సైన్స్ కు సవాలు విసురుతున్న "పుట్టనహళ్లి కుక్క "

                                                                       
         

   ఈ ప్రపంచం లో జరిగే సంఘటనలు అన్నింటికి సంతృప్తికరమైన సమాధానం ని సైన్స్ ఇవ్వలేదన్నది నిష్టుర సత్యం. ఉదాహరణకు ఒకే ఇంట్లో పుట్టి పెరిగి , ఒకే రకమైన వాతావరణం లో పెంచబడిన పిల్లలకు భవిష్యత్ ఒకేలా ఉందని వారు ఎందరో! కాలాంతరం చేత ఒకడి బ్రతుకు బంగారుమయం అయితే , మరొకరి బ్రతుకు కడగండ్ల పాలు అయినా ఉదంతాలు తక్కువేమి కాదు. దీనికి కర్మ సిదాంతం చెప్పినంత సంతృప్తికరమైన సమాధానం సైన్స్ చెప్పలేదు. ఒకే ఇంట్లో పుట్టినా వారి వారి పూర్వజన్మ కృత్యాలు లో ఉన్న బేధాలు వలననే  ఈ జన్మ లో వారికి ఆ విభిన్న ఫలితాలు అని కర్మవాదులు చెప్పే మాటలు సామాన్యుణ్ణి సంతృప్తిపరచినట్లు , సామాన్య శాస్త్రం ప్రకారం చెప్పే సిద్దాంతాలు  సామాన్యుని సంతృప్తి పరచలేవు. అదిగో అలా సామాన్యుడినే కాదు, అంతో ఇంతో సైన్స్ జ్ఞానం ఉన్నవారిని సైతం అబ్బురపరిచే విధంగా ప్రవర్తిస్తుంది బెంగళూరు లోని పుట్టనహళ్లి ఏరియాలో కల ఒక కుక్క. దాని కధ ఏమిటో చూడండి .

     ఒకరోజు పుట్టనహళ్లి లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వచ్చ్చింది ఒక కుక్క. అది దేవాలయం లోకి ప్రవేశించి గుడి చుట్టూ తిరగడం మొదలు పెట్టింది ఆట. దానిని చూసిన కొందరు రాళ్లు వేస్తే అది ఆ రోజు వెళ్లి పోయింది. తిరిగి తెల్లారే ఉదయం వచ్చి గుడి చుట్టూ అపసవ్య దిశలో   ప్రదక్షిణలు చెయ్యడం మొదలు పెట్టింది . అలా సాయంత్రం వరకు చేసి వెళ్లిపోయిన కుక్క తిరిగి తెల్లారే ఉదయం వచ్చి అదే ప్రదక్షిణ తంతు చేస్తోంది . ఇలా వారం రోజులు బట్టి చేస్తోంది అని కొందరు అంటుంటే , లేదు లేదు నెలలుగా ఇలా చేయడం మేము చూసాం అని కొందరు అంటున్నారు.

                                                                         

         

                                       ఇదేమి అయితేనేమి ఈ విషయం TV 9 వారికి తెలిసి, ఈ వింత ఏమిటో చూడామణి కెమెరాలు తీసుకుని మహాలక్ష్మి అమ్మావారి గుడికి వెళితే , వీరి హడావుడి చూసి కాసేపు చాటుకు వెళ్లిన కుక్క తిరిగి వారు ఇవతలకు రాగానే ప్రదక్షిణలు కొనసాగించింది ఆట. దానితో వారు కూడా ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని ప్రసారం చేశారు. క్రింద  వీడియోలో ఇవ్వబడినది వారు చేసిన ప్రసార ఎపిసోడ్ .


      ఇది కేవలం పుట్టనహళ్లి కుక్క విషయం లోనే కాదు. 8 సంవత్సరాల క్రితం ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కల సిద్ధాంతం అనే ఊరిలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడిలోనూ ఇలాంటి అద్భుతo  లేక అసాధారణ సంఘటన జరిగింది . ఒక వరాహం (పంది ) ఆ గుళ్ళోకి వచ్చి ధ్వజస్తంభం దగ్గర చుట్టూ తిరుగుతుంటే , భక్తులు "ఛీ , ఛీ "అని దానిని వెళ్లగొట్టారు ఆట. దానితో వెళ్లిపోయిన ఆ వరాహం తిరిగి ఉదయానే గుడి పరిసర్తాలకు వచ్చి , గుడి చెంత ప్రవహిస్తున్న నదిలో స్నానం చేసి వచ్చి , యదావిధిగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది ఆట.అలా 8 గంటలు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయింది .  తిరిగి  రెండవరోజు వచ్చి యధాప్రకారం ప్రదక్షిణలు చేస్తుంటే భక్తులు ఆశ్చర్యం గా గమనిస్తున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి వారాహం మూర్ఛ వచ్చి పడి పోయేసరికి జనం కంగారుపడి , దానిని ఉపచర్యలు చేసి ఊళ్ళో పశువుల డాక్టర్ గారికి కబురు చేశారట . ఆయన వచ్చి దానికేదో ఇంజక్షనులు గట్రా చేస్తే అది కోలుకుని తిరిగి ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టింది.

       ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు అని జనం అదిగితే "దానికి మెదడుకు సంబంధించిన  Encephalomeningitis   అనే వ్యాధి ఉంది. కాబట్టే అది ఇలా ప్రదక్షిణలు చేస్తోంది. ఇది రెండు రోజులు కంటే ఎక్కువ బ్రతకదు " అని అన్నారట . "అదంతా సరేనండి , మెదడు దెబ్బ తిన్న పంది అయితే అది ఉండే చోటే గిరా గిరా తిరగడమో లేక తనను ఉంచే పంది గూడు చుట్టూ తిరగడమే చేయాలి కానీ, ఇలా గోదారిలో స్నానం చేసి బాలాజీ  దేవాలయo  ధ్వజస్తంభo చుట్టూ తిరగడం ఏమిటి డాక్టర్ గారు " అంటే దానిలో ఉన్న మర్మం ఆ దేవుడి కె ఎరుక అని వెళ్ళిపోయాడు ఆట. మీకేమైనా తెలుసా పూజారి గారు అని గుడి పూజారి గారిని అడిగితే "దానిని గ్రహాలు పట్టి పీడిస్తున్నాయి. గ్రహశాంతి కోసం అలా చెయ్యడం అనివార్యం. జంతువులకు అయినా గ్రహపీడ తప్పదు అన్నారట.

                                                                           

                                                                                       

     వరాహం కి ఉన్న రోగం ఏమిటో డాక్టర్ గారికి తెలిసినా , ఆ రోగానికి ,ధ్వజస్తంభ ప్రదక్షిణానికి ఉన్న లింక్ ఏమిటో ఆయనకు తెలియదు కాబట్టి ,  ఆయన సైన్స్ వాదులకు కానీ, సామాన్య జనానికి కానీ సంతృప్తి కరమైన సమాధానం ఇవ్వలేకపోవచ్చు . ఇక పూజా రి గారు చెప్పినది విని సామాన్యులు సంతృప్తి చెందినా , అంతోఇంతో సైన్స్ తెలిసిన వారు  సంతృప్తి చెందరు. ఇక మేమే విజ్ఞాన వాదులం అని విర్రవీగే వారు మాత్రం "ఇదంతా హంబగ్ ఎహె " పంది ఏమిటి, గుడి చుట్టూ తిరగడం ఏమిటి నాన్సెన్స్ అని తమకున్న సెన్స్ పరిధిలో కొట్టిపారేస్తుంటారు. ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు వందలమంది సమక్షం లో జరిగింది అన్నా నమ్మరు. ఇక సంఘటనే నమ్మనోళ్లు అందులో ఉండే సైన్స్ గురించి  చెప్పిచచ్చేదేముంది?


   ఏతావాతా ఇలాంటి వాటివలన మనకు అర్ధమయ్యేది ఏమిటంటే మనిషి తెలుసుకుంది అత్యల్పం , తెలుసుకోవలసింది అనంతం. దేనికైనా సమాధానం దొరికితే సైన్స్ మాయ, లేకుంటే దేవుడి మాయ అని అనేసుకుని హ్యాపీగా బ్రతికేయడం ఇంగితజ్ఞానుల పని. లేకుంటే ప్రతిదీ ప్రశ్నించుకుంటూ పోతే ఆనందం ఆవిరైపోయి జీవితం చప్పగా చల్లారిపోతుంది.ప్రకృతిని  ప్రశ్నించి శోధనలు చెయ్యడానికి నాడు ఋషులు ప్రయత్నిస్తే , నేడు సయింటిస్టులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ బృహత్కార్యాన్ని వారికే వదిలేసి మనజీవన విధానం లో మనకు అప్పచెప్పబడిన పనిని మనం పూర్తిచేయడమే మన ధర్మం . ఆ ధర్మాన్ని రక్షిస్తే అది సదా మనల్ని రక్షిస్తుంది.

   Source :     http://creative.sulekha.com/devotee-pig-doing-rounds-at-balaji-temple_382615_blog

                          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!