అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.
ఖమ్మం నగరానికి చెందిన 15 ఏండ్ల అమ్మాయి జూన్ 25 నుంచి కనపడటం లేదని ఆమె తల్లి తండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయటమే కాక , కనపడిన వారికల్లా చెప్పుకుంటూ కళ్లనీళ్లు పర్యంతమయ్యారు. చివరకు పోలీసులు ఆ అమ్మాయిని , ఆ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు అని చెపుతున్న ఆమె ప్రియుడిని పట్టుకుని , ఆమెను తల్లి తండ్రులకు అప్ప చెప్పి , అతడిని కటకటాల్లోకి పంపించారు. ఆమె వయస్సు 15 కాబట్టి ఆమె ప్రియుడు చేసుకున్న పెండ్లి చట్ట ప్రకారం నేరం కాబట్టి అతడి మీద కేసు పెట్టాల్సి వచ్చింది . విషయం ఇంతవరకే అయితే ఇదేదో రొటీన్ కదిలే అని సరి పెట్టుకోవచ్చు. కానీ అంకంటే ఘోరమైన పని ఆ పిల్ల జీవితం లో జరిగింది. ఆ అమ్మాయి ప్రేమించింది ఆటో డ్రైవర్ ని. వారిద్దరూ లేచిపోయి పెండ్లి చేసుకుందామనుకున్నారు అట. ఆ రోజు ఆమెను తీసుకు వెళ్ళడానికి ప్రియుడు ఎందుకు రాలేదో తెలియదు కానీ , ఆ అమ్మాయే సోందు అనే వాడి ఆటో మాట్లాడుకుని ప్రియుడి దగ్గరికి వెళుతుంటే , ఆ సోందు , మరో ...