బరి తెగించిన బాయ్ ప్రెండ్ సంస్కృతికి బలి అయిపోయిన "బాలికా వధు " ప్రత్యుషా బెనర్జీ !!
బారత టెలివిజన్ సీరియల్ చరిత్రలో రామాయణ , మహా భారత సీరియల్స్ తర్వాత అంత జనాదరణ పొందిన సీరియల్ బాలికా వధు . దానినే తెలుగులో "చిన్నారి పెండ్లి కూతురు " గా అనువదించి ప్రసారం చేసారు. హిందీ లో ఆ సిరియల్ ఎంత జానాదరణ పొందిందో , తెలుగులోను అంతే ప్రేక్షకాదరణ పొందింది. ఆ సీరియల్ లో చిన్నారి పెండ్లి కూతురు టైటిల్ రోల్ ను పోషించిన ప్రత్యూష బెనర్జీని తెలుగు ప్రేక్షకులు తమ స్వంత ఇంటి ఆడపడచులాగా బావించి ఆమెకు అభిమానులుగా మారారు. దీనికి ప్రధాన కారణం రాజస్తానీ సంప్రాదాయ దుస్తులలో ఆమె చూపిన హావ బావ విన్యాసం తో కూడిన నటనా కౌశల్యం . తెలుగు సీరియల్స్ ని సైతం కాదని , తెలుగు మహిళా మణులు ఈ సీరియల్ కు బ్రహ్మ రధం పట్టారు అంటె కేవలం అందులో చూపించిన సాంప్రాదాయ గ్రామీణ...