4 సంవత్సరాల కాలం లో 6,34,000 వీక్షణములు సాధించిన మనవు బ్లాగు !!
సెప్టెంబర్ 6, 2012 న "మనవు " బ్లాగు ప్రారంభించబడినది . అంటే మొన్నటికి నాలుగు వత్సరాలు పూర్తీ చేసుకుంది . ఈ 4 సంవత్సారాల కాలంలో సుమారు 960 పై ఛిలుకు టపాలు ప్రచురించడం జరిగింది.మొదటి టపా పేరు 'స్త్రీ స్వేచ్చ'.960 టపాలలో లలో కొన్ని బంపర్ హిట్ ఐతే , కొన్ని ఫట్ అయినవి. విచిత్రం ఏమిటంటె నేను హిట్ అవుతాయి అనుకున్నవి వీక్షకుల ను ఆకట్టుకోకపోవటం అలాగే వీటినేమి చదువుతారులే అనుకున్నవి, బాగా ఆదరణ పొందటం. ఎలాగైతేనేమి 4 సంవత్సరాల కాలంలో మనవు బ్లాగు 6 లక్షల 34,000 వీక్షణములు సాదించడం నాకు సంతోషం కలిగించే విషయమే . ఈ చిరు సంతోషం ని మీతో పంచుకుందామనే ఈ ప్రత్యేక ప్రస్తావన .
నా బ్లాగు లక్షల వీక్షణములు సాధించడానికి , నిరంతరం కొత్తవారికి పరిచయం అవుతూ అభివృద్ధి చెందడానికి వీక్షకుల ఆదరాభిమానాలు తో పాటు అగ్రిగ్రేటర్ లు సహాయ సహకారాలు తోడ్పడ్డాయి. మనవు బ్లాగు అభివృద్ధిలో "కూడలి"అగ్రిగ్రేటర్ డి ప్రధాన పాత్ర. బ్లాగు ప్రారంభం లో కూడలి ద్వారానే ఎక్కువమంది వీక్షకులు చూడగలిగేవారు . అసలు ఆ సమయం లో ఆ అగ్రిగ్రేటర్ లేకపోతె ఎక్కువ మంది వీక్షకులు కి బ్లాగు ని చూసి ఉండేవారు కాదేమో . అయితే వారు అనివార్యకారణాల చేత కూడలి మూసివేయడం నా లాంటి బ్లాగర్లకు చాలా విచారం కలిగించింది. కూడలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు .
ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది "మాలిక" అగ్రిగ్రేటర్ . కూడలి లేకుండా పోయింది ఎలా ? అనుకుంటున్న సమయం లో కూడలి స్థానాన్ని భర్తీ చేయడానికి మాలిక వారు ముందుకు రావడం ముదావహం కలిగించిన విషయం. రోజు బ్లాగును వీక్షించేవారిలో 40% పైగా కొత్తవారు ఉన్నట్లు తెలుస్తోంది . వారికి పాత పోస్టులు చూసే అవకాశం లేదు. సుమారు 900 బ్లాగు పోస్టులు కలిగిన మనవు బ్లాగులోని పాత పోస్టులు ను కొత్తవారికి కూడా చూపించాలనే ఉద్దేశ్యం తోనే పాతవాటిలో మెరుగైనవి, వీక్షణముల సంఖ్య ఆధారంగా ఎన్నుకుని రీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దానికి ఎవరో కంప్లయింట్ చేసారని మనవు బ్లాగుకు ఒక ప్రత్యేక స్తానం కేటాయించి చూపడం మొదలు పెట్టారు మాలిక వారు. అందుకు మాలిక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మాలిక అగ్రిగేటర్ వారు వచ్చే సమయానికి పరిస్థితుల్లో కొన్నిమార్పులు వచ్చాయి . ఫేస్ బుక్ ద్వారా కూడా బ్లాగులను ప్రమోట్ చేసుకునే ప్రత్యామ్నాయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినది . మనవు బ్లాగు పోస్టులలో ఒకటి 17000 పై చిలుకు వీక్షణములు సాధించింది అంటే అది ఫేస్ బుక్ వలననే సాధ్యమైంది.బ్లాగులు కొత్తవైనా ప్రమోట్ చేసుకోవాలనుకునే వారికి డబ్బులు చెల్లించి ప్రమోట్ చేసుకునే అవకాశం ఫేస్ బుక్ కల్పిస్తుంది . అప్కోర్స్ 4 సంవత్సరాలుగా నడుస్తున్న మనవు బ్లాగుకు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఫేస్ బుక్ లోను మనవు బ్లాగుకు మంచి ఆదరణే లభిస్తుందని గణాంకాలు చెపుతున్నాయి. ఇప్పుడు మనవు బ్లాగుకు ఎక్కువమంది వీక్షకులు పేస్ బుక్ ద్వారానే వస్తుండడం అందుకు నిదర్శనం. అందుకు ఫేస్ బుక్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ట్రాఫిక్ ఉన్నచోట బడ్డీ కొట్టు పెట్టుకున్నా జనం ఎక్కువగానే వస్తారు. అది లేని చోట "షాపింగ్ మాల్ " పెట్టినా ఫలితం తక్కువుగా ఉంటుంది. మన బ్లాగులును పదిమందికి చూపిస్తున్న అగ్రిగ్రేటర్ ల విషయం లోను ఇది వర్తిస్తుంది. మన బ్లాగు ఎంత మంచి రాతలు కలిగి ఉన్నా , పదిమందికి చేరనప్పుడు అది వృదాయే. అగ్రిగ్రేటర్ లకి ఎంత ఆదరణ ఉంటే అంత బ్లాగులకు ఉంటుంది. కొత్తగా అగ్రిగ్రేటర్ లు వస్తున్న వారినుంచి కూడా అంతో ఇంతో ట్రాఫిక్ వస్తూనే వస్తుంది. వారుకూడా మనవు బ్లాగు అభివృద్ధి తోడ్పడుతున్నందుకు మానసపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మనవు వీక్షణముల చరిత్ర
"మనవు" ప్రారంభించిన తేదీ :- 6-9-2012
1,00,000 వీక్షణములు పొందినది :- 9-9-2013
2,00,000 వీక్షణములు పొందినది :- 18-2-2014
4,00,000 వీక్షణములు పొందినది :- 9-8-2015
5,00,000 వీక్షణములు పొందినది :- 18-2-2016
6,34,000 వీక్షణములు పొందింది : 7-9-2016
మొదటి లక్ష వీక్షణము లు సాదించడానికి ఒక సంవత్సర కాలం పట్టినా , రెండవ లక్ష కు చేరువ కావడం 5 నెలల కాలం లో సాద్యమైంది . . మద్యలో కొన్నాళ్ళు బ్లాగు లో టపాలు రాయడం కుదరనందున 18 నెలల కాలానికి గాను మరో 2 లక్షలు వీక్షణములు పొంది 4 లక్షలకు చేరడం జరిగింది. తిరిగి 6 నెలల కాలం లో లక్ష వీక్షణములు పొంది 18-2-2016 నాటికి మొత్తం 5 లక్షల వీక్షనములు పొందింది. అలాగే తిరిగి 6 నెలలు అంటే నిన్నటికి 6,34,000 పొందిoది "మనవు " బ్లాగు. అంటె ప్రస్తుత ఏవరేజ్ రన్నింగ్ రేట్ సంవత్సరానికి 2 లక్షలు అన్న మాట. నేను నా బ్లాగు పోస్టులు ప్రచురించడం ద్వారా తెలుసుకున్న సత్యం ఏమిటంటె , వీక్షకులను ఆకర్షించేది బ్లాగుకు ఉన్న పేరు కాదని , బ్లాగులో ప్రచురించిన టపాలలో ఉన్న సరుకు మాత్రమే అనేది .అలాగే అగ్రిగేటర్ ల తోడ్పాటు . అందుకే ఎంత గొప్ప బ్లాగు అయినా తరచుగా మన మనసులోని బావాన్ని వీక్షకులు మెచ్చే రీతిలో రాస్తూ ఉంటె తప్పా , మనుగడ ఉండదు. బ్లాగు నిర్వహణ అనేది ఒక యజ్ఞం . బ్లాగులను నిర్వహించే వారంతా ఆధునిక రుషులు అని నా అభిప్రాయం. ఎందుకు అనేది వేరే టపాలో వివరంగా చెపుతాను. ఈ రోజుకి విక్షణముల చరిత్ర ని తెలుపుతూ అందుకు తోడ్పడిన వారందరికి ధన్యవాదాలు తెలపడానికే పరిమితం.
నా బ్లాగు అభివృద్దికి తోడ్పడుతున్న వీక్షకులకు, మిత్రులకు ,శ్రేయోభిలాషులకు , విమర్శకులకు , అగ్రిగ్రేటర్ లు యావన్మందికి పేరు పేరు నా దన్యవాదములు తెల్పుకుంటున్నాను.
ఇట్లు
మద్దిగుంట నరసింహా రావు.
" మనవు" బ్లాగ్ అడ్మిన్
నరసింహారావుగారు,
ReplyDeleteమరిన్నిలకారాలు చేర్తాయండీ!
నేను మీ బ్లాగ్ చూస్తూనే ఉంటా! ఒకప్పుడు పోట్లాడేను కూడా! తరవాత ఎప్పుడూ కామెంట్ చేయలేదు :)
ధన్యవాదాలు శర్మ గారు.మీ లాంటి పెద్దల ఆశీర్వాదాలు ఉన్నoతకాలం మా బ్లాగు లక్షల విక్షణములు సాధించడం కష్టమేమీ కాదు.
Delete
ReplyDeleteశుభాకాంక్షలండీ మనవు గారు!
లక్షల లెక్ఖన వచ్చిరి
వీక్షకు లిక్కడ జిలేబి విధిగా కామిం
తాక్షతలు వేసె శుభమౌ
కక్షల కార్పణ్య లోక కథలను చదువన్ !
జిలేబి
Thank you jilebi garu.
DeleteCongratulations Narasimha garu. Keep going on. All the best for more viewers.
ReplyDeleteThank you Raghuram garu
DeleteCongratulations Narasimha Rao gaaru
ReplyDeleteThank you Sri Ram garu.
Delete