మగవాడికి స్వేచ్ఛనిస్తే నలుగురిని ఉంచుకుంటాడు , ఆడదానికి స్వేచ్ఛ నిస్తే 4వ వాడిని ఉంచుకుంటుంది . అంతే తేడా!?

                                                               
       
             

                       పౌరుల స్వేచ్ఛ సమాజ అభివృద్ధికి లోబడి ఉండాలి. ఆలుమగలు అయిన  స్త్రీ పురుషుల స్వేచ్ఛ కుటుంబ సంక్షేమానికి లోబడి ఉండాలి . అలాంటప్పుడే సమాజం అయినా అందులోని భాగమైన కుటుంబాలు అయినా పది కాలాలు పాటు వర్ధిల్లుతాయి. కట్టుబాట్లు లేని స్వేచ్ఛ ఎప్పటికైనా ముప్పే. కోరికలకు లిమిట్ అనేది ఉండదు . అవి అనంతం. కాబట్టి వాటికి స్వీయ నియంత్రణ రూపంలోనో , సామాజిక నియంత్రణ రూపంలోనో కళ్లెం వేయకపోతే అది చివరకు మనిషిని సర్వ నాశనం చేస్తోంది. ఈ సూత్రం కుటుంబాలలోని ఆలుమగలు కు వర్తిస్తుంది . ఆలుమగల స్వేచ్ఛ కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉండకపోతే యావత్ కుటుంబం విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలనే కుటుంబ కట్టుబాట్లు ఏర్పరచారు మన పెద్దలు.

                                                                         

      కుటుంబం లో మగవాడికి అపరిమిత  స్వేచ్ఛ ఇస్తే వాడు ఎంత నీచ నికృష్ట పనులు చేస్తాడో అరబ్ కంట్రీస్ లో ఉన్న కొంత మంది షేక్ ల జీవన శైలిని పరిశీలిస్తే తెలుస్తోంది. ముస్లిం సాంప్రదాయం ప్రకారం 4 భార్యలను కలిగి ఉండవచ్చు. ఎప్పుడో స్త్రీ సంతతి ఎక్కువగాను , పురుష సంతతి తక్కువగాను ఉన్నరోజుల్లో ఏర్పరచిన నియమం కావచ్చు అది. అంతే  కాకుండా  బానిస లను కలిగిఉండడం కూడా ఇస్లాం లో బాగమేనట . అందుకే  4 భార్యలను చేసుకునే వీలున్న అరబ్ లు అక్కడితో సంతృప్తి పడటం లేదు . ఆ నలుగురి భార్యలలో  ఎవరి  తోనూ, ఏక దంపతి వివాహ వ్యవస్థలో మాదిరి   ప్రేమాను రాగాలు బంధం ఏర్పడకపోవటం  వలన లయింగిక తృప్తి విషయం లో వారు మృగాలుగా మారి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు వెల్లిందంటే వారి వికృత కామచేష్టలకు చివరకు పేద వారైనా మగపిల్లలు కూడా బలి అవుతున్నారట . దీనికి వారి మతం వారిని ప్రోత్సహిస్తుంది . అది ఎలా అంటే
                                                               

       
                ధనవంతులు అయినా షేక్ లు పేద తల్లితండ్రులకు డబ్బులు ఇచ్చి వారి మగ పిల్లలను కొనుక్కుని వారిని సెక్స్ బానిసలుగా ఉపయోగించుకుంటారట. వారిని  ఆడపిల్లల మాదిరి అలంకరించి  పార్టీలలోడాన్స్లు వేయిస్తారు అట . ఆ తర్వాత వారిని తమ వికృత అసహజ కామకేళికి బలి చేస్తారు అట. ఇలా ఒక షేక్ తన 20 ఏండ్ల వికృత కామకేళి చరిత్రలో 3000 మంది మగపిల్లలను నాశనం చేసాడు అంటే అక్కడి సమాజ పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందొ ఆలోచించండి. ఇలా జరగటానికి ఎవరు కారణం అంటే అక్కడి పురుషులకు సమాజం ఇచ్చిన 4గురు భార్యల స్వేచ్ఛ , చివరకు వారిని శాడిస్టులుగా మార్చి  చివరకు పిల్లలను నాశనం చేసింది.  భార్యా బిడ్డలు మీద ప్రేమానురాగాలు ఉన్నవాడు ఎవరు ఇలా ఇతరులు  పిల్లలు అయినా , వారి పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తించే అవకాశం లేదు. ఆ సమాజాలలో పిల్లలు ఎలాంటి బాధలు పడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ  లింక్ (https://www.theguardian.com/commentisfree/2010/apr/25/middle-east-child-abuse-pederasty  ) 
  ని క్లిక్ చేసి చదవండి . 


      ఇక స్త్రీల విషయానికి వస్తే వారుకూడా అవకాశం వస్తే పురుషులకంటే ఏమి తక్కువ తినరు . కాకపొతే మగవాడికి  స్వేచ్ఛనిస్తే  నలుగురిని ఉంచుకుంటాడు , ఆడదానికి స్వేచ్ఛ నిస్తే 4వ  వాడిని ఉంచుకుంటుంది . అంతే  తేడా!? స్త్రీలకు ఇవ్వబడిన కట్టుబాట్లు లేని సంసార హక్కులు వలన రష్యాలో కుటుంబ పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధం చేసుకుంటే తెలుస్తోంది. ఇంతకు ముందు ఇదే బ్లాగు లోదర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!! అనే టపాకు బ్లాగ్మిత్రులు U.G శ్రీరామ్ గారి కామెంట్  ఇక్కడ ప్రస్తావనార్హం .    


      " రష్యా గురించి ఇంకా చెపుతాను వినండి. మొదట సామ్రాజ్య విస్తరణ కోసం పురుషులను సైన్యంలో చేర్చుకొని విదేశాలపై యుద్దానికి పంపించింది. దేశంలోని పనులు చేయటానికి మగవారు లేక స్రీవాదం సృష్టించి మగవారి పనులన్ని స్రీల తో చేయించుకొనేవారు. ఈక్రమం లో వారినుంచి వ్యతిరేకత రాకుండా చేయటానికిస్రీలకు హక్కులు అంట్టు వరాలు ఇస్తూపోయింది. ఇదంతా స్రీలపై ప్రేమ తో కాదు. పాలకుల రాజ్య విస్తరణకాంక్షవలన. క్రమంగా కాలం గడిచేకొద్ది ఎలామారిందంటే 
భండారు శ్రీనివాసరావు గారు రాసిన ఈ టపా చదవండి.

“ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యెక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపు కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిపే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు ‘పండగనాడుకూడా పాత మొగుడేనా ‘ అనే వారి సంఖ్య పెరిగింది.

సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతోనూ, పాత పెళ్ళాం కొత్త మొగుడితోనూ కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో కొన్నాళ్ళపాటు నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని చెప్పుకునేవారు”."   
                                                                           


                   
                                         కాబట్టి మానవాభివృద్దికి ప్రధాన కారణమైన కుటుంబ వ్యవస్థ పది కాలాలు పాటు పచ్చగా ఉండాలి అంటే అందులో సభ్యులు అయినా స్త్రీ పురుషులకు బాధ్యతలతో కూడిన స్వేచ్ఛ ఉండాలి తప్పా బరి తెగించి ప్రవర్తించే స్వేచ్ఛ ఉండరాదని పైన తెల్పిన దేశాల సామాజిక  పరిస్థితులు చక్కగా తెలియ చేస్తున్నాయి. ఆధునిక ప్రపంచం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పరిశీలించినా ఏ క  దంపతి  వివాహ వ్యవస్థే కరెక్టు. అనేక మందితో లయింగిక సంబంధాలు కలిగి ఉండే "మై ఛాయిస్ " సంస్కృతీ వలన సమాజం ఎయిడ్స్ మయం అయి సర్వ నాశనం అవుతుంది. ఎవరికైనా నిరంతరం సుఖాలను పొందాలనే ఉంటుంది. కొత్త కొత్త రుచులు కోసం మనసు కోటి గంతులు వేస్తూనే ఉంటుంది. అయినా ఏక దంపతి  విధానం ని మన పెద్దలు ఎందుకు నిర్దేశించారు అంటే , మానవ సమాజం రోగమయం కాకుండా మనుగడ సాగించాలని, ఇంకా కలిగే అనేక సామాజిక దురవస్థలు ముఖ్యంగా చిన్నపిల్లల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మాత్రమే తప్పా వేరు కాదు. . అంతే . 

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.