బావను నిర్భయ క్రింద బుక్ చేసారు సరే, మరదలు మీద మర్డర్ కేసు పెట్టరా?
కొన్ని కొన్ని సంఘటనలు వింటున్నా , కంటున్నా చీ , చీ మనం ఇలాంటి సమాజం లో ఉన్నామా అనిపిస్తుంది. ఇంట్లో పిల్లలు తింటున్నారా , లేదా ? వారి పరిస్తితి ఎలా ఉంది? వారి చదువు సంద్యలు ఎలా ఉన్నాయి? ఇలాంటివి కూడా ఇంట్లో పెద్దలు కానీ , హాస్టల్లో పెద్దలు కానీ పట్టించుకోపోతే ఎందుకు వారి పెద్దరికం? తగలబెట్టడానికా? పదహారేళ్ళ అమ్మాయి గర్భం దాల్చి ఒక శిశువు కు జన్మ నిచ్చే దాక అటు ఇంట్లో కుటుంభ సబ్యులు కానీ , ఇటు హాస్టల్లో ఆరోగ్య కార్యకర్త గానీ గమనించ లేదట! ఇంతకంటే విచిత్రం మరెక్కడైన ఉంటుందా? వివరాలు లోకి వెళితే మొన్న మంగళవారం తెల్లవారు జామున నిజామాబాద్ జిల్లాలోని పిట్లం లో గల కస్తూర్భా బాలికల విద్యాలయంలో పదో తరగతి చదివే పదహారేళ్ళ అమ్మాయి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ అమాయి గర్బం తో ఉన్న విషయం ఆ హాస్టల్లో ఎవరికీ తెలియదట! ఆ అమ్మాయి ఎవరి సహాయం లేకుండానే పురుడు పోసుకోవటం సాహాసమే. అంతే కాదు అలా తనకు పుట్టిన ఆ శిశువు ని ఎవరైనా చూస్తారు అని గప్ చుప్ గా తీసుకు వెళ్లి పై అంతస్తు నుండి క్రిందకు విసిరేసి