ప్రార్దనలతో పాతీకేళ్ల కొడుకుని పొట్టన పెట్టుకున్న ప్రధానోపాద్యాయురాలు!



                                                                    


                       ఈ దేశం లో ప్రార్దనలు చేసి రోగాలు నయం చేయవచ్చు అని పబ్లిక్ గా ప్రచరాలు చేస్తూ, తమ గెంతులతో ప్రజలను పిచ్చివాల్లను చేస్తున్నవారిని ఏ విజ్ణానులు కానీ వారి వేదికలు కానీ ఏమి అనరు. అనరూ అనేకంటే అనే దమ్ము వారికి లేదు అనటమే కరెక్ట్. అదే ఏ బత్తిన సోదరులో ఇచ్చే నిరాపాయకరమైన చేప మందు ప్రసాదాలు ఇంతవరకు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని రుజువవుతున్నా, కోడిగుడ్డులకు ఈకలు పీకే సోదనలు చేసి కోర్టులవరకు వెళ్ళి నానా యాగీ చేస్తూ బోల్డంతా ఫ్రచారం పొందటం లో చూపించిన శ్రద్దలో పదవ వంతు అయినా, ఈ ప్రార్ధనా వైద్య చికిస్తకుల మీద పెడితే కొన్ని వేల ప్రజల ప్రాణాలు రక్షించిన వారు అవుతారు.గెంతులేస్తూ ప్రచారం చేస్తున్న ఈ ప్రార్దనా చికిత్స విదానం మనుషుల ప్రాణాలు ఎలా బలిగొంటున్నాయో విజయవాడలో జరిగిన ఈ సంఘటణే ప్రబల ఉదాహరణ.

 ఆమె ఒక  విద్యాదికురాలు.పైగా పిల్లలకు విద్యబోదించే ప్రబుత్వ పాఠశాలకు ప్రధానోపాద్యయిని.క్రిష్ణా జిల్లా, జి.కొండూరు మండలం గంగినేని జడ్పి హైస్కూల్ లో ఉద్యొగం. భర్తతో విడాకులు తీసుకుంది.ఉండేది విజయవాడలో ముగ్గురు పిల్లలు అంట.  అందులో చిన్నకొడుక్కి పాతీకేళ్ళు.అతడి ఖర్మ కాలీ  మలేరియా జ్వరం వచ్చింది.అంతే పిల్లాడిని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా తనే స్వంత వైద్యం చేస్తూ, మంచం దగ్గర నిలబడి బైబిల్ చేతిలో పట్టుకుని ప్రార్దనలు చేసే దట. ఆ కరుణామయుడే రోగాన్ని తగ్గిస్తాడని ఆమెకు స్వస్తత సభల్లొ బోధకులు చెప్పిన మాటలు బాగా బుర్ర కెక్కించుకుని అదే విదానాంలో కొడుక్కి వైద్యం చేసింది. అలా మూడు నెలలు గడచే సరికి చిన్న కోడుకు చని పోయాడట. అయినా సరే ఆ తల్లికి నమ్మక్కం కలుగలేదు. తన కొడుకు కోమాలో ఉన్నాడని, తిరిగి జీవిస్తాడని, బైబిల్ చేత పట్టుకుని ప్రార్దనలు చేస్తూ,పది రోజులు గడిపిందట. ఆ శవం కుళ్లి  వాసన వస్తుంటే, ఆ దుర్గందానికి తట్టుకోలేని చుట్టుప్రక్కల వారీ కంప్లైంట్తో పోలిసులు వచ్చి ఇదేమిటమ్మా ఇలాంటి పని చేసావు అంటే "నా కోడుకు కోమాలో ఉన్నాడు. తిరిగి లేస్తాడు" అని మూడత్వం మూర్తీభవించిన ఆ మాత్రు మూర్తీ చెపుతుంటే పోలిసులు నోరెళ్ళ బెట్టారట. అదీ నిన్న జరిగిన కద.

   ఒక విద్యావంతురాలు, పది మందికి విద్య బోదిస్తున్న వ్యక్తి అలా తయారు కావడానికి కారకులు ఎవరు? ఈ రోజున ఆమె తన కుమారుడిని మూర్ఖత్వంతో,ప్రార్దనా చికిత్స విదానంతో చంపిందంటే ఎవరిదీ బాద్యత? అసలు అటువంటి వ్యక్తి ప్రబుత్వ పాఠశాలలో విద్యార్దులకు ఎటువంటి విద్య బోదిస్తుంది ? మత ప్రక్రియలు అనేవి మానసిక శాంతి కోసం ఆచరించేవిగా ఉండాలి కానీ,ఇలా ప్రాణలు తీసే మూడ విదానాలుగ ఉండవచ్చా?. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల ఆరోగ్యానికి,రక్షణకు బంగం కలిగించని రీతిలో మత విదానాలు ఉండవచ్చు. కానీ ఎంతో మంది ప్రజలుకు స్వస్తత కూటములు  పేరుతో, ప్రార్దనలే సర్వరోగ నివార్ణులు అని, దానితో కుంటివాడు నడుచును, గుడ్డివాడు చూచును, చెవిటి వాడు వినును అని బోదనలు చేస్తూ మబ్యపెడుతుంటే కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు, నోరుండి మాట్లాడలేని ప్రభుత్వాలు, వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ, ప్రజల ఆరోగ్యాలతో  ఆటలాడుకుంటున్నాయి అనటానికి  ఉదంతమే ఒక ఉదాహరణ .    
                                              (Republished Post. 30/08/2013).    

Comments

  1. ఎందుకు మళ్ళీ పాత పో స్టు లనే పబ్లిష్ చేస్తునారు

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం