గోవిందా..గోవిందా! యాబై వేల కోట్లు ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందా!
మన సర్కార్లు ఎంతో ప్రతిష్టాత్మకం అని చేసే కొన్ని కొన్ని పనులు చూస్తుంటే, అవి చిత్తశుద్దితో చేసేవా లేక అస్మదీయులకు లబ్ది చేకూర్చాలని ఎవరో ఇచ్చిన సలహాలను ముందు వెనుక ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలా అని అనిపిస్తుంది. అలాంటిదే నిన్న సుప్రీం కోర్టు వారు చెల్లదని కొట్టివేసిన ఆధార్ కార్డులను తప్పనిసరిచేసే ప్రక్రియ. గ్యాస్, విద్యుత్, తాగునీటి కనెక్షన్ లకే కాక, ఇక బవిష్యత్ లో ఏ ప్రభుత్వ సేవలను పొందాలన్నా "అధార్ కార్డు" అనేది కంపల్సరీ అని కేంద్ర ప్రభుత్వం వారు ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాలను నానా హైరాన పెట్టారు. గాస్ సబ్సీడి పొందాలంటే ఆదార్ కార్డు ఆదారంతో తెర...