ఒకరికి ఇల్లాలిగా ఉంటూనే, మరో ఇద్దరికీ ప్రియురాలిగా మారినందుకు "ఆమె" కు ఆ గతి పట్టిందా !?

                                                         
                                                                                       



                               "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని మనువు ఇటువంటి స్త్రీ, పురుషులను చూసి అని ఉంటాడు . స్త్రీ పురుషుల మద్య విచ్చలవిడి వివాహేతర సంబందాలు కుటుంబ వ్యవస్తను ఎలా బ్రష్టు పట్టిస్తున్నాయో ఈ  ఉదంతం తెలియ చేస్తుంది . పెండ్లి అయి , మొగుడు ఉండి ,ఇద్దరు బిడ్డలు తల్లి అయిన వ్యక్తిని ఒక అవివాహితుడు దైర్యంగా తనతో వేరు కాపురం పెట్టమని ఒత్తిడి చేయటమే కాక , అలా చేయనందుకు ఏకంగా హత్యే చేసాడంటే , ఈ సమాజం ఎటువంటి హిన పరిస్తితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు . దినంతటికి కారణం "లేచి పోయే రాజేశ్వరీ "లను ప్రొత్సాహిస్తున్న దిక్కుమాలిన స్త్రీ  వాదాలు కాక  మరింకేమిటి ?

    ఖమ్మం జిల్లా, మధిర మండలం లోని మడుపల్లికి చెందిన శివారెడ్డి, దంపతులకు ఇద్దరు పిల్లలు. శివా రెడ్డి గారు వీర శివారెడ్డి లాంటి వారు కాదనుకుంటా, వాళ్ళావిడ  గారు మరో రాజశెఖర రెడ్డితో వివాహేతర సంబందం ఏర్పరచుకుంది. అయితే తప్పు అన్నాక ఒకరితో చేసినా పది మందితో చేసినా పెద్ద తేడా ఏమి రాదు కాబట్టి, ఆవిడ గారు మరో వ్యక్తికి కూడా ప్రియురాలిగా మారింది అట !.

  రాజశేఖర రెడ్డికి ముప్పయేండ్ల వయసు. ఇంకా పెండ్లి కాలెదు. పెండ్లి చేసుకుంటే అనవసర ఖర్చు అనుకున్నాడో ఏమో ఏకంగా ఇంకొకరితో అది కూడా పెండ్లి  అయిన దానితోనే  డైరెక్టుగా కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నాడు అట. దానికి అతను  ఏ మాత్రం సిగ్గు  పడకపోగా  అంతలా  బరితెగించడానికి కారణం అతని చుట్టూ ఉన్న సమాజంలో పెద్ద మనిషి అనే వాడు లేక పోవడం ఒక కారణమయితే అసలు అతను నివసిస్తున్న  సమాజంలో కట్టుబాట్లు అనేవి లేకుండా పోవడం మరో కారణం కావచ్చు. అందుకే అతనికి అంత  బరి తెగింపు వచ్చి ఉండాలి.

  కానీ శివారెడ్డీ గారి మిసెస్ కి అలాంటి పని చెయ్యడానికి ఆమె లో ఎక్కడో మూలన దాగి ఉన్న సాంప్రాదాయ బావన ఒప్పుకోలేదు అనుకుంటా, అలా వేరు కాపురానికి ఆ ఇద్దరి బిడ్డల తల్లి అంగీకరించలేదు. అంతే! ప్రియుడు కాస్త మ్రుగాడు గా మారాడు. ఆమెను బండ కేసి బాది మరీ చంపాడు. ఇదంతా ఎవరూ చూడకుండానే చేసాడట! అయితే ఈ సంఘటణ ఎవరూ చూడకపోయినా , శివారెడ్డి గారి ఇల్లాలి రెండో ప్రియుడు చూసాడట! అతనే పోలిసులకు ఉప్పు అందించాడు. దానితో పోలిసులు హత్య జరిగిన 24 గంటలు లోపే రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసి కేసు విచారిస్తున్నారు. ఇది మొన్న జరిగిన సంఘటణ.

  ఇప్పుడు చెప్పండి!ఈ ఉదంతంలో ఆ ఇల్లాలు ది తప్పా కాదా? ఆమె చలం గారి రాజేశ్వరి కదలో లాంటి అసంత్రుప్త స్త్రీ అయి ఉంటే ఒక్క రాజశేఖర రెడ్డితోనే  సంబందం పెట్టుకుని ఉండేది . కానీ ఆవిడ మరొక వ్యక్తితో కూడా వివాహేతర సంబందం పెట్టుకుందంటే ,అది ఆమెలోని విశ్రుంఖలత్వాన్ని తెలియ చేస్తుంది. స్త్రీ అయినా పురుషుడు అయిన సామాజిక  కట్టుబాటుకు తల ఒగ్గక పోతే ఇలాంటి పరిణామలే సమాజంలో చోటు చేసుకుంటాయి. నీతి బాహ్యతతో కూడిన స్త్రీ వ్యామోహం రాజశేఖర రెడ్డిని హంతకుడుగా మార్చి జైలు పాలు అయ్యేలా చేస్తే, అదే రకమైన విశ్రుంఖలత్వం ఆమెను పై లోకాలకు పంపేలా చేసింది. స్త్రీ పురుషుల మద్య సంబందాలు ప్రైవేటివి కాబట్టి , వాటిని సమాజం పట్టించుకోవలసిన అవసరం లేదనుకున్నంత కాలం సమాజంలో క్రైం రేట్ పెరిగిపోతూనే ఉంటుంది.    
                                                    (23/1/2014 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!