అన్న చని పోయినంత మాత్రానా,వదిన స్టుడియోల చుట్టూ తిరగాల్సిందేనా !!!?
అది సెలబ్రిటిల ప్రపంచం . ఒక రంగుల మాయా లోకం . మన పురాణాలలో వర్ణించిన దేవలోకం అది . ఆ లోకం లోని వారు ఏమి చేసినా పిచ్చ పబ్లిసిటి . వారు బ్రతికి ఉన్నా పబ్లిసిటియె ,చనిపోయినా పబ్లిసిటియె . ఆ పబ్లిసిటి యే వారిని చిరంజీవులుగా ఉంచుతుంది అనుకుంటా . దేవతలు అమృతం త్రాగి చిరంజీవులుగా ఉంటే ,వీరు పబ్లిసిటి తో సదా వర్దిల్లుతున్నారు . మరి అటువంటి రంగుల లోకమైన సినిమా జగత్తులో ఒక సంగిత దర్శకులు దురదృష్ట వశాత్తు మరణిస్తే , అతని కుటుంబ సబ్యుల మద్య ఏర్పడిన స్వల్ప బేదాభిప్రాయాలను సరి చెసే పెద్దలే లేరా? లేకుంటే వారి తగాదాకు కూడా పెద్ద పబ్లిసిటి వచ్చెలా చేసి ,ఆ తర్వాత సినిమా కద గా మార్చి పాయిదా పొందుదాం అనుకుంటున్నారా ? సంగీత దర్శకులు స్వర్గీయ చక్రి గారు గుండె పోటుతో మరణించి నెల రోజులైనా కాకముందే ,అయన భార్యా, అ...