బుర్ర లేని అధికారులను బోరు బావి ఆపరేషన్ కు పంపితే , 40 అడుగుల్లో ఉన్న చిన్నారిని 260 అడుగులకు పంపి చంపారట !!

                                                                        

తెలంగాణా రాష్ట్రం లోని రైతులకు తమ పొలాల్లో వేసుకున్న బోరు బావులు వ్యవసాయానికి   కావాల్సిన నీళ్లు ఇచ్చేవి కొన్ని అయితే , రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేవి మరి కొన్ని. అందులో చిన్నారి రైతు బిడ్డలను తమ పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ రైతు కుటుంబాలు వారు పడే బాధ వర్ణనాతీతం. అదేమీ మాయో కానీ , బోరు బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో ఎక్కువ శాతం గిరిజన  బిడ్డలే కావడం విచారించ దగిన విషయం.   
        మన శ్రీ హరి కోట నుంచి మన శాస్త్రజ్ఞులు అంతరిక్షం లోకి ఏక కాలం లో అనేక ఉపగ్రహాలను , ఎన్నో వేల  కిలోమీటర్లు దూరం లో ఉన్న నిర్ణిత కక్ష్యలలో  విజయవంతంగా ప్రవేశపెడుతూ  విదేశీయులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటె " ఔరా మన శాస్త్రజ్ఞులు ఇంతటి ప్రతిభావంతులా " అని సంభ్రమాశ్చార్యాలు పొందుతున్న మనం , కేవలం నలభై అడుగులలో ఉన్న బోరు బావిలోని పాపను  మూడురోజులు రేయిబవళ్ళు పని చేసి చివరకు పాపను ముక్కలు ముక్కలు చేసి బయటకు తీసిన అధికారులను చూసి నివ్వెర పోవాల్సి వస్తుంది. 

     ఇలా బోరు బావుల్లో పిల్లలు పడి  పోవడమనేది మన ప్రాంతాల్లోనే కాదు , విదేశాల్లోనూ జరుగుతుందని పేస్బుక్ లోని కొన్ని పోస్టులు వలన తెలుస్తుంది. అయితే అక్కడి కొంతమంది అధికారులు చాలా తెలివిగా బోరులో పడిన చిన్న పిల్లలను బయటకు తీయటానికి , బోరు గొట్టం లో పట్టేటంత పిల్లలను , వైర్లు సహాయం తో ఒడుపుగా, తల క్రిందులుగా బోరులోకి దించి తక్కువ సమయంలోనే , పిల్లలను బయటకు తీసి , ఆపరేషన్ లో సక్సెస్ అవటం చూస్తుంటే , ఏంతో ఆశ్చ్యర్యం వేస్తుంది. . పిల్ల లు పడిన బోరు బావి చుట్టూ జాగ్రత్తగా కొంత లోతు వరకు  మట్టిని తీసి , దగ్గరలో నే బాధిత పాప లేక బాబు ఉన్నాడని నిర్దారించుకున్నాక , తవ్వడం ఆపు చేసి , బోరు గొట్టం లో పట్ట దగిన పిల్లల ను తాడు ద్వారా లోపలకు పంపి క్షణాల్లో పిల్లలను బయటకు తీయడం ఇందులోని టెక్నీక్ . మరి మన అధికారులకి అలాంటి ఆలోచనలు ఎందుకు రావో అర్ధం కాదు. బహుశా అలా చేస్తే , బోరులో పడిన పిల్లే కాదు, లోపలి పంపిన పిల్లలను వదులుకోవాల్సి వస్తుందని మన అధికారుల గట్టి నమ్మకం కాబోలు. 

          మొన్న రంగారెడ్డి జిల్లాలోని ఇక్కారెడ్డి గూడా లో  జరిగిన బోరు బావి ఆపరేషన్ చుస్తే , పిల్లల ప్రాణాలు రక్షించడం లో మన అధికారులు కి ఏ మాత్రం ఇంగిత జ్ఞానం కానీ , చిత్తశుద్ధి కానీ లేవని తేటతెల్లం అవుతుంది. పాప బోరులో పడినప్పుడు కేసింగ్ పైపు ఉన్న 40 అడుగుల వరకు వెళ్లి ఆగి పోయింది. అందుకు కారణం ,ఆ తర్వాత ఉన్న బోరు రంద్రం చిన్నది కావడం తో అక్కడే ఆగిపోయింది. దీనినే అడ్వాంటేజ్ గా తీసుకుని , విచక్షణా జ్ఞానం ఉపయోగించి పాపను రక్షించే ఛాన్స్ ఉంది. సాంప్రదాయ పద్దతిలోఅయితే , బోరు బావికి సమాంతరంగా మరొక గొయ్యిని తవ్వి , దాని ద్వారా బావిలోకి రంద్రం చేసి పిల్లలను రక్షిస్తారు. ఇలా సక్సెస్ అయిన కేసులు చాలానే ఉన్నాయి. కానీ ఈ  ఆపరేషన్ లో అలా సాంప్రదాయ పద్దతిలో వెళ్ళడానికి అధికారులకు బండలు అడ్డం వచ్చాయట. అందుకే ఆధునిక "రోబోటిక్ హ్యాండ్ " ను లోపలి పంపి పాపను బయటకు తీద్దామనుకున్నారు. అప్పటికి పాప బ్రతికి ఉండి  ఏడుస్తున్నట్లు కెమెరాల ద్వారా స్పష్టం అయింది. కానీ రొబోటికి హ్యాన్డ్ ని పంపి , పది అడుగుగులు పైకి వచ్చిన పాప , నిర్లక్ష్యమో , దురదృష్టమో కానీ తిరిగి బోరులోకి పది పోవడం తో కథ  అడ్డం తిరిగింది . అంతలో అక్కడే ఉన్న మరొక అధికారికి మరో ప్లాన్  తట్టింది. పాప బయటకు రావాలంటే , బోరులో ఉన్న మోటార్ ను బయటకు తిస్తె దానితో పాటు పాప కూడా వచ్చేస్తుంది కదా " అని  అనగానే అందరు పొలోమని  మోటారును బయటకు గుంజారు అట. దానితో 260 అడుగుల్లో ఉన్న మోటారు బయటకు రావడం , 40 అడుగుల్లో ఉన్న పాప 260 అడుగుల్లోకి పోవడం జరిగి పోయాయి. ఇలా అధికారుల జ్ఞానరహిత ఆలోచనలకు బ్రతికే ఛాన్సున్న పాప , పాతాళంలోకి పోయి ప్రాణం విడిచింది. 
                                                                         

       ఇదంతా ఢిల్లీలో ఉండి తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు "ఎలాగైనా సరే పాపను బయటకు తీయాల్సిందే అని ఆదేశాలు జారీ చేసే సరికి , చివరకు చేసేది లేక సాంప్రదాయ పద్దతిలో సమాంతర గొయ్యి తవ్వి , వాటర్ ప్లషింగ్ చేసే సరికి, ముందు పీలికలు అయిన పాప దుస్తులు,  ఆ తర్వాత ముక్కలై పాప దేహం బయటకు రాగా వాటన్నింటిని , పాప తల్లి తండ్రులకు ఇస్తే , "ఎలాగైనా మీ పాపను సజీవంగా మీకు అప్ప చేపుతాము అని బరో సా ఇచ్చిన మంత్రి గారి మాట మీద భరోసా తో ఉన్న  ఆ తల్లి తండ్రులు , ఖిన్నులై , బోరు బోరున విలపిస్తూ పాపను ఖననం చేశారు. వారికి అంతో ఇంతో ఉపశమిమిపచేసేందుకు ప్రభుత్వం వారు 5 లక్షలు ఇచ్చారు. అదీ విషయం . ఈ  బోరు బావి ఆపరేషన్ తంతు చూస్తుంటే నాకు చిన్నప్పుడు చదివిన అరేబియన్ నైట్ కద ఒకటి గుర్తుకు వస్తుంది. దానిని మీరు కూడా చదవండి. అదేమిటంటే :

  ఒక రైతు ఇంట్లోకి ఒక గొర్రె ప్రవేసించింది. ఆ ఇంత్లో ఒక మట్టికుండలో కొంత దాన్యం ఉంటె దానిని తినాలనుకుని ఆ కుండలొ తల  పెట్టడం తో,  గొర్రె  తల కుండలో ఇరుక్కు పోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ రైతుకి తన గొర్రె తలని కుండ  లోనుండి బయటకు తీసి రక్షించడమ్ ఎలాగో తెలియక చుట్టు ప్రక్కల వారిని పిలిచి సలహా అడుగగా, ఎవరూ ఏమి సలహా ఇవ్వలేక పోవడంతో, ఏమి పాలుపోక కంగారు పడి పోసాగాడు ఆ రైతు. అంతలో ఒక గొప్ప వ్యక్తిలా కనిపించే ఒక వ్యక్తి ఒంటె మీద వీదీలో వెళుతూ కనిపించగా, అక్కడ చేరిన  వారు ఆ రైతు తో,  ఆ వ్యక్తికి విషయం చెపితే అతను ఉపాయమ్ చెప్పవచ్చు అన్నారు  దానితో ఆ రైతు వీదిలోకి వేళ్ళి ఆ ఒంటే మీద వెళు తున్న వ్యక్తిని తన ఇంట్లోకి వచ్చి తన సమస్యను పరీశీలించి సలహ చెప్పవలసిందిగా కోరాడు. దానికి ఆ పెద్ద మనిషి " నేను ఒంటె దిగి లోపలకు రాలేను, నేను ఒంటె తో సహా లోపలకు రావాలంటె నీ ఇంటి గోడ అడ్డంగా ఉంది .ఎలా మరి?" అని అనగా , వెంటనే ఆ రైతు మరియు చుట్టు పక్కల వారు గడ్డపలుగులతో రైతు ఇంటి గోడ ను పగుల గొట్టగా, ఠివిగా ఒంటె తో సహ ఇంట్లోకి ఏతేంచిన ఆ వ్యక్తి కుండలో ఇరుకున్న గొర్రె ముఖాన్ని చూసి , " ఒరి పిచ్చోళ్లారా ఇంతోటి  దానికి వేరే ఆలోచించాలా " అని చెప్పి ఒక కత్తిని తీసుకు రమ్మన్నాడు. రైతు కత్తి తీసుకు రాగా దానితో ఒక్క వేటున ఆ గొర్రె తలని నరికి రైతు చేతిలో పెట్టాడు. దానితో ఆ రైతు అమాయకంగా  " మరి కుండలో ఉన్న తల ఎలా స్వామీ అనగా, అదే కత్తి  తో ఒక్క దెబ్బకు కుండను పగుల గొట్టి  గొర్రె తల ను రైతు చేతిలో పెట్టాడు . దానితో   అక్కడ ఉన్న జనం అందరూ హర్షద్వానాలు చేస్తుండగా, సదరు గొప్ప వ్యక్తి తన ఒంటె ఎక్కి చక్కా వేళ్ళి పోయాడు. ఆ రైతుకు చివరకు మిగిలింది ఏమీటంటే పగిలిన కుండ, చచ్చిన గొర్రె, పగిలిన గోడ. అదీ కద. 

  పై ఉదంతం లో మన అదికారులు చేసిన పని కూడా అచ్చంగా కదలో పెద్ద మనిషి చేసినట్టె ఉంది కధా!  ఏది ఏమైనా అధికారుల   నిర్లక్ష్యానికి గురి అయి మరణించి న చిన్నారి  ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్దిస్తూ  ........ ....          
    
      పై బోరుబావి ఉదంతం గురించి పూర్తీ సమాచారం కొరకు చిత్రాలు లోని ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ లు చదవండి . 

Comments

  1. If jobs are given to quality less , untalented people with reservations then results will be failures

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!