"కులాలను" కూల్చగల, మగదీరులెవ్వరురా!
’కుల రహిత’ సమాజాన్ని,నిర్మించాలన్న, మన రాజ్యాంగ నిర్మాతల ఆశలు అడియాశలు అయినవి. అంచె పద్దతిలో నిర్మాణాత్మకమయిన కులవ్యవస్తను నిర్మూలించడం ఎవరి వల్లా కాదు అనేది తేలి పోయింది.మన సమాజంలో "మత మార్పిడి" కి అవకాశం ఉంది. కాని "కులం విషయంలో అట్టి అవకాశం లేదు. కారణం తమ కులాలను ఒదులుకోవడానికి ఏ ఒక్క కులం వారు సంసిద్దులుగా లేరు. "అగ్రవర్ణాలవారు" తమ ఆదిక్యతను ప్రదర్శించడానికి ’కులం కార్డు" వాడుతుంటే, నిమ్న వర్గాలవారు, తమకు లభించాల్శిన "రిజర్వేషన్’లు కొరకయినా ’కులం కార్డు’ వాడక తప్పటం లేదు. అందుకే కులం కొందరికి "అహంభావం" అయితే చాలామందికి ’ రిజర్వేషన్ల అవసరం". కాబట్టి ఇటువంటి పరిస్తితుల్లో "కుల నిర్మూలన" గురించి ప్రస్తావించే దైర్యం ఏ రాజకీయ పార్టీ చేయదు గాక చేయదు.సర్వ అదికారాలకు మూలం "రాజ్యాదికారం". అన్నివర్ఘాల ప్రజకు దీనిలో బాగస్వామ్యం అనివార్యం. మన సమాజాన్ని, కుల ప్రాతిపదిక తప్ప ఏ ప్రాతి పదికన చూసిన అది ద్రుష్టి లోపమే అవుతుంది. ప్రజలకు సమ న్యాయం చేయటమే క