రిజర్వేషన్ లు అంటే ఆగ్రహం వెలిబుచ్చే వారంతా "రెండో రకం మెదడు " వారేనా ??!!!


                                                                         

                                   
                                 ఈ  దేశం లో రిజర్వేషన్ సిస్టం మీద కారాలు మిరియాలు నూరేవారు , ఈ  మద్య ఎక్కువుగా సోషల్ మీడియాలలో హల్  చల్ చేస్తున్నారు. కుల ప్రాతిపదిక న రిజర్వేషన్ లు వద్దని , ఆర్దిక ప్రాతిపదిక న రిజర్వేషన్ లు అమలు చేయాలని ఒక విచిత్ర వాదాన్ని వారు ముందుకు తెస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్దిక ప్రాతిపదిక పరంగా ఆర్దికంగా విద్యార్దులకు సహాయం చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు. కాని ఇది చాలదు అని ఉద్యోగాలలో కూడా ఆర్దిక ప్రాతిపదిక మీదే రిజర్వేషన్లు కల్పించాలని అడ్డగోలు వాదం చేయడమే కొంచం ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. ఈ  విషయం లో రాజకీయ నాయకులు మౌనంగా ఉండి తమాషా చూస్తున్నారు. ఎందుకంటే ఒక్క సారి రిజర్వేషన్ ల తుట్టె ను కదిపితే ఏమి జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే కొంతమంది పిల్లలను రెచ్చగొట్టి , వారిని ముందు పెట్టి వీరు తెర వెనుక బాగోతం నడుపుతున్నట్లు అనుమానంగా ఉంది.  ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఈ విషయం మీద ఎక్కువుగా స్పందిస్తున్న తీరు చూస్తుంటె , వారి వెనుక ఉన్న వర్గాల స్వబావం తెలుసుకోలేనంత మూర్కులు కారు, మెజార్టీ  రిజర్వేషన్ అనుకూల వర్గాల వారు.

                            ఉద్యోగ  గ్యారంటి అనేది భారతీయ పౌరులకు ప్రాదమిక హక్కుగా ఉంటే అసలు రిజర్వేషన్ లు గురించి ఇంత గొడవ ఉండకపోవునేమో . కానీ అత్యదిక జనాబా కలిగిన ఈ  దేశం లో అది సాద్యం కాదని బావించిన , స్వతంత్ర భారత తొలి తరం మేదావులు , పౌరులకు రిజర్వేషన్ పద్దతిని ప్రవేశపెట్టి , వెనుకబడిన ప్రజలను పోటి ప్రపంచం లో నిలదొక్కుకునేటట్లు చేయడానికి ప్రయత్నించారు. అసలు రిజర్వేషన్ లు ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలి అన్న దానికి కూడా అంతులేని మేదో మదనం జరిగాకే చివరకు ఆర్దిక వెనుకబాటు తనం రిజర్వేషన్ కు ప్రాతిపదికగా పనికి రాదనీ , సామాజిక వెనుకబాటుతనమే గీటు  రాయి కావాలని తేల్చారు. అంతే  కాని ఇప్పటి రిజర్వేషన్ వ్యతిరేక వర్గాల వారు అనుకుంటున్నట్లు ఏ మాత్రం ఆలోచన చేయకుండా అడ్డగోలుగా ఇచ్చినవి కావు రిజర్వేషన్ లు. ఒక నిరుపేదను నిముషం లో కోటిశ్వరుడిని చేయవచ్చు, ఒక కోటి రూపాయల చెక్ మీద చిన్న సంతకం చేయడం ద్వారా . కాని ఒక వెనుకబడిన మెదడును మేదావి మెదడుగా మార్చాలి అంటె తరాల కాలం పడుతుంది. అందుకు బలమైన రుజువునిచ్చే సాక్ష్యాన్ని తమ పరిశోదనల  ద్వారా  రుజువు చేసారు , లండన్ లోని ఆక్స్పర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ణులు . పై చిత్రం లోని విషయం దానికి సంబందించిందే . 


                            కాబట్టి సామాజిక వెనుకబాటు అంటె , మేదో  పరంగా వెనుకబాటు అని అర్దం చేసుకోవాలి . సామజిక వెనుక బాటు తనానికి , మనదేశం లో అనాదిగా ఉన్న అణగారిన "కులాలు " ప్రాతిపదికగా చేసారు . ఇది చాలావరకు కరెక్టే . కాని అగ్రవర్ణాలలో కూడా మేదో  పరంగా అభివృద్ధి చెందని వారు ఉన్నారు. వారి వారి సామాజిక నేపద్యం ద్వారానో, I Q టెస్ట్ ల ద్వారానో   వారిని గుర్తించి వారికి కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు. కాని ఆర్దిక ప్రాతిపదికగా ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం అంత బుద్ది తక్కువ పని మరొకటి ఉండదు. అసలు రిజర్వేషన్ లే లేకపోతే ఈ  పాటికి ఉన్నత  వర్గాలు , అణగారిన వర్గాలు మద్య అంతరం మరింత ఎక్కువ అయి మరొక స్వాతంత్ర్య పోరాటం వచ్చి ఉండెది.ఒక వేళ అణగారిన వర్గాల ప్రజలు , రిజర్వేషన్ లను వ్యతిరేకించవలసి వస్తే ,  మరో స్వాతంత్ర్య పోరాటం  రాకుండా చేసినందుకు  రిజర్వేషన్ ల ను వ్యతిరేకించాలి. 
                            డబ్బు కోసం గడ్డి తినే వారు, లక్షల కోట్లు వెనకేసుకుని, వోట్లను కొని సీట్లు సంపాందించే రాజకీయ నాయకులు , ప్రైవేట్ విద్యావిదానం ద్వారా డబ్బున్న వారికి సీట్లు అమ్ముకునే వారు , పేపర్ లీక్ ల ద్వారా దొడ్డి దారిన మార్కులు పొందే ఘరానా దొంగలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సమాజంలో నిజంగా  "ప్రతిభ" అనేదానికి అర్దం ఉందా?  ఈ  దేశం లో 30% నుండి 40% వరకు బోగస్ డిగ్రి పట్టాలు అమలవుతున్నాయని ఈ  మద్య ఒక సర్వే లో తేలింది అంటున్నారు. అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది తప్పుడు కుల ద్రువీకరణ పత్రాలు ద్వారా ఉద్యోగాలు చేస్తూ రిజర్వేషన్ సిస్టం ని అపహాస్యం పాలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. డబ్బున్న వారికి సీట్లు కేటాయిస్తుంటే అబ్యంతరం చెప్పని వారు, రిజర్వేషన్ వర్గాల వారిని సోషల్ మీడియాలో కించపరచే విదంగా ప్రకటనలు చేస్తూ ,అవమానపరచడం ఎంతవరకు సబబు? 

    నిజంగా ఈ  దేశం లో రిజర్వేషన్ లను సమీక్షల పేరుతో కాని, మరే వంకతో కాని తీసివేసే దమ్ము ఏ రాజకీయ పార్టికి అయినా ఉందా? ఉంటే సీమాంద్రాలో కాంగ్రెస్ కి పట్టిన గతే సదరు రాజకీయ పార్టికి పడుతుంది అని తలలో మెదడు ఉన్న వారికెవరికైనా అర్దం అవుతుంది. మరి జరుగని వాటి కోసం ఇంత ఆర్బాటాలు ఎందుకు? ఎందుకంటె ఆ వంక తో అయినా అగ్రవర్ణాలలో కొంతమంది మెప్పు పొంది తమ రాజకీయ పబ్బం గడుపుకుందాం అనే దూ(?)రాలోచన . ఒకవేళ వారు కోరుకున్నదే జరిగితే అందుకు రిజర్వేషన్ ల వర్గాల వారు కూడా సంతోశించవచు. ఎందుకంటె ఎప్పట్నుంచో వారు కోరుకుంటున్న రాజ్యాధికారం వారికి వచ్చి తీరుతుంది. రాజ్యాధికారం ఉన్న వాడికి రిజర్వేషన్ లు ఉంటె ఎంత? లేకుంటే ఎంత? ఆప్ట్రాల్ !

    అసలు రిజర్వేషన్ లు గురించి నిజమైన మేదావులు ఎవరూ అంతగా అందోళన చెందంటం లేదు  . ఎందుకంటె మన దేశా నికి అది ఒక "నేసెస్సరి ఇవిల్  ". ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు తమ పరిశొదనలు ద్వారా తెలుసుకున్న విషయాలలో మెదడు అభివృద్ధి చెందిన వారిలో , విద్యా , వినయం, జ్ఞాపకశక్తి , తృప్తి, అనే సానుకూల అంశాలు ఎక్కువుగా ఉంటాయి  అట . అదే మెదడు అంతగా అభివృద్ధి చెందని "రెండొ రకం మెదడు " వారికి ఆగ్రహం, నిబందనల ఉల్లంఘన , నిద్ర తక్కువ లాంటివి ఎక్కువ అట. మరి రిజర్వేషన్ల వ్యతిరేకత పేరుతో నిమ్నావర్గాలను కించపరచే ప్రకటనలు సోషల్ మీడియాలో గుప్పిస్తూ ఆగ్రహం వెలిబుచ్చుతున్న వారిలో ఆ "రెండవ రకం మెదడు" ఉండటమే కారణమా? అలా అయితే వారు రిజర్వేషన్లకు అర్హులే . కాబట్టి వారి వారి సామాజిక దామాషా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే సరిపోతుంది. 

      అసలు శాస్త్రీయంగా రిజర్వేషన్ లు మీద ఒక సమీక్ష జరిపి, అన్ని సామాజిక వర్గాలలోని మేదొ పరంగా  వెనుకబడి ఉన్న వారికి ఉద్యోగాలలో , పదవులలో రిజర్వేషన్లు, అలాగే ఆర్దికంగా వెనుకబడిన వారికి ఆర్దిక పర సహాయం అందిస్తే కరెక్టు అవుతుందా ?  ఏది ఏమైనా అణగారిన వర్గాలు మేదో పరంగా వెనుకబడి ఉండటానికి కారణం కొన్ని సామాజిక వర్గాలకే విద్య పరిమితమవుతు రావడం. ఇప్పుడు ఒక్క సారిగా స్వాతంత్ర్యం వచ్చింది కదా అని మేదో పరంగా వెనుకబడిన వారు ఎక్కువుగా ఉన్న సామాజిక వర్గాలకు , మేదావులు ఎక్కువుగా ఉన్న సామాజిక వర్గాలకు పోటి పెడితే కరెక్టా? ఆర్దిక పరమైన రిజర్వేషన్లు ప్రాతిపదికగా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే , అణగారిన వర్గాల నుండి అతి తక్కువ మంది మాత్రమే ఉద్యోగాలు పోందుతుంటె , ఇప్పటి దాక అణచివేతను అవలంభించిన  వర్గాలవారే  ఎక్కువ లబ్ది పొందుతారని , మేదావుల అభిప్రాయం.  అందుకే ఇప్పటి విదానానే కొనసాగిస్తూ , అగ్రవర్ణాలలో మేదో పరంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా కొంత శాతం రిజర్వేషన్ కల్పిస్తే మంచిది. ఇందుకోసం 60 యేండ్ల రిజర్వేషన్ విదానం మీద ఒక సమీక్ష జరిపినా బాగుంటుంది.

          అంతే   కాని రిజర్వేషన్ వర్గాలను కించపరచే ప్రకటనలు చేస్తు , వారిని రెచ్చగొడుతూ , రిజర్వేషన్ ల మీద సమీక్ష జరపడమంటే దాని పలితం వేరే విదంగా ఉంటుంది. అది కచ్చితంగా   కొరివితో తల గోకుకున్నట్లే . కాబట్టి నిజమైన మేదావులు దీని మీద ఆలోచన చేయాలి.  ప్రతి పదేండ్లకి ఒక సారి సమీక్షలు జరుపుతూ , మేదో పరంగా  ప్రతిభ సాదించిన వారిని , వారి  పిల్లలను రిజర్వేషన్ కేటగిరి నుండి తప్పిస్తూ వెలితే కొంత కాలం నాటికి రిజర్వేషన్ లు అవసరం లేని సమాజాన్ని చూడవచ్చు. లేదు అంటె ప్రతి పౌరుడికి, వారి ప్రతిభకు తగ్గ  ఉద్యోగ గ్యారంటి  కల్పిస్తే  చాలావరకు రిజర్వేషన్ ల సమస్య తీరిపోవచ్చు. మరి అలా చేసే దమ్ము ఉందా నేటి రాజకీయ పార్టీలకు ?  అందుకు అణగారిన వర్గాల నమ్మకం పొందిన నాయకుల చేతిలో రాజకీయ పార్తీల పెత్తనం ఉండాలి. అప్పుడే అది సాద్యం.

                                                       (30/9/2015 Post Republished)

Comments

 1. sir , reservation job vachina taruvata promotion lo kuda kavala , talent to kakunda reservation tho promotion enthavaraku correct

  ReplyDelete
  Replies
  1. Avasaram ledani supreme court vaaru cheppinatlu umdi?

   Delete
 2. great anylasis sir u r 100% right

  ReplyDelete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!