Posts

Showing posts with the label లేచిపోవడం

ఎవడితోనో లేచిపోయిన పెళ్ళాన్ని ,పట్టుకువచ్చి అప్పచెప్పమని "హెబియస్ కార్పస్ " పిటిషనా!! ? హతవిదీ !

Image
                                                                                               మగాళ్ళ విషయం లో కాలం తిరగబడినట్లే ఉంది . మొన్నటిదాకా, ఇంటికాడ కట్టుకున్నది ఎదురుచూస్తుంటే ఆమెను కాదని ,ప్రియురాలి ఇంటిదగ్గర ఉండిపోయిన రసిక పురుషులను బ్రతిమాలో ,బెదిరించో ఇంటికి తీసుకు వచ్చుకోవడానికి, గుట్టుగా సంసారం చేసుకునే స్త్రీలు నానా యాతనలు పడేవారు . ఇల్లాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ ,వెలయాల్లు తో గడపడం గొప్ప మగతనం గా బావించే నీచ సంస్క్రుతి మన సమాజంలో ఉంది .దానికి కారణం లైంగిక స్వేచ్చ విషయం లోస్త్రీలకు అమలు చేసిన  కట్టు బాట్లు  పురుషులు కు అమలు చేయడం లో ఉదాసీనత వహించడమే . ఏమి చేసినా ఆడది పడి ఉంటుందిలె అన్న పురుష అహంకారం ఒకవైపు , ఎంత మంది స్త్రీలతో సంబందం కలిగి ఉంటే అంత గొప్ప మగాడిగా సమాజం గుర్తించడం మరొక వైపు ,కొంత మంది పురుషులని తప్పుడు దారుల్లో  పయనించేలా చేసాయి . తోటి స్త్రీ సంసారాలను నాశనం చేయడానికి వెనుకాడని కొంత మంది స్త్రీల నైజం కూడా ఇందుకు కారణం . కాని అ పరిస్తితి కాస్త  రివర్స్ అయినట్లు కనిపిస్తుంది .  స్త్రీలకు  పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానత్వం కావాలని   ఉద్బవించిన

మన దేశం లో "డేటింగ్" ని" లేచిపోవడం" అంటారా!

                                                                    పద్దెనిమిది యేండ్లు నీండితే చాలు ఏమి ఎంజాయి చేసినా, చెయ్యక పోయినా "వయస్సు" ని ఎంజాయి చెయ్యవచ్చు. నేను మొన్నటి దాక డేటింగ్ అనేది విదేశి సంస్క్రుతి, మనకు అలాంటి విదానం లేదు కాబట్టి,మన వివాహ వ్యవస్త చాలా వరకు స్వచ్చంగా ఉందని అనుకునే వాడిని.   మనలో చాలా మంది పెద్దలు అనబడే వారు, చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు.వారు ప్రజలకు ఇచ్చే సందేశాలు వేరుగా ఉంటాయి,తాము ఆచరించే విదానాలు వేరుగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం తాము నిజమని నమ్మిన దానిని ప్రజలకు చెప్పే దైర్యం లేకపోవడం.ఉదాహరణకు కొన్ని వందల సినిమాలలో ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో లేపుకుపోవడం "హీరోఇజం" గా ప్రదర్సించి యువతరం చేత వహ్వా అనిపించుకున్న హీరో గారు, తన నిజ జీవితంలో అటువంటి పరిస్తితే తన కుటుంభంలో ఎదురైతే, మాట్లాడకుండా చాటు మాటు చర్యలతో, అట్టి ప్రేమ కార్యకలాపాలని వ్యతిరేకిస్తాడు తప్పా, నోరు తెరచి ఇటువంటి తల్లి తంద్రుల అనుమతి లేని పెండ్లిళ్లు మన సంస్క్రుతికి వ్యతిరేకం అని గట్టిగా చెప్పడు. లేదూ తాను సినిమాలో చూపే "హీరోఇజమే" కరెక్ట్ అనుకుంటే, హ