Posts

Showing posts with the label దొరల తెలంగాణా !

అమర వీరుల త్యాగ పలితం, ధరల తెలంగాణా ! దొరల తెలంగాణా !?

                                                          సుమారు 1300 మంది ఆత్మ హత్యలు చేసుకుంటే కాని తెలంగాణాకు విముక్తి లభించలేదు . ఇది తెలంగాణా లోని ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి వేళా , ప్రతి చోటా నొక్కి వక్కానించిన మాట .అలాగే తెలంగాణా ఏర్పడ్డాక ప్రతి అమరవిరుడి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని K.C.R గారు అన్నట్లు గుర్తు . కాని తెలంగాణా ప్రకటించాక ఈ అమరవీరుల కుటుంబాల వారెవ్వరూ "సంబురాల్లో " పాల్గొన్నట్లు మీడియాలో ఎక్కడా కనిపించలేదు . బహూశా ఆత్మానందం పొంది సంతృప్తి చెంది ఉంటారు .    చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన ముక్యమైన సామజిక పరివర్తన నిమ్న వర్గాల ప్రజలకు రాజ్యాదికారం సిద్దించడం అని భారత రాజ్యంగ నిర్మాత శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు . దానిని నమ్మి తెలంగాణా సాధనకు ఉద్యమించిన వారిలో   గద్దర్ అన్న, విమలక్క, దళిత బహుజన వర్గాల   నాయకత్వంలో లక్షలాది ప్రజలు, కవులు , కళాకారులూ "సామాజిక తెలంగాణా " కోసం నినదించార...