"నాగుపాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు

                                                                       
                         
                                  శ్రీ మద్దిగుంట తిరుపతయ్య మరియు శ్రీమతి మద్దిగుంట సరస్వతి గారలు.                   
       
                  ఈ  రోజు  నాగ చతుర్దీ. మనవు  తెలుగు బ్లాగు మిత్రులకు, వీక్షకులకు , అగ్గ్రిగ్రేటర్లకు నాగుల చవితి పండగ శుభాకాంక్షలు తెలియ చేస్తూ, నాగేంద్రుని మహిమలు గురించి మా తల్లి తండ్రుల ద్వారా విన్న వారి ప్రత్యక్ష అనుభవాలు చెపుతాను .                                      

                            నాగు పాములకు మహిమలు ఉంటాయని మనం పురాణాలలో చదివాము.ఎన్నో సినిమాలు ఈ నేపద్యంలో తీసారు.హిందూ దేవుళ్లలో నాగ దేవతకు ప్రత్యేక స్తానం ఉంది.మన జాతి చరిత్ర ప్రకారం మనం "నాగ వంశం" నకు చెందిన వారమని చెపుతారు.ముఖ్యంగా దీపావళి పందుగ తర్వాత వచ్చే చవితి ని "నాగుల చవితి" గా మనం పందుగా చేస్తాం. ఆ రోజు పుట్టలో పాలు పోసి,స్త్రీలు పాటలు పాడి, భక్తితో నాగేంద్రుని కొలుస్తారు.సరే అన్నిటి వలే ఈ నాగ దేవతవిషయమ్ లో కూడ సైన్స్ చెప్పేది వేరుగా ఉంటుంది.ఎవరో చెప్పటం వేరు, ప్రత్యక్షంగా మనకు ఆ స్వామి మహిమలు అనుభవంలోకి రావటం వేరు. అటువంటి మహిమలు స్వయంగా చూసిన దన్య జీవులు కీర్తి శేషులైన మా తల్లి తండ్రులు "శ్రీ మద్దిగుంట తిరుపతయ్య మరియు శ్రీమతి మద్దిగుంట సరస్వతి గారలు.

                                                                           

 మా తండ్రిగారి అనుభవం:-ఆయన గారు ఒక రోజు మా చేల వద్ద నుండి ఇంటికి తిరిగి వస్తూండగా,మా ఇంటి దగ్గరకు వచ్చే సరికి హటాత్తుగా ఒక నాగు పాము రోడ్డు ను క్రాస్ చేసి వెళుతుండగా, అప్పూడె అటుగా వస్తున్న కారు దాని మీదుగా వెళ్లడం జరిగింది. అయ్యో,అయ్యో, అని మా నాన్న గారు అనుకునే లోపునే ఆ పాముకు ఏమి జరుగకుండానే సురక్షితంగా ఆవలి వైపుకు వేల్లడం జరిగిందట.కాని విచిత్రంగా,ఆ కారు కొద్ది అడుగుల ముందుకు పోయాక హట్టాతుగా ఆగి పోవడం,దానిలోనుంచి డ్రైవర్, కారులోని వారు దిగి కారును పరీక్షించగా వారికి కారులో ఎటువంటి ఫాల్ట్ కనిపించక అయోమయంగా చూచుచుండగా, మా తండ్రి గారు "ఎందుకలా పాము మీద నుండి కారును నడిపావు" అని   డ్రైవర్ను గద్దించగా, తాను చూచుకోలేదని మొదట బుకాయించిన, చివరకు తాను కావాలనే కారును పాము మీద నుంచి పోనిచ్చానని ఒప్పూకున్నడట.అప్పుడు మా నాన్న గారు"అది మహిమ గలదై ఉంటుంది.ఎందుకైనా మంచిది దండం పెట్టుకోమని చెప్పగా ఆ డ్రైవర్,ఆ విదంగానే చెయ్యడం, ఆ కారు యదా విదిగా స్టార్ట్ ఐయి వేళ్లడం జరిగింది.

  అప్పట్టి నుండి మా నాన్న గారు ఆ పామును దేవత గా భావించారు. ఆ తరవాత మా అమ్మ గారి కి కూడా వేరోక రూపంలో అదే ,పాము మహిమ కన్పదేసరికి,అప్పటి నుండి అ పామును దేవతా పాముగా బావించి పూజలు చేస్తుందే వారు.
                                                                             


                                                                     మా ఇంటి దగ్గరి పుట్ట

మా అమ్మ గారి అనుభవం:-మా నాన్న గారి అనుభవం గురించి మాఅమ్మ గారికి చెప్పక పోవటం వలన,ఒక రోజు అదే పాము మా ఇంటి దగ్గర ఉన్న తన పుట్టలోకి వెళ్లడం చూసిన మా అమ్మ గారు,నాగు పాము విష సర్పం కాబట్టి దాని వలన మనుషులకు గొడ్లకు ఎప్పటికైనా ప్రమాదమని బావించి,జీతగాళ్లని పిలిచి పుట్టను తవ్వి పామును చంపవలసినదిగా ఆదేశించిండం జరిగింది.వెంటనే మా జీత గాళ్లు,పుట్టను తవ్వటం ప్రారంభించగా,లోపలనుండీ పాము బుసలు పెట్టడం జరిగింది. ఆ వెంటనే మా అమ్మ గారు స్ప్రుహ తప్పి పడి పోగా,జీతగాళ్లు కంగారుపడి పుట్ట తవ్వడం ఆపుచేసి,మా నాన్న గారికి కబురందిచగా,ఆయన వచ్చి,విషయంతెలిసికొని,ఇది ఆ నాగ రాజు మహిమాగా బావించి, ఆ స్వామిని ప్రార్థించగా, మా అమ్మ గారు యదాస్తితికి వచ్చారట.

                                                                                                                       పై రెందు ద్రుష్టాంతలతో, మా తల్లి తంద్రులకు ఆ సర్పం దేవతా సర్పంగా బావించి నిత్యం కొలిచే వారు.ఆ సర్పం ఒక్క పుట్ట మా ఇంటి ప్రక్కనే ఉన్నప్పటికి ఎవరూ భయపడకుందా బక్తి బావాలతో మెలిగే వారు.ఆ సర్పం మా ఇంటి దగ్గరున్న పుట్ట నుండి తరచూ మా ఇల వేలుపు శ్రీ లక్ష్మి నరసింఃఅ స్వామి ఆలయంలోకి వెళ్ళడం చూసిన మా నాన్న గారు తమను కాపాడుటకు తమ ఇలవేలుపే ఆ సర్ప రూపంలో తిరుగాడుతున్నాడని విశ్వసించే వారు.ఆ నమ్మకముతొనే "సూర్య జయంతి"అయిన "రథసప్తమి" నాడు జన్మించిన నాకు,నా పేరును ఇద్దరి దేవుళ్ల పేరు కలిసి వచ్చేలా "శివ నాగ నరసింహా రావు" అని పెట్టడం జరిగింది.కాని ఖమ్మం స్కూల్లో జాయిన్ చేసేటప్పూదూ మా అన్నయ్య గారు రికార్డుల్లో నా పేరును కేవలం "నరసింహా రావు" నమోదు చేయించ బట్టి, అదే స్తిరపడి పోయింది.

                                                                           
      
నాకు 4 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల చదువుల నిమిత్తం మేము గార్లవొడ్డు నుండి ఖమ్మం రావడం జరిగింది. మా అమ్మ గారు నాన్న గారు మాత్రం అక్కడే వుండి వ్యవసాయ వ్యాపారాలు చూసుకునేవారు. ఆ స్వామి దయ వలన మా నాన్న గారు పట్టిందల్ల బంగారమఈ సుమారు 140 ఎకరాల భూ స్వామి కాగలిగారు.సుమారు 2౦౦ మంది పనివాళ్ళతో,14  మంది జీతగాళ్ళతో,నిత్యం మా ఇల్లు ఉన్న ప్రాంతం ఒక చిన్న ఊరిలాగౌందేది.అసలు ఊరు చాలా లోపలికి ఉండెది. మా ఇల్లు మా చేలలో కట్టబడి ఊరికిదూరంగా ఉండేది.ఆవిదంగా మా  కర్ర వ్యాపారం కూడ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లడానికి "నాగేంద్ర స్వామి" తిరుగాడిన ప్రాంతం"మరియు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి" ఉన్న ప్రాంతం లో మేము ఉండటమే అని మా తల్లి తండ్రుల విశ్వాసం.అందుకే వారు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి"కళ్యాణంతో పాటు,ప్రతి "నాగుల చవితి"ని ఘనంగా జరిపెవా రు. వారు పాటించిన ఆచారాన్నే మా కుటుంబ సభ్యులం నేటికీ కొనసాగిస్తున్నాం .మా నాన్న గారు మొదట్లో నాస్తికుడిగా , కమ్యూనిస్ట్ పార్టీల్లో సభ్యుడిగా ఉండే వారు. కానీ నాగేంద్ర స్వామీ సహిత నరసింహ స్వామీ అద్భుతాలు ఆయనను ఎలా ఆస్తికుడిగా మార్చాయో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. దాని గురించి పూర్తీ వివరాలకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి 

                                                               


                             అదండి మా ఇల వేల్పుల మహిమలు.మా నాన్న గారు సత్య సందుడు.అయన అబద్దం చెప్పగా నేను వినలేదు. ఈ విషయాలన్ని ఆయనే స్వయంగా చెప్పారు. మా జీతగాళ్లు కూడ తరచుగా ఆ మహిమలను తలచుకునే వారు. అందుకే నేను అంత రూడిగా చెప్ప గలుగుతున్నాను.ఈ నాడు మా ఇలవేల్పు అయిన ఆ నాగేంద్ర  స్వామీ పుట్ట వద్ద మేము మాత్రమే కాక మా గ్రామం మరియు  చుట్టుప్రక్కల గ్రామాలు వారు కూడా వచ్చి నాగపూజ జరిపి తమకు కలుగుతున్న అనేక కష్టాలు నుండి విముక్తి పొందుతున్నాం అని విశ్వసిస్తున్నారు . వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలు,న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లు క్రింది ఇవ్వడం జరిగినది .

                                                                           

                                                                                                                                                                                  జై నాగేంద్ర!                                                          జై లక్ష్మి నరసింహా

 గార్లఒడ్డు  శ్రీ లక్ష్మీ నరసింహా స్వామీ ఆలయం గురించి మరిన్ని వివరలు కొరకు ఈ వీడీయో లింక్ మీద క్లిక్ చేసి చూడండి


                                                                  

                                    

Comments

 1. మహిమల గురించి చక్కటి విషయాలను తెలియజేసారు.
  శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి, నాగదేవతలకు నమస్కారములు.

  ReplyDelete
  Replies
  1. దన్యవాదాలు anrd గారు

   Delete

Post a Comment

Popular Posts

"పవిత్రమైన పాలు " అని నమ్మించి , విశ్వాసినులతో "వీర్యం" త్రాగించిన చర్చ్ పాస్టర్ !

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

తన ప్రేమను తిరస్కరించారని తల్లితండ్రులను చంపి , వారి శవాల సమక్షంలో ప్రియుడితో 72 రోజులు గడిపిన కసాయి కూతురు!

ఇంటాయన మీద కోపం తో పక్కింటాయన్ని ముద్దు పెట్టుకున్నట్లుంది!!!!

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

చీ..చీ..ఇంత బరి తెగించిన బార్యలు ఉంటారా!?