మనం తినే తిండి, కట్టే బట్టా శాస్త్రీయం కానప్పుడు, " చేప మందు" శాస్త్రీయత గూర్చి "గోల" ఏల "శాస్త్రులూ"
కొంత మంది శాస్త్రులు(సైన్స్ విజ్ణానులు అని చెప్పుకునే వారు), పబ్లిసిటీ కోసమో, లేక వెనుక ఎవరి ప్రోత్సాహా ప్రోద్బలమో తెలియదు కాని, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందానా వ్యవహరిస్తుంటారు.
బారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తాము నమ్మిన మతం ని ఆచరించుకునే హక్కు ఇచ్చింది. ఇటువంటి మతపరమైన కార్యక్రమాలు మనిషి ఆరోగ్యానికి కాని, సమాజ బద్రతకు కాని బంగం వాటిల్లనంత వరకు నిర్వహించుకోవచ్చు. అలాంటి మత పరమైన నమ్మికతో కూడినదే హైద్రాబాద్ బత్తిన గౌడ్ సోదరులు నిర్వహిస్తున్న "చేప ప్రసాదo" పంపీణీ కార్యక్రమం.
ఈ కార్యక్రమం సుమారు నూటా అరవై సంవత్సారులుగా తమ కుటుంబ సబ్యులు నిర్వహిస్తున్నారని గౌడ్ సోదరులు చెపుతున్నారు. వారి తాత గారికి ఒక సాదువు చెప్పిన చేప మందు విదానం ఆస్త్మా(ఉబ్బస వ్యాది) ని నియంత్రిస్తుందని , కాబట్టి ప్రజలకు మ్రుగశిర కార్తే రోజున "చేప ప్రసాదాన్ని," ఉచితంగా పంపీణీ చేస్తున్నామని బత్తిన సోదరులు చెపుతున్నారు. అలాగే వివిద ప్రాంతాల నుండి అనేక వేల మంది మ్రుగసిర కార్తె రోజున హైద్రాబాద్ వచ్చి చేప మందు తీసుకుంటున్నారు. వారెవ్వరూ, ఈ చేపప్రసాదo మీద ఇన్నియేండ్లుగా ఒక్క కంప్లైంట్ చెయ్యలేదు. చాలామందికి సత్పలితాలు ఇచ్చినందువల్ల ఈ ప్రసాదo తీసుకునే వారి సంఖ్య ఏటేటా అదికమవుతూ వస్తుంది.
అంతవరకు బాగానే ఉంది. "ఆవు బాగానే ఉంది! దూడా బాగానే ఉంది! గుంజకు పట్టింది గురక తెగులు" అని సామెత!. అలాగే ఉంది జన విజ్ణాన వేదిక వారి సంగతి. పాపం వారు ఏదో పెద్ద అవినీతిని అన్యాయాన్ని నిర్మూలిస్తున్నట్లు ఈ బత్తిన సోదరుల చేప ప్రసాదo పంపీణిని నిలుపుదల చెయ్యమని ఆంద్ర ప్రదేశ్ హైకోర్టులో ఒక "పిల్" దాఖలు చేస్తే, దానిని విచారించిన కోర్టువారు చెపమందులొ అరోగ్యానికి హాని కలిగించే పదార్థాలేవి లేనందువల్లా, ప్రజలు నమ్మక్కంతో అనేక యేండ్లుగా వాడుతున్నందువల్ల తాము ఈ విషయంలో జ్యోక్యం చేసుకోమని చెప్పింది. అయినా సరే పట్టు వదలని విక్రమూర్కులు చేప ప్రసాదo లో "శాస్త్రీయత" కలిగిన ది ఏది లేదని కాబట్టి దానిని తక్షణమే నిలుపమని ప్రబుత్వం వారి మీద ఒత్తిడి తెస్తున్నారు.
ఇక్కడ మతవాదులు గా మాదొకటే సూటి ప్రశ్న? రోజూ జనం తింటున్న "పాలిష్డ్ బియ్యం" శాస్త్రీయంగా ఆరోగ్యానికి మంచిదా?
ఉస్ణ మండలం లో నివసిస్తున్న మనం నూలు బట్టలను వదలివేసి,సిందటిక్ వస్త్రాలు దరించడం శాస్త్రీయత లో బాగమా?
మరి రోజూ తినే తిండి, కట్టె బట్టే శాస్త్రియత కు దూరంగా అనారోగ్యాన్ని కలిగించేవి అయితే వాటి గురించి కోర్టుల్లొ "పిల్" దాఖలు చెయ్యని వారు,సంవత్సారానికి ఒక రోజు తీసుకునే చేప ప్రసాదo వల్ల కలిగే నష్టం లేకపోయినా, ఇంత గోల చెయ్యాల్సిన అవసరం ఏమిటో జన విజ్ణానులు చెప్పాలి.ఈ దేశంలో ఎన్నో నిషేదిత మందులను మందుల షాపులలో విక్రయిస్తున్నారు. చేతనైతే వాటి మీద ద్రుష్టి పెట్టి నివారించండి.అంతే కాని ప్రజలకు హాని చెయ్యని తరతరాల నమ్మకాన్ని వమ్ము చెయ్యడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే రోగ నివారణకు శాస్త్రీయత ఒక్కటే కాదు నమ్మకం కూడ రోగ నివారణకు తోడ్పడుతుంది. మీకు దమ్ముంటే ఉచిత వైద్య శాలలు ఏర్పాటు చేసి,నిజాయితీగా వైద్య్ం చెయ్యండి. అప్పుడు మీమీద నమ్మకం ఏర్పడి "చేప ప్రసాదo "లకు దూరమై, మీ మందులకు దగ్గరవుతారు. అంతే కాని చీప్ పబ్లిసిటి కోసం ప్రజలకు మేలు చేసే నమ్మకాలను వమ్ము చెయ్యవద్దని వినతి.
(Republished Post. OPD:4/6/2013).
ReplyDeleteజన విజ్ఞాననమట ! చే
పన మందే ఆస్తమాకు ? పబ్లికు పిటిషన్ !
కనిపించని గాలియు జే
సెనుగా ప్రాణపు నిలకడ సెంటీ మెంటల్ ?
చీర్స్
జిలేబి
Good sir actually these are making money in TV Discussions(TV9)THROUGH ADVERTISEMENT for time pass discussions.
ReplyDeletegood analysis. they target only Hindu beliefs. They cannot stop swasthata mahasabha dramas by christian organizations. in krishna district two months back a Govt School principal neglected her sons's fever, praying Jesus,lost her son. Same month a poor girl died by consuming expired noodles in Yanamalakuduru near vijayawada. No body discusses these in TV channels.
ReplyDeleteవాళ్ళు మంచి పనులు చేయలేరు, ఇంకొకళ్ళని చెయ్యనియ్యరు. ఆధునిక ప్రజాస్వామ్యంలో స్వేచ్చకీ అర్థం లేకుండాపోయింది.
ReplyDelete