శ్రీ లంక టూరిజం అభిరుద్ది కొరకు రావణాసురిడిని "మండోదరి " మట్టుపెట్టిందట!
ఇది వ్యాపార యుగమ్. తమ వ్యాపార అభివృద్ధి కోసం చరిత్రలను వక్రీకరించడం వ్యాపారులకు, వారిని ప్రోత్సాహించే పాలకులకు అలవాటే. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! అని పాలకులు ఇచ్చే ప్రోత్సాహంతో చరిత్రను వక్రీకరించి రాసే రచయితలూ తయారు అవుతారు. అదిగో అలా తయారు అయిన వాడే "రావణా డి కింగ్ అఫ్ లంక " పుస్తక రచయిత "మిరాండోఒబెసిక్రీ". ఆయన రాసిన రావణ చరిత్ర రావణా సురుడిని హీరోగా అభి వర్ణిస్తుందట. అయన గారి ప్రక...