ఎవడితోనో లేచిపోయిన పెళ్ళాన్ని ,పట్టుకువచ్చి అప్పచెప్పమని "హెబియస్ కార్పస్ " పిటిషనా!! ? హతవిదీ !

                                                                         


                     మగాళ్ళ విషయం లో కాలం తిరగబడినట్లే ఉంది . మొన్నటిదాకా, ఇంటికాడ కట్టుకున్నది ఎదురుచూస్తుంటే ఆమెను కాదని ,ప్రియురాలి ఇంటిదగ్గర ఉండిపోయిన రసిక పురుషులను బ్రతిమాలో ,బెదిరించో ఇంటికి తీసుకు వచ్చుకోవడానికి, గుట్టుగా సంసారం చేసుకునే స్త్రీలు నానా యాతనలు పడేవారు . ఇల్లాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ ,వెలయాల్లు తో గడపడం గొప్ప మగతనం గా బావించే నీచ సంస్క్రుతి మన సమాజంలో ఉంది .దానికి కారణం లైంగిక స్వేచ్చ విషయం లోస్త్రీలకు అమలు చేసిన  కట్టు బాట్లు  పురుషులు కు అమలు చేయడం లో ఉదాసీనత వహించడమే . ఏమి చేసినా ఆడది పడి ఉంటుందిలె అన్న పురుష అహంకారం ఒకవైపు , ఎంత మంది స్త్రీలతో సంబందం కలిగి ఉంటే అంత గొప్ప మగాడిగా సమాజం గుర్తించడం మరొక వైపు ,కొంత మంది పురుషులని తప్పుడు దారుల్లో  పయనించేలా చేసాయి . తోటి స్త్రీ సంసారాలను నాశనం చేయడానికి వెనుకాడని కొంత మంది స్త్రీల నైజం కూడా ఇందుకు కారణం . కాని అ పరిస్తితి కాస్త  రివర్స్ అయినట్లు కనిపిస్తుంది .

 స్త్రీలకు  పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానత్వం కావాలని   ఉద్బవించిన "స్త్రీ "వాదం,అన్ని రంగాల సంగతేమో తప్పుడు పనులు చేయడం లో  లో మాత్రం విజయం సాదించినట్లె కనపడుతుంది . చలం గారి 'మైదానం  మోడల్ రాజేశ్వరీ కొంత మంది స్త్రీలకు మంచి ప్రేరణ ఇచ్చినట్లే కనిపిస్తుంది . "సర్దుకు పోయి సంసారం చేస్తే మజా ఏముంటుంది ? లేచి పోయి కోరికలు  తీర్చుకోవడం లోనె  స్త్రీకి తృప్తి ఉంటుంది  " అన్న చలం  పలుకులు కొంత మంది ఆడవాళ్ళను సంసారాలు వదులుకుని పోయేలా చేస్తున్నాయి . అదిగో అలాంటి స్త్రీ బాదితుడు ఒకాయన హైకోర్టు మెట్లు ఎక్కి తనకు న్యాయం చేయమని వేడుకున్నాడు అంట .

                                                                           

అతడొక "లేచిపోయిన రాజేశ్వరి " భర్త . తన భార్య విడాకులు గట్రా ఏమి లేకుండానే తన పెళ్ళాం వేరొక వ్యక్తీ తో వెళ్లి పోయి అతడితోనే ఉండి పోవడం చూసి ఏమి చేయాలో పాలు పోలేదు . పెళ్ళాన్ని నాలుగు తగిలించి ఇంటికి తీసుకు రావడానికి ఇది వెనుకటి కాలం కాదు . మోడ్రన్  కాలం .  అందుకే ఒక లాయర్ గారిని సంప్రదించాడు . అ లాయర్ గారేమో పోలిస్ లు పౌరులను అక్రమ  నిర్భందం లో ఉంచినపుడు ప్రయోగించే "హెబియస్ కార్పస్ "అస్త్రాన్ని , లేచి పోయిన పెళ్ళాం ని పట్టుకు రావడానికి ఉపయోగిస్తే, అది కాస్తా బెడిసి గొట్టింది . మారిన చట్టాల వలన ప్రైవేట్ వ్యక్తుల నిర్బంధం, అదృశ్యం విషయం లో  హెబియస్ కార్పస్ ద్వారా పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వజాలమని, చట్టం లో ఉన్న ఇతర  మార్గాలు చూసుకోమని,  హై కోర్టు వారు ఆ పిటిషన్ కాస్తా కొట్టి వేసారు .

మగాడు వేరెవరితోనో ఉంటే స్త్రీ తన భర్తని తన దగ్గరికి తెచ్చుకోవడానికి ఆ ప్రియురాలు ఉంటున్న ఇంటి మీదకు వెళ్లి ఏడ్చో ,గోల చేసో,అవసరమయితే మొగుడ్ని అతడితో ఉన్న ఆమెను తన్ని అయినా సరే , బందువులు ,సమాజం సహయంతో తన భర్తని తెచ్చుకోగలుగుతుంది.ఆ స్వేచ్చ మాత్రం పురుషుడికి ప్రస్తుత కాలంలో లేదు . ఎందుకంటె వాడు ఏడవలేడు కాబట్టి .ఏడిస్తే నామోషి కాబట్టి . లేచి పోయిన పెళ్ళాం కోసం ఏడ్చే వాడు సమాజం ద్రుష్టిలో చేత కాని వెదవ కాబట్టి ,అన్ని మూసుకుని కూర్చోవడం తప్పా ,బయటకు పోయి పరువు తీసుకోలేడు  . ఏదో చట్టం అన్నా న్యాయం చేయక పోతుందా అని కోర్టులు కి వెళితే ఇదిగో ఇలా టెక్నికల్ గ్రౌండ్ మీద పెటిషన్ లు కొట్టి వేస్తారు . ఇక ఆ మొగుడు చెసే దేముంది ?ఇంట్లో కూర్చుని ఏడవడం తప్పా !
                     కాలి బందం లేని పశువు వల్ల పంట చేలకు  నష్టం  ,కట్టు బాట్లు లేని మనిషి వలన  పచ్చని సంసారానికి నష్టం .ఇది పురుషులకు అయినా , స్త్రీలకు అయినా  సమంగా వర్తించే సూత్రం .
                                          ( Republished post. OPD:31/1/2015)

Comments


  1. మారెను కాలము ఒర్రేయ్ !
    చేరెను వేరొక మడిసిని చేమంతి గదా !
    జోరుగ వేసెను హిబియసు
    కారపసు!కుదరక బోయె, కాంతయు బోయెన్ !

    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం