అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.
ఆ అమ్మాయి ప్రేమించింది ఆటో డ్రైవర్ ని. వారిద్దరూ లేచిపోయి పెండ్లి చేసుకుందామనుకున్నారు అట. ఆ రోజు ఆమెను తీసుకు వెళ్ళడానికి ప్రియుడు ఎందుకు రాలేదో తెలియదు కానీ , ఆ అమ్మాయే సోందు అనే వాడి ఆటో మాట్లాడుకుని ప్రియుడి దగ్గరికి వెళుతుంటే , ఆ సోందు , మరో ఇద్దరు కలసి ఆమె పై ఆ రాత్రంతా అత్యాచారం చేశారు అట. ఆ తర్వాత ఆమెను వదిలేస్తే ఆ బాలికా కిమ్మనకుండా పోయి తన ప్రియుడికి జరిగిన విషయం చెప్పకుండా కామ్ గా తిరుమలగిరి గుళ్లో పెండ్లి చేసుకుని కాపురం చేయడం మొదలు పెట్టిందట. చివరకు తల్లి తండ్రుల ఆవేదన చూడలేక రంగం లోకి దిగిన పోలీసుల కృషితో పట్టుబడితే బయటపడిన బాగోతమిది.
పోలీస్ వారు చెపుతున్న పై కహానీలో మిసింగ్ లింక్ లు అనేకం ఉన్నా వాటి గురించి విశ్లేషించాల్సిన పని లేదు . సమాజం కి కావాలసింది ఒకటే. ఆడపిల్లలు ముందు వెనుకా ఆలోచించకుండా , అమ్మా బాబులను కాదని ప్రతి అడ్డమైన వాడిని ప్రేమించి , వాడి మీద నమ్మకం తో కాలు బయటపెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఉదంతం చక్కగా తెలియచేస్తుంది. ఒకడిని నమ్మి బయటకు పోయినందుకు నలుగురు చేతిలో నలిగిపోవడం తప్పా ఆ బాలిక కు ఏమి దక్కింది?. చివరకు తల్లితండ్రుల పంచకు చేరక తప్పలేదు. కాబట్టి ఆడపిల్లలు , సహజ రక్షకులైన అమ్మాబాబులు లేక కుటుంబ సభ్యులను కాదని ప్రతి అడ్డమైన వాడిని నమ్మకండి. నమ్మి మీ బ్రతుకులను బలి చేసుకోకండి .,
Comments
Post a Comment