విజయవాడ(నిడమానూరు ) చైతన్య కాలేజి హాస్టల్లో, కాళ్ళు భూమి మీద ఉంచి "ఉరి " వేసుకునే సౌకర్యం ఉందా ?!!!!!
ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లల ఉజ్వల బవిష్యత్ కోసం, తాము ఉండె ప్రాంతాలకు వందల కిలో మీటర్ల దూరంలో ఉండె నగరాలలో ని హాస్టళ్ళలోతమ పిల్లలను ఉంచి చదివిస్తున్నారు . తమకు స్తోమత ఉన్నా, లేకున్నా లక్షలు వెచ్చించి పిల్లలను చదివిస్తున్నారు అంటె , అది వారికి తమ పిల్లల పట్ల గల ప్రేమతో కూడిన బాద్యతను తెలియ చెస్తుంది . అలా 18 ,20 ఏండ్లు నుంచి తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ , ఎన్నో ఆశలతో తమ పిల్ల బవిష్యత్ కోసం కలలు కంటున్న తల్లి తండ్రులను , చిన్న చీటీ ముక్కతో వారి కలలకు చెల్లు చీటి రాసేయడం పిల్లలకు తగునా? బ్రతికినంత కాలం, లేని ,ఇక రాని తమ పిల్లల్ని తలచుకుంటూ జీవించమని తల్లితండ్రులకు శిక్ష విదించడమేనా పిల్లలు తీర్చుకునే తల్లితండ్రుల రుణం ?క్షణికావేశంలో ఆత్మ హత్యలు చేసుకునే పిల్లలు ఆలోచించాల్సిన అవసరం ఉంది .తల...