పెండ్లి అయిన "సానియా మీర్జా " గారు , "Miss " ఎలా అయ్యారు ! ఓ 'రబ్బా' '!!!?
నాకు తెలిసినంతవరకు ఇంగ్లీష్ లో వివాహితులు అయిన స్త్రీ పురుషులను సంబొందించడమ్ లో వివక్షత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. పురుషుడు అవివాహితుడు అయినా , వివాహితుడు అయినా సంబోదించడం తేడా ఏమి ఉండదు . మిస్టర్ X అని సర్వకాల సర్వాస్తల యందు పిలువవచ్చు . కాని అదే స్త్రీ అయితే పెండ్లి కాక ముందు Miss Y అని పిలువబడిన ఆమె పెండ్లి అయ్యాక మాత్రం Mrs Y (మిస్సెస్) అని పిలువబడుతుంది. ఇది అందరి విషయం లో ఒకటే అనుకునే వాణ్ని ఇన్నాళ్ళు . కాని ఈ సంబోధ సూత్రం "ఇండియాలో ఇంతులకు రక్షణ లేదహో " అని చాటి చెప...