బావను నిర్భయ క్రింద బుక్ చేసారు సరే, మరదలు మీద మర్డర్ కేసు పెట్టరా?

                                                                   



                                కొన్ని కొన్ని సంఘటనలు వింటున్నా , కంటున్నా చీ , చీ మనం ఇలాంటి సమాజం లో ఉన్నామా అనిపిస్తుంది. ఇంట్లో పిల్లలు తింటున్నారా , లేదా ? వారి పరిస్తితి ఎలా ఉంది? వారి చదువు సంద్యలు ఎలా ఉన్నాయి? ఇలాంటివి కూడా  ఇంట్లో పెద్దలు కానీ , హాస్టల్లో పెద్దలు కానీ పట్టించుకోపోతే ఎందుకు వారి పెద్దరికం? తగలబెట్టడానికా? పదహారేళ్ళ అమ్మాయి గర్భం దాల్చి ఒక శిశువు కు జన్మ నిచ్చే దాక అటు ఇంట్లో కుటుంభ సబ్యులు కానీ , ఇటు హాస్టల్లో ఆరోగ్య కార్యకర్త గానీ గమనించ లేదట! ఇంతకంటే విచిత్రం మరెక్కడైన ఉంటుందా? వివరాలు లోకి వెళితే

    మొన్న మంగళవారం తెల్లవారు జామున నిజామాబాద్ జిల్లాలోని పిట్లం లో గల కస్తూర్భా బాలికల విద్యాలయంలో పదో తరగతి చదివే పదహారేళ్ళ అమ్మాయి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ అమాయి గర్బం తో ఉన్న విషయం ఆ హాస్టల్లో ఎవరికీ తెలియదట! ఆ అమ్మాయి ఎవరి సహాయం లేకుండానే పురుడు పోసుకోవటం సాహాసమే. అంతే కాదు అలా తనకు పుట్టిన ఆ శిశువు ని ఎవరైనా చూస్తారు అని గప్ చుప్ గా తీసుకు వెళ్లి పై అంతస్తు నుండి క్రిందకు విసిరేసిందట ఆ మానవత్వం లేని మైనర్ తల్లి!. మల్లీ ఏమి ఎరుగనట్లే నిద్ర పోయిందట. ఎంత నిర్దయ! ఇలాంటి ఆడపిల్లలు  ఉంటారా ?

   తెల్లారిన తర్వాత తోటి విద్యార్దినులు లేచి ఆ  అమ్మాయి పక్క బట్టలు అంతా రక్త మయం గ ఉండటం గమనించి కేర్ టేకర్ కి చెపితే ఆమె వచ్చి విషయం అడిగితే తనకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందని చెప్పిందట. నిజమేనని నమ్మారట అక్కడున్న  వారు.  అయితే ఆ అమ్మాయి విసిరేసిన శిశువు క్రింద గాయాల పాలై ఏడుస్తుంటే హాస్టల్ వారు గమనించి ఆ శిశువును తీసుకు వచ్చారట. ఆ బాబును హాస్పిటల్లో చేర్పించి చికిత్సా అందించినా పలితం లేక పోయింది. ఆ శిశువు చనిపోయాడు. దీనితో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది అమ్మాయిని గద్దించి అడిగే సరికి అమ్మాయిగారు అసలు విషయం చెప్పేశారు.

    ఆ అమ్మాయి ఇంట్లో తల్లి తండ్రులు మరియు అమ్మాయి బావ ఉంటారు. బావకు ఆ  అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేద్దామని ఎప్పుడొ అనుకున్నారట. ఇక ఆ అమ్మాయి చదువు కంటే బావతో సరసాలకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చినట్లుంది, పదో తరగతి పరీక్షలు రాయకుండానే గర్భం దాల్చింది.అలా నవమాసాలు మోసిన ఆ రహస్య గర్బాన్ని, శిశువు జన్మించగానే గుట్టు చప్పుడు కాకుండా బవంతి మీద నుండి బయటకు విసిరేసి బాద్యత తీర్చుకుంది ఆ బాల మాత. . అయితే ఇక్కడ ఒక అనుమానం ఏమిటంటే తన గర్భానికి తనకు కాబోయే మొగుడే కారణమైతే ఆ గర్బం గురించి తల్లి తండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచి, ఆ బాబును ఎందుకు చంపిందో అర్దం కావటం లేదు. ఇవ్వన్నీ పోలిస్ వారి విచారణలో తేలాల్సిన విషయాలు.
              కానీ మీడియా వారి సమాచారం మేరకు అమాయికి 16 యేండ్లే కాబట్టి, శ్రుంగారం లో పాల్గొనడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాబట్టి ఆ అమాయి బావమీద "నిర్భయ " కేసు పెట్టారట. చాలా సంతోషం . ఇంత  టెక్నికల్ గా ఆలోచించి అబ్బాయి మీద కేసు పెట్టిన వారు , అమ్మాయి ఒక శిశువును అంతస్తు మీద నుండి క్రిందకు విసిరేసి ఆ శిశువు ను చంపిందే , మరి ఆమె మీద "మర్డర్" కేసు పెట్టాల్సిన అవసరం లేదా ? ఏమిటో ఈ పోకడలు. ఎవరికీ ఏమి చెప్పలేని పరిస్తితి? గోటితో పోయే విషయాలు కూడా గొడ్డలి దాక తెచ్చుకోవడం అంటే ఇదే! "నాకు చదువు వద్దు. బావతో సంసారం ముద్దు." అని ఒక్క మాట ఇంట్లో చెపితే సరి పోయేది. కనీసం పిల్ల శరీర పరిస్తితిని పెద్దలు పసి కట్టినా ఆ ఘోరం జరుగకుండా ఉండేది. కానీ అలా జరుగ లేదు . ఎందుకంటే ఆ బావా మరదళ్ళు నొసటినా కాపురం కంటే ముందు కారాగారా వాసం  చెయ్యాలని రాసి ఉండబట్టే ఇలా జరిగి ఉంటుందని అనుకోవడం తప్పా ఎవరు ఏమి చెయ్యగలరు!
                                                    (Republished Post . 8/1/2014)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం