భద్రాచలం రాములు వారి ఆభరణాలు స్మగ్లర్ ల కి అమ్ముకున్నారా?!!!





                                     అవును ! సరిగ్గా ఇదే అనుమానం కలుగుతుంది ఈ  రోజు ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమైన వార్తను చూస్తుంటే . పురాతన విగ్రహాలు , ఆభరణాలకు విదేశీ మార్కెట్లో బోల్డంత గిరాకీ ఉంది. మనకు మాములుగా అనిపించే వందల  ఏండ్ల నాటి వస్తువులు, కోట్ల విలువ చేస్తాయి. అందుకే ఆరి తేరిన స్మగ్లర్లు వివిధ ప్రాంతాలలోని దేవాలయాలలో ఉన్న పురాతన విగ్రహాలు ఆభరణాలు చోరీ చేయించి అయినా తమ హస్తగతం చేసుకుని విదేశీ స్మగ్లర్లకు అమ్మి కోట్లు గడిస్తున్నారు అని రికార్డులు చెపుతున్నాయి. అలాంటి స్మగ్లర్ల ప్రేరణ తోనే  ఎన్నో ఏండ్లుగా పూజలు అందుకుంటున్న భద్రాచల సీతారాములు వారి ఆభరణాలు చోరీకి గురి అయ్యాయా అనే అనుమానం నా లాంటి భక్తులకు కలుగుతుంది.

                                                                       


                           ఈ  రోజు ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమైన వార్తా క్లిప్పింగ్ ని ఆసాంతం చదవండి. ఆభరణాలు మాయమయిన తీరు , ఎవరి మీద తీవ్రమైన చర్యలు తీసుకోకముందే తిరిగి అవి ప్రత్యక్షమైన తీరు , అలా ప్రత్యక్షమైనవి , పోయిన పాతవి కాదని , కొత్తవి చేయించి వేశారని పూజారులు అనుకుంటున్న విధానం గమనిస్తే ఖచ్చితంగా ఎదో గూడుపుఠాణి ఈ  తతంగం వెనుకాల ఉందని అనిపిస్తుంది. నిజంగా ఎదో మాములుగా డబ్బుకు కక్కుర్తి పడి ఎవరో అర్చకులు ఈ పని చేసి ఉంటే పది మందికి తెలియకముందే అధికారులు , ఇతర పూజారులు దానిని గమనించి , వారిని నయానో భయానో ఒప్పించి తిరిగి అవే  ఆభరణాలు యధాస్థానం లో పెట్టిoచి  ఉండేవారు. కానీ ఇక్కడ లబ్ది పొందే వారికి కావాలసింది అది కాదు. ఆభరణాలు పోయాయి అన్న పబ్లిసిటీ విపరీతంగా జరగాలి. దానితో పాటు పాత నగల స్తానం లో కొత్త నగలు ఉంచి కేసును మాఫీ చేయాలి. ఇలా ఎందుకు అంటే :

        విదేశీ స్మగిలింగ్ మార్కెట్లో ఎనో ఏండ్లు పూజలు అందుకున్న వస్తువులకు గిరాకీ కోట్లలో ఉండి  ఉండాలి . అలాంటి వస్తువు పోయాయని మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసరికి , అటువంటి వాటి కోసమే ఎదురు చూస్తున్న స్మగ్లర్ లు అందరికి ఈ  విషయం తెలిసిపోయి సదరు ఆభరణాలు కొనడానికి వారందరు ఆసక్తి చూపడం వలన వారి మధ్య పోటీ ఏర్పడడం వలన పవిత్ర  ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి మాక్జిమం ధరకి అమ్ముడు పోయే అవకాశం ఉంటుంది . ఈ కారణం వలననే గత నెల రోజులుగా పోయిన ఆభరణాలకు పబ్లిసిటీ ఇస్తున్నట్లు ఉంది. ఆంధ్ర జ్యోతి వారు చెప్పినట్లు ఈ తతంగం వెనుకాల పూజారులు తోపాటు కీలక  దేవాదాయశాఖ అధికారులు కూడా ఉండి ఉంటారు. 

    భగవంతుండు అంటే నమ్మక్కమ్ . భగవంతుని కి ఆభరణాలు అలంకరించి పూజలు చేసే విధానం అంతా భక్తుల విశ్వాసం తో కూడుకున్నదే . ఎన్నో ఏండ్ల నుండి లక్ష్మణ  సహిత  సీతారామ చంద్ర మూర్తులకు అలకరింపడి , పూజలు చేయబడుతుంది ఆభరణాలకు ఎంతో పవిత్రత చేకూరింది . అటువంటి ఆభరణాలు దొంగతనం చేయడమనే ఆలోచన కరడుకట్టిన నేర మనస్తత్వం ఉన్న చోరులకు తప్పా అన్యులకు ఉండదు.అటువంటి ఆభరణాలు తస్కరించిన వారిని కనుగొని శిక్షింప చేయకుండా , వారి చేత కొత్తఆభరణాలు చేయించి వాటితో దేవతామూర్తులను అలంకరించి , అవే  ఇవి అని భక్తులను నమ్మింప చేయబూనడం మహా పాపం , నమ్మక ద్రోహం మాత్రమే కాక దైవ ద్రోహం. 

    కాఁబట్టి ఈ  విషయం లో తెలంగాణా ఎండోమెంట్ అమాత్యులు మరియు ఉన్నతాధికారులు ,అత్యున్నత విచారణ సంస్థల చేత  విచారణ  చేయించి , ఈ  విషయం లో నిజా నిజాల నిగ్గు తేల్చి ,ఒకవేళ ఇప్పుడు అలకరించినవి కొత్త ఆభరణాలు అయితే , స్వామీ వారి అసలు ఆభరణాలు స్వామీ వారికి చేరేలా తగిన చర్యలు  తీసుకోవడమే కాక , ఈ విషయం లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రాసిక్యూట్ చేసి వారికి శిక్షలు పడేలా చూడగలందులకు తద్వారా  భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా చూడాలని ఈ పోస్టు ద్వారా కోరడమైనది.  


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!