మహిళా అసిస్టెంట్ కమీషనర్ ఆత్మహత్య! ఆలయాల్లో రాజకీయ అవినీతికి పరాకాష్టా.
ఆమే ఒక నిజాయతి గల అధికారిణి. పేరు క్రిష్ణవేణి. వయస్సు 29. అసిస్టెంట్ కమీషనర్ గా హోదా గల ఆమే గుంటూరు నగరంలోని మూడు దేవాలయాలకు కార్య నిర్వహణాదికారిగా పనిచెసేది.సదరు దేవాలాయాల్లో రాజకీయ పక్షానికి చెందిన ధర్మ కర్తలు,వారి కనుసన్నలలో నడిచే ఉద్యోగ గణాలు బాగా అవి నీతికి పాల్పడుతూ దేవాలయాల సొమ్మును దిగమ్రింగేవారు. పాపం క్రిష్ణవేణి గారు వచ్చాక వీరి ఆటలు సాగక, ఆమేను డబ్బుతో ప్రలోభపెట్టాలని చూసారు.కాని ఆమే లొంగలేదు. నిజాయతీగా వ్యవహరించి సుమారు ఇరవై లక్షలు దాక దేవాలయాల సొమ్ము కాపాడగలిగింది.అంతే! ఆమే మీద సదరు రాజకీయ ధర్మకర్తలు,అవినీతి అధికారుల ఒత్తిడి పెరిగింది.ఆమేను నానా విదాలా హింసించారు అని,అనేక రకాలుగా బెదిరించారు అని ఆమే రాసిన డైరీ ద్వారా తెలిసింది. చివరకు ఆమే మీదా యస్.సి.యస్.టి యాక్ట్ క్రింద కే...