జస్ట్ అనుభవం లేక జబర్దస్త్ రచ్చ చేసిన రోజా !!
ఆమె గారు ఆండ్రప్రదేశ్ లోని" నగరి " అనే నియోజక వర్గానికి MLA. సదరు నియోజక వర్గం లో ఓట్లు వేసిన ప్రజలలో మెజార్తీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆమే నగరి నియోజక వర్గ ప్రతినిదిగా , ఆ నియోజక వర్గ ప్రజల సమస్యలు వినిపించడానికి అసెంబ్లీలో అడుగుపెట్టింది. కాని విచిత్రం ఏమిటంటె ఆంద్రా అసెంబ్లీలో ఆమె గారు ఎన్నో విషయాలు మాట్లాడింది కాని, అందులో నగరి ప్రజల సమస్యలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు లేదు. సభలో ఆమె హవబావ ప్రవర్తన తో కూడిన డైలాగులుకి తట్టుకోలేక అధికారపక్షం వారి తీర్మాణం తో స్పీకర్ గారు 1 సంవత్సరం పాటు సభ నుండి సస్పెండ్ చేసారు. దాన...