"పనోడు పందిరి వేస్తె , పిచ్చుకలు ఎక్కి పడేసినట్లు" అయింది ఆంధ్రా అసెంబ్లీ నిర్మాణం !!!

                                                             
                                               

 
            3  నెలల్లో నవ్యాంధ్ర అసెంబ్లీ నిర్మాణం పూర్తీ చేసి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు అమరావతి లో జరిపి తీరుతాం . !
        ఇది అమరావతి సాక్షిగా తెలుగు దేశం  నేతలు  తీసుకున్న వజ్ర సంకల్పం . అందుకు అనుగుణంగానే స్పీకర్ గారు దగ్గరుండి కాంట్రాక్టర్ లని గదమాయించి పని చేయించినట్లు ఉంది, అనుకున్న కొద్దీ నెలల కాలం లోనే సుందరమైన పర్మనెంట్ అసెంబ్లీని పోలిన తాత్కాలిక అసెంబ్లీ తయారు అవ్వడం, అందులోనే తమ అసెంబ్లీ సెషన్స్ నిర్వహించుకుని , తమ అభీష్టం నెరవేరింది అన్న ఆనందం లో తెలుగు తమ్ముళ్లు తెలియాడటం జరిగి పోయింది.

        ఏదైనా కొత్త ఇల్లు కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు , అది పూర్తీ అవగానే , తాము కోరిన విదంగా నిర్మాణం జరిగిందా  లేదా  అని అన్నింటిని పరిశీలించి సంతృప్తి చెందాకే కాంట్రాక్టర్ కి పే మెంట్ సెటిల్ చేసి , నూతన గృహ ప్రవేశం చేస్తారు. అన్నింటిని పరిశీలించినా , ఇంట్లో వర్షపు నీరు లీకవుతుందా లేదా అనేది పూర్తిగా తెలియాలంటే వర్షాకాలం దాకా ఆగాల్సిందే . కానీ మొన్న వర్షపు దెబ్బకి కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన అసెంబ్లీ భవనం లోపలి భాగం తడిసి ముద్దయిన తీరు చూస్తుంటే , మన కాంట్రాక్టర్ ల పని తనం తెలుసుకోవాలంటే " కృత్రిమ వర్షం " కురిపించి అయినా సరే , లీక్ టెస్టులు అవి చూసుకుని , పర్ఫెక్ట్ అని నిర్దారించుకున్నాకే "గృహ  ప్రవేశాలు " చేసుకోవడం మంచిది అనిపిస్తుంది.

                       "పద్ధతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియావే కాబట్టి ",  ఎంత సింగపూర్ తరహా నిర్మాణాలు చేద్దామని ఉబలాట పడినా ,లీకులు లేకుండా బిల్డింగ్ లు కట్టాలంటే "ఇండియా బుద్ధి " అస్సలు ఓర్చి చావదు. అందుకే ఈ  సమస్యలు  . 50 రూపాయల పాలకు 100 రూపాయలు ఇచ్చినా , అంతో ఇంతో నీళ్లు కలువని పాలు మనకు దొరకవు అంటే కారణం ఈ "బుద్దే "  మరి. అంచేత  పనుల్లో రాజుల కాలం నాటి క్వాలిటీ  ని ఆశించడం కుదరని పని.   "పాలు అన్నాక నీళ్లు కలుస్తాయి , బిల్డింగ్ లు అన్నాక వానలు కురుస్తాయి" అని  మనసుకు సర్ది చెప్పుకుంటేనే , ఇండియాలో ఆనందంగా జీవించగలం  . లేకుంటే అదనంగా B. P , షుగర్ లు పెరగడం లాంటి సమస్యలు అదనం.

    3 నెలలో ముగించిన  అసెంబ్లీ గదుల్లో  వాన కురిస్తే , ఫర్నిచర్ , రికార్డులు మాత్రమే తడిసాయి  కాబట్టి పర్వాలేదు.    మరి ఇదే పరిస్థితి ,ఉరికించి ఉరికించి సంవత్సరంన్నర  లో    పూర్తీ చేయాలంటున్న , పోలవరం డాం కి ఎదురయితే జరుగబోయే దానిని తలచుకుంటే భయం వేస్తుంది. కాబట్టి "పరిగెత్తి పాలు తాగేకన్నా , నిలబడి నీళ్లు తాగడం మేలు" అనే సాంప్రదాయం కి లోబడి కాంట్రాక్టర్ లకి పూర్తీ స్వేచ్ఛ నిచ్చి నిర్మాణాలు చేయిస్తే మంచిదేమో , తెలుగు దేశాధి నేత గారు ఆలోచన చేసి , ఆ విధంగా ముందుకు పొతే మంచిదేమో !.

       ఏది ఏమైనా నిన్న వీడియోలో ఆంధ్రా అసెబ్లీ గదుల్లో వర్షం కురిసిన విధానం చూస్తుంటే , మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తుకు వచింది . అదే "   పనోడు పందిరి వేస్తె , పిచ్చుకలు ఎక్కి పడేసినాయంట ".                             


                             

Comments

  1. Guru garu, Meeru news update kaaledu, it is not leakage, it is conspiracy of unknown persons.

    ReplyDelete
    Replies
    1. నేను పోస్ట్ పబ్లిష్ చేసే టైమ్ కి కుట్ర తాలూకు వార్తలు ఏమి లేవు.నిన్న మధ్యాహ్నం స్పీకర్ గారు ,ఇందులో కుట్ర కోణం ఉంది.దాని నిగ్గు తేల్చడానికి సీ.ఐ.డి ఎంక్వయిరీ కి అదేశించాం అన్న తర్వాతే మీడియా ఫోకస్ అటు మళ్లింది.అది ఇంకా ఎంక్వయిరీ దశ లొనే ఉంది కాబట్టి దాని గురించి అప్పుడే ఏమి చెప్పలేం.ఒకవేళ ఇంక్విరిలో కుట్ర కోణం బయట పడితే తప్పకుండా మరో పోస్ట్ పెడతాను.thanks for your response.

      Delete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.