి జీవనానికి తార్కిక జ్ణానం డెబ్బై పాళ్ళు ఉంటే, అలౌకిక ఆనందం ముప్పై పాళ్ళన్న ఉండి తీరాల్సిందే. అంటే బండికి ఇందనం లాగ తార్కిక జ్ణానం పనిచేస్తే, కందెన లాగ అలౌకిక ఆనందం పని చేస్తుంది. అలాంటి అలౌకిక ఆనందం కోసం ఉద్ద్యిశించ బడినవే రామాయణ, మహా భారతాలు. ఇవన్నీ అలౌకిక ఆనందం కోసం మత పరంగా చెప్పబడినవి కాబట్టి అదే ద్రుష్టితో చూడాలి కాని కొంతమంది కి కున్న తార్కిక శక్తి చూపడానికి వీటిని వాడుకోవడం ఏ మాత్రం క్షమించరానిది. ఉదాహరణకు కర్ణుడు సూర్యుడు, కుంతిల పుత్రుడు అని ఉంటుంది. మనకు సూర్యుడు మండే వాడని ఎప్పటిను