చేవెళ్ల చెల్లెమ్మకు, పులివెందుల అన్న ఇచ్చిన బహుమానం, "చార్జ్ షీట్" లొ స్థానం.
పాపం, కరుణామయుడు, దయామయుడు, మడమతిప్పని మహా యోదుడు, నమ్మిన వారిని అనునిత్యం కాపాడతాడని పేరున్న ఆయన్ని నమ్మినందుకు సాక్షాతు రాష్త్ర తొలి హోమ్ మంత్రి గారు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు. పాపం పోలిస్ వారు ఏమి అనలేక అటు చట్ట నిబందనలని కాదనలేక ఆవిడ గారి పేరును "చార్జ్ షీట్" లో పెట్టి మా పనయిపోయింది ఇక పైనున్న "అమ్మ" ఇష్టం, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిష్టం అన్నట్టు కామ్ గా చూస్తున్నారు. వ్యక్తులుని నమ్మి గుడ్డిగా అనుసరించే వారికి మన రాష్త్ర హోమ్ మంత్రి గారి ఉదంతం, ఐ.ఎ.ఎస్ అదికారిణి శ్రీ లక్ష్మి గారి ఉదంతం ఒక కను విప్పు కావాలి. నాటి దర్మం స్థానాన్ని నేడు చట్టాలు ఆక్రమించాయి. కాబట్టి దర్మాన్ని ఆచరించకపోయినా కనీసం చట్టాలను గౌరవించి వాటి ప్రకారమే చేస్తే ఈ తిప్పలు ఉండేవి కావుగా. పాపం ఆ శ్రీ లక్ష్మి ని చూస్తే జాలి వేస్తుంది. అతి చిన్న వయసులో ఐ.ఎ.ఎస్ అధికారిణిగా ఉన్నత శికరాలు ఎక్కింది.మంచి పేరు తెచ్చుకుంది. కాని ఏమి లాభం?ఒక్క మాయని మచ్చతో అదః పాతాళానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సహాయకులు లేకుండ