విడాకులు విడాకులే , మాజీ మొగుడి మీద పగ పగయే అన్న పెళ్ళానికి సుప్రీం కోర్టు ఎలా కళ్ళెం వేసింది ?

                                                               

నిజంగా చెప్పేవారు లేక సంసారాలు చెడిపోతున్నాయా ? లేక చెప్పినా వినిపించుకోని భార్యా భర్తల వలన చిద్రమవుతన్నాయో అర్దం కావటం లేదు . పెండ్లి నాడు చేసుకున్న ప్రమాణాలకు అస్సలు విలువ ఇవ్వలేదు సరే , కోర్టుల్లో చేసుకున్న ఒడంబడికకు కట్టుబడకుండా , విడాకులు తీసుకుని , వేరే పెండ్లి చేసుకుని కూడా , మొదటి మొగుడి మీద క్రిమినల్ కేసు కొనసాగాలంటే కుదురుతుందా ?.  కుదరదు , అని స్పష్టం గా చెప్పింది భారత ఉన్నత న్యాయస్తానం.


        వారిద్దరూ భార్యా భర్తలు . వారికి జనవరి 25 1996 లో వివాహం అయ్యింది . వారిద్దరి మద్య పొరపొచ్చాలు ఏర్పడి పెండ్లి అయిన ఏడాదిన్నర కే వివాహం విడాకులు వరకు వెళ్ళింది . 1997 జులై లో భర్త విడాకులుకి అలహాబాద్  కోర్టులో కేసు వేసాడు . నామీదే కోర్టులో కేసు వేస్తావా అన్నట్లు భార్యా నవంబర్ లో అతని మీద 498-A కేసు , వరకట్న కేసు పెట్టింది . అందరి పెళ్ళాలు లాగే ఆమే అతని కుటుంబ సబ్యుల మీద క్రిమినల్ కేసు పెడితే , దానిని విచారించిన క్రింది కోర్టు భర్త అతని తరపు బందువులను నిర్దోషులుగా గుర్తిస్తూ తీర్పు చెప్పింది .

  తర్వాత భర్త అలహాబాద్లో విడాకులు కేసు వేసాడని చెప్పి , తను,  తన తల్లితండ్రులు ఉండే జబల్పూర్ లో మరో విడాకులు కేసు వేసి , భర్త విడాకులు కేసుని జబల్ పూర్ ట్రాన్సఫర్ చేయమని  పై కోర్టును కోరగా , దాని మీద భర్త సుప్రీం కోర్టు వారికి అప్పీల్ చేసాడు . ఎలాగూ భార్యా భర్తలు ఇరువురూ , విడాకులు కోరుకుంటున్నారు కాబట్టి , వాయిదాలు ఇవ్వకుండా వెంటనే వారి విడాకులు కేసును తేల్చాలని సుప్రీం కోర్టువారు జబల్పూర్ ఫామిలీ కోర్టు వారిని ఆదేశించగా , జబల్పూర్ కోర్టు వారు 4 ఏప్రిల్ 2005 లో భార్యా భార్తలుకి విడాకులు మంజూరు చేసారు .

 ఆ తర్వాత ఇద్దరూ పునర్వివాహాలు చేసుకున్నారు . అయినా సరే భార్యకి మాజీ మొగుడి మీద పగ చల్లారలేదు . కొట్టేసిన క్రిమినల్ కేసుమీద  తిరిగి   అలహాబాద్ హై  కోర్టులో రివిజన్ పెటిషన్ వేసింది   మాజీ భార్య. హై కోర్టు వారు ఆమె వాదనను సమర్దిస్తూ తిరిగి 498-A కేసును కరెక్టుగా విచారించాలని క్రింది కోర్టును ఆదేశిస్తే , దాని మీద సుప్రీం కోర్టుకి విన్నవించాడు ఆ మాజీ భర్త .  సుమారు 8 ఏండ్ల తర్వాత మొన్న 13 వ తారీకున సుప్రీం కోర్టు వారు అలహాబాద్ హై కోర్టు వారి నిర్ణయాన్ని తప్పు పడుతూ , ఒక సారి మొగుడు పెళ్ళాల పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు అయ్యాక , ఇంకా భర్త మీద కేసు కొనసాగించాలని కోరే హక్కు , భార్యకు ఉండదని , అలాంటి హక్కు కావాలని  వారి కాంప్రమైజ్ పిటిషన్ లో కోరలేదు కాబట్టి , ఆమెకు ఆ స్వేచ్చా లేదని చెపుతూ భర్తను నిర్దోషిగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చిన క్రింది కోర్టు తీర్పే పైనల్ అని తేల్చి చెప్పింది .


      "  In impugned order thedevelopment of settlement between the parties during pendency of the revision petition has not even beenadverted to by the High Court - Once the matter was settled between the parties and the said settlementwas given effect to in the form of divorce by mutual consent, no further dispute survived between theparties, though it was not so expressly recorded in the order of this Court - No liberty was reserved by thewife to continue further proceedings against the husband - The wife after settling the matter estopped from continuing the proceedings."


     ప్రస్తుత సమాజంలో సరి అయిన కౌన్సిలింగ్ వ్యవస్తలు లేక సంసార బందాలు ఎలా నాశనం అవుతున్నాయో , పగలూ , ప్రతీకారాలతో వ్యక్తులు ఎలా తమ వైవాహిక బందాలను త్రుంచి వేసుకూంటున్నారో  తెలియ చెయ్యడానికి ఈ కేసు ఒక చక్కటి ఉదాహరణ .అలాగే భార్యా భర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేటప్పుడు , తమకు ఎదుటి వారినుండి రావాల్సింది, ఇతర లావాదేవీలు  ఏమైనా ఉన్నా, వాటిని స్పష్టంగా కాంప్రమైజ్ పిటిషన్ లో రికార్డు చేయడమో , లేక అన్ని ముట్టాకే కాంప్రమైజ్ కు O.K అనడమో చ్జేస్తే బాగుంటుంది తప్పా , అన్నీ అయి విడాకులు తీసుకున్నాకా ఇంకా కేసులు కొనసాగించాలి అనుకోవడం అర్దం లేని పని అన్న దానికి కూడా ఈ కేసు మంచి ఉదాహరణ.
 
Source :-       http://www.livelaw.in/divorce-mutual-consent-no-reservation-liberty-wife-continue-proceedings-wife-estopped-continuing-cruelty-proceedings-sc/

                                        (17/12/2014 Post Republished).



Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!