శ్రీ లంక టూరిజం అభిరుద్ది కొరకు రావణాసురిడిని "మండోదరి " మట్టుపెట్టిందట!



                                                                             

                                     

                        ఇది వ్యాపార యుగమ్. తమ వ్యాపార అభివృద్ధి కోసం చరిత్రలను  వక్రీకరించడం వ్యాపారులకు, వారిని ప్రోత్సాహించే పాలకులకు అలవాటే. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! అని పాలకులు  ఇచ్చే ప్రోత్సాహంతో చరిత్రను వక్రీకరించి రాసే రచయితలూ తయారు అవుతారు. అదిగో అలా తయారు అయిన వాడే "రావణా డి కింగ్ అఫ్ లంక " పుస్తక రచయిత "మిరాండోఒబెసిక్రీ".
                      ఆయన రాసిన  రావణ చరిత్ర రావణా సురుడిని హీరోగా అభి వర్ణిస్తుందట.  అయన గారి ప్రకారం రావణాసురుడు యుద్దంలో రాముడు వేసిన రామ బాణానికి చావలేదట. విష పూరితమైన రాముడి బాణాలు వలన క్రుంగి ,కృశించి , కొన్నాళ్ళ తర్వాత మరణించాడట. అంతే కాదు అజేయమైన రావణ సైన్యం ముందు రాముని వానర సైన్యం అప్త్రాల్ ఆట. కాని తన పట్టపు రాణి మండోదరి రాముని పక్షాన చేరి ,కుట్ర చేయబట్టే రావణాసురుడు హత మయ్యాడు అట!. ఈ విధంగా లంకేసుడి చావుకు అంతఃపుర కుట్ర  యే తప్పా అన్యదా అన్యదా కాదట!.

   సదరు పరిశొదక  రచయత గారు రాసిన దాని ప్రకారం చూస్తె అసలు రామయణ యుద్దంలో  రాముడికి రావణాసురుడికి యుద్దం జరుగుతున్నా వేళ" మందోదరి"  చాటుగా ఉండి రావణాసురుడి మీద విషపు బాణాలు ప్రయోగించి ఉంటుందా అని అనుమానం వస్తుంది . ఎందుకంటేరావణుని సైన్యంలో మాత్రమే యుద్ద సమయాల్లో త్రాచు పాము విషం పూసిన  బాణాలు  వాడేవారని  సదరు రచయిత గారే సెలవిచ్చారట  అటువంటప్పుడు రాముడి విషపు బాణాలతో రావణాసురుడు కృశించి చనిపోయాడు అని చెప్పడంలో ఔచిత్య మేమున్నది ?రామాయణం ప్రకారం ధర్మ మూర్తి రాముడు విషపు బాణాలు ప్రయోగించే సమస్యే లేదు. రామ బాణం తోనే రావణుడు మరణించాలి. కాని అతి తెల్వి రచయితలూ చెప్పిన విష బాణ ప్రయోగం చేత రావణుడు చచ్చిందే నిజమయితే అది రావణ వర్గం వారే చేసి ఉండాలి. మరి అపరాద పరిశోదకులు మిరాండో గారు మండోదరి కుట్ర చేసింది అని అన్నారు కాబట్టి , ఖచ్చితంగా మండోడేర్  రావణుడిని మట్టు పెట్టి ఉండాలి.

  ప్రపంచం లో హిందువులు అంత ఔదార్యులు ఎవరూ ఉండకపోవచ్చు . అందుకే ,తమ పురాణ  గ్రంధాలను , పురాణ పురుషులను , తల్లులను ఎంతగా వక్రీకరించి , తమ ఉద్ద్దేశ్యాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నా , కిమ్మనకుండా    ఉండగలుగుతున్నారు . ఒకడేమో వేదాలు చెప్పింది మా దేవుడు గురించే ఎహె అంటాడు. ఇంకోదేమో  ప్రజాపతికి , జీసస్ క్రిస్ట్  కి లింక్ పెట్టి  నక్కను నాగలోకాన్ని ఒకటి చేయాలని చుస్డ్తాడు . వారందరు  ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే  వారి మతాన్ని ఇండియాలో అభివృద్ధి చేయడానికే అన్నది నిర్వివాదాంశం . ఇదే పని హిందువులు వారి మతాభిమానులు మెజార్టీ ఉన్న చోట చేయగలరా అంటే లేదు . ఆలా చేసిన మరుక్షణం
చేసిన వారి తలలు తెగిపడతాయని బహిరంగంగా దమ్కీలు ఇవ్వగల సమర్థులు వారు . అందుకే వారి మత గ్రంధాలలోని అంశాలపై వ్యాఖ్యానించే సాహసం ఈ  దేశం లో ఎవరికీ లేదు అని వారి ప్రగాఢ విశ్వాసం.

            ఇక మతాభివృద్ది కోసం కాక , తమ దేశం లోని టూరిజం అభివృద్ధి కోసం రామాయణం నే వక్రీకరిస్తున్న    లంకేయులు  ఎంతటి వారు! చివరకు తమ దేశ టూరిజం అబిరుద్ది కొరకు తమ పురాణ పురుషులను    గొప్పగా  ఫోకస్ చెయ్యడానికి పురాణా స్త్రీ అందులో పంచ పతివ్రతలలో ఒకరిగా యావత్ హిందూ సమాజం చేత కీర్తీంచ బడుతున్న ఆ మహా తల్లిని చివరకు తెలుగు సీరియల్ లో కుట్ర స్త్రీ లాగా చిత్రీకరించారు కదా! మూల కదను విస్మరించి ఎవరికీ తోచినఅట్లు వారు ఇతిహాసాలకు బాష్యాలు   చెపితే ఇలాగే ఉంటుంది.తమ మత విస్తరణ కోసం, గ్రంధాలలో అంశాలను , పురాణపురుషులను అలాగే  నీచమైన వ్యాపారాభి రుద్ది  కోసం  ఆధునిక మహిళలునే కాదు ఆరాధ్య స్త్రీలను సహితం నీచంగా చిత్రీకరిస్తున్న వారిని ఏమి చెయ్యాలో హిందూ సమాజం ఆలోచించాల్సిన   అవసరం ఎంతైనా ఉంది .
                                               (26/7/2013 Post Republished)


Comments

  1. అసలు రామాయణమహాకావ్యంలోని లంక వేరూ శ్రీలంక వేరూ‌ కావచ్చునన్న అభిప్రాయం కూడా బలంగానే ఉన్నది.

    చరిత్రను వక్రీకరించటం అన్నది ఈలంకేయులతో మొదలైనదా లంకేయులతో అంతమయ్యేదా? అంగ్లేయులు సాధ్యమైనంతగా వక్రీకరించిన చరిత్రనే కదా మనం నెత్తినపెట్టుకొని పాఠశాలల్లో పిల్లలకు బోధిస్తున్నది? మనదేశపు చరిత్రలో ఉత్తరభారతమే భారతదేశం అన్న తీరు చాలా ప్రస్ఫుటంగానే బడిపిల్లలకూ‌ తెలిసిపోతూనే ఉంటుంది. ఉత్తరభారతదేశ చరిత్ర - అదే భారతదేశ చరిత్ర అంటారు. దక్షిణభారతదేశ చరిత్రకు దేశస్థాయి చచ్చినా ఇవ్వరు. ఉత్తరదేశపు సంగీతం భారతదేశశాస్త్రీయసంగీతం. దక్షిణదేశంలో వినిపించేది ప్రాంతీయస్థాయిసంగీతం అనే పిలుస్తారు - మనవాళ్ళలో ఎవరూ నోరెత్తరు. దేశస్థాయిలో మనకు మొత్తంమీద మనమీదే చులకనభావం. అలాంటిది రాముణ్ణన్నా కృష్ణుణ్ణన్నా మనవాళ్ళకి చీమకుట్టదని లోకానికి బాగా విదితమే. మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్ అని గిరీశం నోట గురజాడ ఊరకే అనిపించలేదు మరి.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది అక్షర సత్యం శ్యామల రావు గారు

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!