Posts

Showing posts with the label దేవుడు

ఈ దేశంలో దేవుడు,సైతాన్ లే హీరో,విలన్లు.ప్రజలెప్పుడూ ప్రేక్షకులే!

                                                                మనం పాత సినిమాలు చూస్తే,అందులో మౌలికంగా కథ ఒకే పద్దతిలో ఉంటుంది.సినీమా మొదట్నుంచి విలన్ దే పై చెయిగా ఉంటుంది.అన్ని తప్పుడు పనులు చేసే విలన్ చాల రిచ్ గా ఉంటాడు.హీరో బాగ కష్ట పడి విలన్ అవినీతి పనుల్ని ఎండ గడుతూ,చాలా బాదలు పడుతుంటాదు. ప్రజలకు పట్టని వారి సమస్యలను(పాపం వారికి విలన్ అంటే భయం కాబట్టి)తనే నెట్టి మీద వేసుకుని తెగ ఇబ్బందులు పడుతుంటాదు. అన్నిటి కంటె విచిత్రమైన సీన్ ఏమిటంటే, అవినీతి పరుడైన విలన్ గాంగ్ ని హీరో ఒక్కడే పబ్లిక్ గా ఎదుర్కొని ఫైట్ చేస్తూ ఉంటే చ్ట్టూ చేరిన జనం చోద్యం చూస్తూ ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఒక్కడంటే ఒక్కడు వచ్చి, హీరోకి సహాయంగా నిలవరు. ఈ విదంగా అన్ని బాదలు పడ్డ హీరో అంతా కోల్పొయి, చివరకు ఎలాగోలా విలన్ తో లాస్ట్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు పోలిసులు వచ్చి విలన్ని పట్టుకెళతారు.అందరు హేరో ని అబినందిస్తుండగా శుభం కార్డు పడుద్ది.  ఈ కథంతా ఎందుకు చెపుతున్నామంటే, ప్రస్తుతం మన దేశంలొ జరుగుతున్న పరిణామాలు పాత సినిమా నే తలపిస్తున్నాయి.పాపం, మన దేశంలో రాజకీయలు వ్యాపార మయమై, అవినీతి సైతాన్ను  ఎదిరిస్తే