మనశ్శాంతి కోసం "మతం", సమాజ క్రాంతి కోసం సైన్స్ , రెండూ అవసరమేనని నమ్మిన గొప్ప సైంటిస్ట్ "A P J అబ్దుల్ కలాం " గారు !!
ఒక వాహనం నడవాలంటే ఇందనం ఎంత అవసరమో , ఆ వాహనం లో చలనం వలన పుట్టే ఘర్షణ నుంచి రక్షింపబడాలంటే "కందెన " కూడా అంతే అవసరం . వాహనం లో ఇంజిన్ ఆయిల్ లేకుండా నడిపితే , కోట్ల విలువ చేసే దైనా మండి పోవడం ఖ్హాయం. అలాగే మనిషికి కూడా , తన నిత్య జీవన గమనానికి సైంటిఫిక్ ఆలోచనా విదానం ఎంత అవసరమో , తన ప్రశాంతత కోసం మత విదానాలు అంతే అవసరం. రోజూగంట సేపు చేసే ద్యానం , యోగ , దేవుని పూజ, నమాజ్, ప్రేయర్ ఇలాంటి వన్నీ మనసును చల్లపరచి , రోజంతా ఆ మనిషిని బ్యాలెన్స్ మైండ్ తో నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగే లా చేస్తుంది . వాహనానికి కూడా అంతే కదా! కొంచం కందెన తో చాలా ఇందనం తో బండి ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. కందెన ఎక్కువైతే బండి స్టార్ట్ కాదు. అసలు కందెనే లేకుంటే వాహనమే మిగలదు. మత విశ్వాసాలు కూడా అంతే ఎక్కువైతే మూడ విశ్వాసాలు గా మారి మనిషి గమనానికి అవసరమైన జ్ఞానం లోపిస్తుంది. అసలు లేక పోతే బుర్ర వేడెక్కి తీవ్ర వాదిగా మారుతాడు.